భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 195


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 195 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జమదగ్నిమహర్షి-రేణుక - 1 🌻

జ్ఞానం:


01. సూర్యుడు జమద్గ్ని-రేణుకల ఏకాంతాన్ని భంగంచేసిన కారణంగా, నువ్వు రాహుగ్రస్తుడవై, పాదదృశ్యుడవై, హతతేజుడవు అవుతూ ఉంటావు అని సూర్యుణ్ణి శపించాడు జమదగ్ని. అందుకనే జ్యోతిశ్శాస్త్రంలో, రాహువు సూర్యుణ్ణీ కమ్ముకోవటం మనం చూస్తూవుంటాము.

02. మహర్షులక్రోధం క్షణకాలమే ఉంటుంది. క్షణమే భగ్గుమంటుంది. ఉత్తరక్షణమే అనుగ్రహిస్తారు. దీర్ఘక్రోధం బ్రాహ్మణలక్షణంకాదని శాస్త్రం చెబుతున్నది. నిన్నజరిగిన అవమానానికి నేడుకూడా మండిపడేవాడు బ్రాహ్మణుడుకాడు. అప్పటికప్పుడు క్రోధమ్రావచ్చు, కాని వెంటనే మరచి పోవాలి. ఉత్తరక్షణంలో అనుగ్రహమ్రావాలి మళ్ళీ. అటువంటి లక్షణాన్నే బ్రాహ్మణుడు కలిగిఉండాలి. సూర్యుని విషయంలో జమదగ్ని స్వభావం అలాగే ఉంది.

03. ఆ కాలంలో క్షత్రియులైన హైహయవంశరాజులు ప్రస్తుతపు ఉత్తరభారతదేశమంతాకూడా, నేటి అఫ్ఘనిస్తాన్‌సహా, పరిపాలిస్తూ ఉండేవారు. వాళ్ళూ అప్పటికి బాగా తపస్సులు, క్రతువులు చేసినవాళ్ళే, మూర్ఖులుకారు. కానివ్యక్తుల గుణంలో ధర్మంలేదు. వ్యక్తిలో తపస్సు ఉండచచ్చు.

04. ధర్మంకూడా లోపల తెలిసి ఉన్నప్పటికీ, వారు దురహంకారం కలిగి ఉండవచ్చు. ఇలాంటి లోపాలేవో కొన్ని హైహెయవంశపు రాజులలో ఉన్నాయి. ఆ వంశంలో కార్తవీర్యార్జునుడు పుట్టాడు.

05. యజ్ఞమందు క్రోధము, శంతముమొదలైన హుణాలన్నీ కూడా దేవతాస్వరూపాలలో, అంటే మంత్రస్వరూపాలలో ఉంటాయి. వాటికి వాస్తవంగా రూపములతో వ్యక్తిత్వాలు ఎవీలేవు. దేవతలన్నీ కూడా మంత్రములందే ఉంటాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Dec 2020

No comments:

Post a Comment