నిర్మల ధ్యానాలు - ఓషో - 277



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 277 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రపంచంలో నివసించు, ప్రపంచాన్ని నీలో నిలుపుకోకు. వేరుగా, నిర్మలంగా వుండు. అప్పుడు ప్రపంచం నీకెంతో బోధిస్తుంది. అది పరిణితి చెందడానికి అనువయిన పరిస్థితి. 🍀

మనిషి ప్రపంచాన్ని తిరస్కరించ కూడదు. కారణం దాంట్లో సౌందర్యం దాగి వుంది. అది లోపల దాగి వుంది. దాన్ని ఉపరితలానికి తీసుకురావాలి. అందువల్ల నేను దేనికీ వ్యతిరేకం కాను. శరీరానికి, ప్రపంచానికి, బాహ్యమయిన దానికి వ్యతిరేకిని కాను. కానీ ప్రతిదాన్ని పరివర్తింప జేయడానికి యిష్టపడతాను. పద్మానికి సంబంధించి అది నీటిలో నివసిస్తుంది. కానీ నీరు దాన్ని అంటదు. వాటి పత్రాలు నీటి బిందువుల్ని కూడా నిలుపుకోవు.

ప్రపంచంలో నివసించు, ప్రపంచాన్ని నీలో నిలుపుకోకు. ప్రపంచంలో వుండు, ప్రపంచానికి సంబంధించకు. వేరుగా వుండు. నిర్మలంగా వుండు. తాకకుండా వుండు. అప్పుడు ప్రపంచం నీకెంతో బోధిస్తుంది. ప్రపంచం అస్తిత్వానికి ఉపకరణం. అది ఎదగడానికి పరిణితి చెందడానికి అనువయిన పరిస్థితి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment