15-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, సోమ వారం, నవంబర్ 2021 ఇందు వారము 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 275 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 475 🌹 
4) 🌹 వివేక చూడామణి - 152 / Viveka Chudamani - 152🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -104🌹  
6) 🌹 Osho Daily Meditations - 93🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 152 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 152🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*15, నవంబర్‌ 2021, ఇందు వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 11వ రోజు 🍀*

*నిషిద్ధములు : పులుపు, ఉసిరి*
*దానములు : వీభూదిపండ్లు, దక్షిణ*
*పూజించాల్సిన దైవము : శివుడు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ*
*ఫలితము : ధనప్రాప్తి, పదవీలబ్ధి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 06:40:08 
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం, యోగం మరియు కరణం
నక్షత్రం: ఉత్తరాభద్రపద 18:10:53 
వరకు తదుపరి రేవతి
యోగం: వజ్ర 25:34:55 వరకు 
తదుపరి సిధ్ధి
కరణం: విష్టి 06:40:08 వరకు
వర్జ్యం: 02:46:48 - 04:29:16 
మరియు 29:39:30 - 42:23:34
దుర్ముహూర్తం: 12:23:11 - 13:08:28 
మరియు 14:39:02 - 15:24:20
రాహు కాలం: 07:45:47 - 09:10:42
గుళిక కాలం: 13:25:27 - 14:50:22
యమ గండం: 10:35:37 - 12:00:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 13:01:36 - 14:44:04
సూర్యోదయం: 06:20:52
సూర్యాస్తమయం: 17:40:12
వైదిక సూర్యోదయం: 06:24:38
వైదిక సూర్యాస్తమయం: 17:36:27
చంద్రోదయం: 15:18:48
చంద్రాస్తమయం: 02:53:00
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మీనం
గద యోగం - కార్య హాని , చెడు 
18:10:53 వరకు తదుపరి 
మతంగ యోగం - అశ్వ లాభం
పండుగలు : వైష్ణవ ఉథ్థాన ఏకాదశి, తులసి వివాహం Vaishnava Utthana Ekadashi, Tulasi Vivah
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -276 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 12-3
 
*🍀 12-3. కర్తవ్య కర్మ - ఆశామోహములు దరి రానీయకుండగ యుండవలె నన్నచో కర్తవ్యమే శరణ్యము. ఈ కర్తవ్యమునే “కార్యం, కర్మ" అని భగవద్గీత వచించినది. చేయవలసిన పనిని కార్యం కర్మ అందురు. మోహపడుట, ఆశపడుట ఎచ్చటుండునో అచ్చట అజ్ఞానము వలన బంధముండును. వానివలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు జీవుని పట్టును. అట్టి వానికి నిష్కృతి లేదు. ఈ ఒక్క సూత్రము చిన్నతనముననే తెలిసినచో అట్టి జీవుడు వికృతిని బడక, ప్రకృతి యందుండి, కర్తవ్యకర్మ మార్గమున సంస్కృతిని పొందును. 🍀*

*మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |*
*రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12*

*తాత్పర్యము : మోహముచేతను, ఆశచేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.* 

వివరణము : భగవంతుడు గీతాబోధన నడుమ మోహము, ఆశ, వానితో కూడిన కర్మలు అజ్ఞానమువలన నిర్వర్తింప బడునని, దాని వలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు మానవు నాశ్రయించునని తెలిపెను. ఆశామోహములు దరి రానీయకుండగ యుండవలె నన్నచో కర్తవ్యమే శరణ్యము. ఈ కర్తవ్యమునే “కార్యం, కర్మ" అని భగవద్గీత వచించినది. చేయవలసిన పనిని కార్యం కర్మ అందురు. ఏ భాషణమైనను, చేష్ట అయినను చేయవలసినదే చేయవలెను. ఇతరములు చేసినచో ప్రకృతి బంధించుట తప్పదు.

కనుక మోహపడుట, ఆశపడుట ఎచ్చటుండునో అచ్చట అజ్ఞానము వలన బంధముండును. వానివలన మోహిని, ఆసురి, రాక్షసి అను మూడు వికృతులు జీవుని పట్టును. అట్టి వానికి నిష్కృతి లేదు. ఈ ఒక్క సూత్రము చిన్నతనముననే తెలిసినచో అట్టి జీవుడు వికృతిని బడక, ప్రకృతి యందుండి, కర్తవ్యకర్మ మార్గమున సంస్కృతిని పొందును. తెలుగు వారికి “ఆశా మోహముల దరి రానీకోయి, అన్యులకే నీ సుఖము అంకిత మోయి" అను గీతం వరముగ అందజేయబడినది. ఈ శ్లోకము సారాంశ మదియే.

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 475 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 35

*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 3 🌻*

స్త్రీలోలుని స్పృశించినంత మాత్రాన పుణ్యమంతయూ నశించును. స్త్రీ లోలుడు పరమపాపి. వానిని చూచినచో, పాపము చుట్టు కొనును (20). స్త్రీలోలుడైన పురుషుడు మంచి కర్మలను చేసిననూ సర్వదా అపవిత్రుడే యగును. ఆతనిని పితృదేవతలు, దేవతలు, మరియు సర్వమానవులునిందించెదరు (21).ఎవని మనస్సు స్త్రీలయందు లగ్నమై యుండునో, వానికి జ్ఞానముతో గాని, గొప్ప తపస్సుతోగాని, జపహోమ పూజాదులతో గాని, విద్యతోగాని, దానముతో గాని పని యేమున్నది? (22) నీకు తల్లిని అగు నాయందు నీవు స్త్రీ భావమును కలిగి మాటలాడి నావు. నేను నిన్ను శపించుచున్నాను. నీవు కాలక్రమములో క్షయమును పొందగలవు (23). 

వసిష్ఠుడిట్లు పలికెను -

ధర్ముడు ఆ పతివ్రత యొక్క శాపమును విని రాజవేషమును విడిచి పెట్టెను. ఆ దేవదేవుడు నిజరూపమును ధరించి వణికిపోవుచూ ఇట్లనెను (24).

ధర్ముడిట్లు పలికెను -

నేను ధర్ముడనని తెలుసుకొనుము. ఓ తల్లీ! నేను జ్ఞానులకు, గురువునకు కూడ గురువును. ఓ పతివ్రతా! నేను సర్వదా పరస్త్రీని తల్లి అను బుద్ధితో దర్శించెదను (25). నేను నీ మనస్సు నెరుంగుదును. అయిననూ, విధిప్రేరితుడనై నీలోని లోపమును కని పెట్టుటకు నీ వద్దకు వచ్చినాను (26). ఓ సాధ్వీ! నీవు నాకు తగిన శాస్తిని చేసితివి. నీవు శపించుటలో తప్పు లేదు. తప్పు మార్గములో వెళ్లువారికి ఈశ్వరుడు తగు శాస్తిని ఏర్పాటు చేయును (27). సర్వప్రాణులకు సుఖదుఃఖములను, పరములను స్వయముగానిచ్చువాడు, సంపదలను ఆపదలను కలిగించుటలో సమర్థుడు అగు ఆ శివుని కొరకు నమస్కారమగు గాక! (28)

శత్రుత్వమును నెరపుటకు, మైత్రిని చేయుటకు, ప్రీతిని చూపుటకు, కలహమును చేయుటకు, సృష్టిని చేయుటకు, సృష్టిని ఉపసంహరించుటకు ఎవడు సమర్థుడో, అట్టి శివుని కొరకు నమస్కారము (29). ఎవడు పాలను తెల్లగా చేసినాడో, సృష్ట్యాదియందు నీటిలో చల్లదనమును నింపినాడో, అగ్నిని వేడిగా నిర్మించినాడో, అట్టి శివుని కొరకు నమస్కారము (30). ఎంతయూ ఆలోచించి మహదాది క్రమములో ప్రకృతి నుండి ఎవడైతే సృష్టిని చేసి, బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా సృష్టించినాడో, అట్టి శివునకు నమస్కారమగుగాక! (31)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 152 / Viveka Chudamani - 152🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -7 🍀*

499. ఆకాశానికి వలె నాకు ఏ మాత్రము మకిలి అంటదు. కనిపిస్తున్న వస్తువులన్నింటి కన్నా ప్రత్యేకమైనవాడను. అలా నేను సూర్యుని వలె ప్రకాశించెడి వస్తువులన్నింటికి వేరైన వాడను. 

500. నాకు శరీరముతో సంబంధము లేదు. ఎలా అంటే ఆకాశానికి మేఘాలతో సంబంధములేనట్లు. అందవలన ఏవిధముగా మెలుకవ స్థితిని, కలలోని లేక గాఢ నిద్రలోని శారీరక స్పందనలు నాకు వర్తించవు కదా! 

501. ఉపాధి అనేది రూపొందుతుంది. అది వస్తుంది, పోతుంది. అది మరల కర్మలు చేసి అనుభవములు పొంది అది క్రమముగా అంతమై నశిస్తాయి కానీ నేను ఆత్మను సదా స్థిరముగా ‘కులు’ పర్వతము వలె ఉంటాను. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 152 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 7 🌻*

499. I am beyond contamination like the sky; I am distinct from things illumined, like the sun; I am always motionless like the mountain; I am limitless like the ocean.

500. I have no connection with the body, as the sky with clouds; so how can the states of wakefulness, dream and profound sleep, which are attributes of the body, affect me ?

501. It is the Upadhi (superimposed attribute) that comes, and it is that alone which goes; that, again, performs actions and experiences (their fruits), that alone decays and dies, whereas I ever remain firm like the Kula mountain.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 152 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 7 🌻*

499. I am beyond contamination like the sky; I am distinct from things illumined, like the sun; I am always motionless like the mountain; I am limitless like the ocean.

500. I have no connection with the body, as the sky with clouds; so how can the states of wakefulness, dream and profound sleep, which are attributes of the body, affect me ?

501. It is the Upadhi (superimposed attribute) that comes, and it is that alone which goes; that, again, performs actions and experiences (their fruits), that alone decays and dies, whereas I ever remain firm like the Kula mountain.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 104 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 4 🌻*
 
*రుద్రసూక్తము మహాసముద్రము వంటిది. ఇలా కూర్చుని ఒక సంవత్సరం పాటు చెప్పుకోవచ్చు. తిండి తింటున్నారు, నీళ్ళు త్రాగుతున్నారు, మీరంతా ఆ తిండి రూపంలోను నీళ్ళ రూపంలోను కూడా రుద్రుడు మీ మీద పనిచేస్తన్నాడు. నువ్వు తిన్న దాన్ని బట్టి ఆ రుద్రుడు "యేపాత్రేషు వివిధ్యన్తి" ఆ పాత్రల్లో ఉండి నువ్వు జాగ్రత్తగా మూతబెడితే తిననిస్తున్నాడు.* 

*మూత పెట్టకపోతే ఆ అన్నమునే ఆ ఆహారమునే ఆయుధాలుగా తీసికొని "అన్నం వాతో వర్షంఇషవః" అన్నము, గాలి, నీరు, వీటిని (బాణాలుగా) ఆయుధాలుగా గ్రహించి నీవు చేసిన తినకూడనివి తినుట, త్రాగకూడనివి త్రాగుట తినకూడని సమయమున తినుట, మొదలగు పనులకు, పొట్టలో శూలాలు పెట్టి (కడుపునొప్పి) పొడుచుట డమరుకములను మ్రోగించుట చేయుచున్నారు‌ జాగ్రత్త జాగ్రత్త ఇలాంటివన్నీ రుద్రసూక్తంలో లక్షలు ఉన్నాయి.* 

*నేడు రుద్రాన్ని మనం చేస్తున్నాము. సంతోషకరమైన విషయం ఏమంటే ఏమనుకోకండి మీలో వయస్సులో నా కంటే చిన్నవాళ్ళు ఉన్నారు వయస్సులో మాత్రమే ఈ పరమపవిత్రమయిన యజ్ఞం ఈ రోజున గాదు ఏ రోజున జరిగినా నేను భౌతికంగా రాగలిగిన పరిస్థితిలో తప్పక వస్తాను‌.* 

*నమస్సోమాయాచ...... రుద్రాయచ......అని ముక్త కంఠాలతో, ఉచ్చై స్వరాలతో మానవాళి మొత్తం శివుడు, శంకరుడు, అయిన ఆ రుద్రమూర్తిని అర్చించే పుణ్యదినం మహాశివరాత్రి.* 

*బలవంతపు జాగారం కాకుండా, శివుని సన్నిధిలో ఆత్పార్పణం జరిగిన సాధకునికి, తానుండటం మానివేసి, ఆ రాత్రి శివుడే తనలో వసించి, సాన్నిధ్యం ప్రసాదించడం వల్ల అప్రయత్నంగా ఆ రాత్రి గడిచి, ఉషోదయం జరుగుతుంది. అటువంటి రాత్రిని శివరాత్రి అనాలి. అందరికీ‌ శివరాత్రి శుభాకాంక్షలు..*

..✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 93 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 93. THE UNCONSCIOUS 🍀*

*🕉 The unconscious is nine times bigger than the conscious, so whatever comes from the unconscious is overwhelming. That's why people are afraid of their emotions, feelings. They hold them back, they are afraid they will create chaos. They do, but chaos is beautiful!. 🕉*

*There is a need for order, and there is a need for chaos too. When order is needed, use order, use the conscious mind; when chaos is needed, use the unconscious and let chaos be. A whole person, a total person, is one who is capable of using both, who does not allow any interference of the conscious into the unconscious or of the unconscious into the conscious. There are things that you can only do consciously.*

*For example, if you are doing arithmetic or scientific work, you can do it only from the conscious. But love is not like that, poetry is not like that; they come from the unconscious. So you have to put your conscious aside. It is the conscious that tries to hold things because it is afraid. It seems to it that something big is coming, a tidal wave; will it be able to survive? It tries to avoid it, it wants to escape, hide somewhere. But that is not right. That's why people have become dull and dead. All springs of life are in the unconscious.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 152 / Sri Lalita Sahasranamavali - Meaning - 152 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 152. కళానిధిః, కావ్యకళా, రసజ్ఞా, రసశేవధిః ।*
*పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా ॥ 152 ॥ 🍀*

🍀 797. కళానిధి: 
కళలకు నిధి వంటిది 

🍀 798. కావ్యకళా : 
కవితారూపిణి 

🍀 799. రసఙ్ఞా : 
సృష్టి యందలి సారము తెలిసినది 

🍀 800. రసశేవధి: : 
రసమునకు పరాకాష్ట 

🍀 801. పుష్టా : 
పుష్ఠి కలిగించునది 

🍀 802. పురాతనా ; 
అనాదిగా ఉన్నది 

803. పూజ్యా ; 
పూజింపదగినది 

🍀 804. పుష్కరా : 
పుష్కరరూపిణి 

🍀 805. పుష్కరేక్షణా ; 
విశాలమైన కన్నులు కలది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 152 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 152. Kalanidhih kavyakala rasagyna rasashevadhih*
*Pushtapuratana pujya pushkara pushkarekshana ॥ 152 ॥ 🌻*

🌻 797 ) Kala nidhi -   
She who is the treasure of arts

🌻 798 ) Kavya kala -  
 She who is the art of writing

🌻 799 ) Rasagna -   
She who appreciates arts

🌻 800 ) Rasa sevadhi -  
 She who is the treasure of arts

🌻 801 ) Pushta -   
She who is healthy

🌻 802 ) Purathana -   
She who is ancient

🌻 803 ) Poojya -   
She who is fit to be worshipped

🌻 804 ) Pushkara -   
She who gives exuberance

🌻 805 ) Pushkarekshana -   
She who has lotus like eyes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment