వివేక చూడామణి - 152 / Viveka Chudamani - 152


🌹. వివేక చూడామణి - 152 / Viveka Chudamani - 152🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -7 🍀


499. ఆకాశానికి వలె నాకు ఏ మాత్రము మకిలి అంటదు. కనిపిస్తున్న వస్తువులన్నింటి కన్నా ప్రత్యేకమైనవాడను. అలా నేను సూర్యుని వలె ప్రకాశించెడి వస్తువులన్నింటికి వేరైన వాడను.

500. నాకు శరీరముతో సంబంధము లేదు. ఎలా అంటే ఆకాశానికి మేఘాలతో సంబంధములేనట్లు. అందవలన ఏవిధముగా మెలుకవ స్థితిని, కలలోని లేక గాఢ నిద్రలోని శారీరక స్పందనలు నాకు వర్తించవు కదా!

501. ఉపాధి అనేది రూపొందుతుంది. అది వస్తుంది, పోతుంది. అది మరల కర్మలు చేసి అనుభవములు పొంది అది క్రమముగా అంతమై నశిస్తాయి కానీ నేను ఆత్మను సదా స్థిరముగా ‘కులు’ పర్వతము వలె ఉంటాను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 152 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 7 🌻


499. I am beyond contamination like the sky; I am distinct from things illumined, like the sun; I am always motionless like the mountain; I am limitless like the ocean.

500. I have no connection with the body, as the sky with clouds; so how can the states of wakefulness, dream and profound sleep, which are attributes of the body, affect me ?

501. It is the Upadhi (superimposed attribute) that comes, and it is that alone which goes; that, again, performs actions and experiences (their fruits), that alone decays and dies, whereas I ever remain firm like the Kula mountain.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 Nov 2021

No comments:

Post a Comment