మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 104
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 104 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 4 🌻
రుద్రసూక్తము మహాసముద్రము వంటిది. ఇలా కూర్చుని ఒక సంవత్సరం పాటు చెప్పుకోవచ్చు. తిండి తింటున్నారు, నీళ్ళు త్రాగుతున్నారు, మీరంతా ఆ తిండి రూపంలోను నీళ్ళ రూపంలోను కూడా రుద్రుడు మీ మీద పనిచేస్తన్నాడు. నువ్వు తిన్న దాన్ని బట్టి ఆ రుద్రుడు "యేపాత్రేషు వివిధ్యన్తి" ఆ పాత్రల్లో ఉండి నువ్వు జాగ్రత్తగా మూతబెడితే తిననిస్తున్నాడు.
మూత పెట్టకపోతే ఆ అన్నమునే ఆ ఆహారమునే ఆయుధాలుగా తీసికొని "అన్నం వాతో వర్షంఇషవః" అన్నము, గాలి, నీరు, వీటిని (బాణాలుగా) ఆయుధాలుగా గ్రహించి నీవు చేసిన తినకూడనివి తినుట, త్రాగకూడనివి త్రాగుట తినకూడని సమయమున తినుట, మొదలగు పనులకు, పొట్టలో శూలాలు పెట్టి (కడుపునొప్పి) పొడుచుట డమరుకములను మ్రోగించుట చేయుచున్నారు జాగ్రత్త జాగ్రత్త ఇలాంటివన్నీ రుద్రసూక్తంలో లక్షలు ఉన్నాయి.
నేడు రుద్రాన్ని మనం చేస్తున్నాము. సంతోషకరమైన విషయం ఏమంటే ఏమనుకోకండి మీలో వయస్సులో నా కంటే చిన్నవాళ్ళు ఉన్నారు వయస్సులో మాత్రమే ఈ పరమపవిత్రమయిన యజ్ఞం ఈ రోజున గాదు ఏ రోజున జరిగినా నేను భౌతికంగా రాగలిగిన పరిస్థితిలో తప్పక వస్తాను.
నమస్సోమాయాచ...... రుద్రాయచ......అని ముక్త కంఠాలతో, ఉచ్చై స్వరాలతో మానవాళి మొత్తం శివుడు, శంకరుడు, అయిన ఆ రుద్రమూర్తిని అర్చించే పుణ్యదినం మహాశివరాత్రి.
బలవంతపు జాగారం కాకుండా, శివుని సన్నిధిలో ఆత్పార్పణం జరిగిన సాధకునికి, తానుండటం మానివేసి, ఆ రాత్రి శివుడే తనలో వసించి, సాన్నిధ్యం ప్రసాదించడం వల్ల అప్రయత్నంగా ఆ రాత్రి గడిచి, ఉషోదయం జరుగుతుంది. అటువంటి రాత్రిని శివరాత్రి అనాలి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు..
..✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
15 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment