సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖
🌻161. 'నిరహంకారా'🌻
అహంకారము లేనిది శ్రీమాత.
అహంకారము ప్రకృతులలో నొకటి. అష్టప్రకృతులన్నియూ, మూల ప్రకృతియగు శ్రీమాత నుండి ఏర్పడినవే. వానియందామె యున్నప్పటికినీ వాని ప్రభావము ఆమెపై యుండవు. ఆమెను బంధించున దేమియూ లేదు. అహంకారమనగా తానొకడు ప్రత్యేకముగ నున్నాడన్న భావన. అది సముద్రమందలి అలవంటిది. అల ప్రత్యేకముగా గోచరించునే గాని, నిజమునకు అలకు ప్రత్యేకమగు అస్తిత్వము లేదు కదా!
సముద్రముండుట వలన అల యున్నది కానీ, సముద్రము లేక అల లేదు. సముద్రమందలి అలవలె మానవుడు తానున్నానన్న భావన కలిగియుండును. తానుండుట యనగా శ్రీమాత యుండుటయే. తాను ప్రత్యేకముగా లేడు. అట్లు భావించుట వలన తనను తాను మొత్తము నుండి వేరుచేసుకొనుట జరుగును. ఎంత వేరు చేసుకొన్నచో అంత అహంకార భావము పెరుగును.
తమను గూర్చి తాము ప్రత్యేకముగ భావించుట పెరుగును. అపుడహంకారమను ఆవరణము పటిష్ఠముగా బంధించును. వేరుపడుట వలన జీవుడు బలహీనుడగును. మొత్తముతో కలిసి యుండుట వలన, మొత్తము బలము తననుండి కూడ వ్యక్తమగుచుండును. వేరుపడువారు అహంకారులు అని తెలియవలెను. వీరు సహజీవులతో కలియలేరు. ఇక శ్రీమాతతో ఏమి కలియగలరు?
సముద్రమునుండి లేచిన అల సముద్రమునుండి వేరుగ గోచరించును. అంతే కాదు. తనదైన గుణములను కొన్ని సంతరించు కొనును. లేచుట, పడుట, తీరముదాటు ప్రయత్నము చేయుట అల గుణములు. అట్లే ఏర్పాటు భావనవలన పెరుగుట, పడిపోవుట, అతిక్రమించు ప్రయత్నము చేయుట, చచ్చుట, పుట్టుట ఇత్యాదిని జీవులు అనుభవించుచున్నారు.
అలల వలెనే జీవితములు అత్యంత చంచలములై, తాత్కాలికములై, నిరుపయోగములై, అహంకారుల
జీవితములు సాగుచునుండును. అట్టివారికి కూడ పరిష్కారము నిచ్చునది శ్రీమాత ఆరాధనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 161 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirahaṃkārā निरहंकारा (161) 🌻
She is devoid of ego. Ego arises out of three guṇa-s viz. sattva, rajas and tamas, already discussed in nāma 139. Nirguṇa, which says that She is without these three guṇa-s. Since She does not have guṇa-s, it implies that She is devoid of ego.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Dec 2020
No comments:
Post a Comment