🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 18 🍀
హరివంశ పురాణ్ హరినామ సంకీర్తన్!
హరి వీణ సౌజన్ నేణే కాపీ!!
తయా నరా లాధలే వైకుంఠి జోడలే!
సకళహీ ఘడలే తీర్థాటన్!!
మనోమాఛగేలా తో తెథే ముకలా!
హరిపాఠీ స్థిరావలా తోచి ధన్స్!!
జ్ఞానదేవా గోడీ హరి నామాచీ జోడీ!
రామకృద్దీ ఆవడీ సర్వకాళ్!!
భజన
|| జయ్ విఠోబా రుఖమాయి ||
భావము:
హరి వంశ పురాణాలు చదవడము హరినామ సంకీర్తన చేయడము నాకు ఇష్టము. హరిని మించిన బంధువు నాకు తెలియనే తెలియడు. అట్టి నరుడికి వైకుంఠము ప్రాప్తించి అన్ని తీర్థాలు తిరిగిన ఫలితము లభించగలదు.
మనో మార్గమున నడిచే వాడు అక్కడనే ముక్కి చెడి పోవును. హరి పాఠమును మనసునందు స్థిరము చేసిన వారే ధన్యులు. హరినామము నా నిల్వ ధనము రామకృష్ణ నామము నాకు ప్రియము.
కావున నేను సర్వకాలములందు హరిపాఠము పాడినానని జ్ఞానదేవులు తెలుపుచున్నారు.
🌻. నామ సుధ -18 🌻
హరివంశ పురాణము చదువుము
హరినామ సంకీర్తన పాడుము
హరిని మించిన సౌజన్యము
లేదు నాకు అన్య ఆధారము
అట్టి నరునిది పరమభాగ్యము
చేరి పోవును వైకుంఠ ధామము
తీరాలన్నియు తిరిగిన ఫలితము
హరినామమున సకలము సిద్ధము
నడిచే వాడు మనో మార్గము
నశించి పోవును తథ్యము కనుము
హరి పాఠమున మనసు స్థిరము
చేసిన వారిదే ధన్య జీవనము
జ్ఞానదేవునికి అయినది మధురము
హరినామమే నిలువ ధనము
రామకృష్ణ నామము ప్రియము
పాడిరి వారు సర్వకాలము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
27 Dec 2020
No comments:
Post a Comment