స్వామి నిగమానంద సరస్వతితో డా...మీఛెల్ సంభాషణ :
డాక్టర్ : భూత ప్రేతాలను గూర్చి మీ అభిప్రాయం ఏమిటి ?
స్వామి నిగమానంద :
చనిపోయిన తరువాత అసంతృప్తి గల ఆత్మకు ఉండే వాయురూపాన్ని భూతమనీ, ప్రేతమనీ అంటారు. క్రింది స్థాయి మనిషి, లేదా ఆత్మహత్య చేసుకున్న వాడు చాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది. అతను చచ్చిపోవడమయితే జరిగింది, కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఎందుచేతనంటే అతని ఆత్మ ఆ సమయంలో గాఢ సుషుప్తిలో ఉంటుంది. భూత ప్రేతాలు మనుష్య శరీరాన్ని ధరించడం సులువు కాదు. అనేక ప్రయత్నాలు చేసిన మీదట అది భాష్పీయ [ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పం ఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుంది కూడా..... కానీ ఆ శరీరం సామాన్య కారణాల వల్ల కరిగి పోగలదు. పరలోక గతమయిన ఆత్మ రక్త సంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు.
పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు.... ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని, భాజాలు, సంగీతం, లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.
డా.మిఛెయిల్ :
చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళేదెక్కడికి ?
స్వామి నిగమానంద :
సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం. స్వర్గలోకం వరకు చేరుతుంది. మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగగా మిగిలి ఉంటుంది .ఆ వాయుశరీరాన్ని ఆధారం చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంత వరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలి ఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారణ చేయవలసి ఉంటుంది.
డా.మిఛెల్ : ఆజీవి భూలోకానికి చేరేదెలా ?
నిగమానంద సరస్వతి :
అతను స్వర్గలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బుల ద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు. దాన్ని మనుషులు తినవచ్చు. లేదా పశువులు తింటాయి. అలా తిండి ద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లి కడుపులోకి చేరుతాడు. మనిషిగా గాని లేదా పశువుగానైనా ఏదో ఒక జీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆ జీవి జన్మ . అంతకుపూర్వం అనుభవించగా మిగిలి ఉన్న దాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈ విధంగా ఆ జీవి భోగం [అనుభవం] పూర్తవుతుంది.
15 Nov 2021
No comments:
Post a Comment