భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 111



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 111  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 3 🌻

14. భేదాలు లేకుండా, ద్రవ్యాన్నిబట్టి పదార్థమే అనే జ్ఞానం కలుగుతుంది. దానికి సన్నిహితమైనటువంటి, దానికి ఆధారమైన బ్రహ్మవస్తువు యొక్క అనుభవం తపస్సులో కలుగుతుంది. అది ఒక మార్గం.

15. ఈ వైవిధ్యానికి అంతులేదు. స్వజాతీయత, విజాతీయత భేదములు ఇంకా అనేకములు ఉన్నాయి. ఈ భేదము అపరిమితంగా పెరుగుతూఉంది.

16. కానీ, ఇంత క్లిష్టంగా కనబడేటటువంటి ఈ ప్రపంచానికి ఒకే పరమాత్మ కారణమని తెలుసుకున్ననాడు; అది ఒకటే ఉందనే విశ్వాసంతో నీవు ఆ ఒక్కటీ ఏదని ప్రశ్నించుకుంటే, ఆ ప్రశ్న తపస్సు అవుతుంది. అదే నిన్ను రక్షిస్తుంది. నీవు దానిని కనుక్కోలేవు.

17. ఎందుచేతనంటే, నీకున్నవి ఇంద్రియములు. ఒక ఇంద్రియానికి ఉండే శక్తి మరొక ఇంద్రియానికి లేదు. నీళ్ళలో ఉప్పువేశారంటే కంటికి కనబడదు.(కూరలో ఉప్పు సరిపోతుందా లేదా అని కంటితో చుచి ఎవరూ చెప్పలేరు. నాలుక మీద వేసుకుని రుచి చూచి చెప్పుతారు) జిహ్వేంద్రియానికి మాత్రమే ఉప్పును గుర్తించే శక్తి ఉంది. ఈ ప్రకారంగా, ఆత్మవస్తువును గుర్తించగలిగిన ఇంద్రియము మాత్రం నీ పంచేద్రియాలలో లేదు.

18. అది నీ అంతఃకరణమనే దానితోనే గుర్తించబడుతుంది. నాలుకతో ఉప్పును ఎలా గుర్తుపడతావో, అలాగే పరిశుద్ధమైన అంతఃకరణతో, ఏకాగ్రతతో ఏనాడు నీవు అన్వేషిస్తూ ప్రశ్నయందుంటావో, ఆనాడు నీకు ఆత్మవస్తువుయొక్క సాన్నిధ్యం ఏర్పడుతుంది.

19. నిజానికి రోజూ నిద్రావస్థలో నీవు దానిదగ్గరికే వెళ్ళుతున్నావు. అందుకనే సుఖాన్ని అనుభవిస్తున్నావు. మనస్సు, బుద్ధి, చిత్తము – అన్నీ నిన్ను గాఢనిద్రలో వదిలిపెడుతున్నాయి.

20. అక్కడ ఈ మనోబుద్ధి చిత్తములు దాని(ఆత్మవస్తువు) సన్నిధిదాకా వెళ్ళక, ఈ అంతఃకరణ అక్కడికివెళ్ళి నిద్రపోతోంది. అన్నిటికీ హేతువైనటువంటి జీవత్వం పొందిన అంతరాత్మ అక్కడికి వెళుతుంది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడే శాంతి కలుగుతుంది. కాబట్టి నీవు దానిని గుర్తించి, దానిని ఒకటే వస్తువుగా గుర్తించి తపస్సుచేసుకో. నీకు శాంతి కలుగుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

15.Sep.2020

No comments:

Post a Comment