శివగీత - 𝟼𝟹 / 𝚃𝚑𝚎 𝚂𝚒𝚟𝚊-𝙶𝚒𝚝𝚊 - 𝟼𝟹



🌹.   శివగీత - 63 / The Siva-Gita - 63   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము - 9 🌻

సన్నదంతో మంద దృష్టి :- కటుతిక్త కషాయభుక్,
వాత భుగ్న కటిగ్రీవా - కరోరు చరణో బలః 51

గదాయుత సామానిష్టో - పరిభూత స్స్వబంధుభి:
నిస్శౌచో మలది గ్దాంగ - ఆలింగిత పరోషితః 52

ధ్యాయన్న సులభా న్భోగా - న్కేవలం వర్తతే చలః
సర్వేంద్రి యక్రియాలోపా - ద్దాస్యతే బాల కైరపి 53

తతో మ్రుతిజ దుఃఖ స్య - దృష్టాంతో నో పలభ్యతే,
యస్మాద్భి భ్యతి భూతాని - ప్రాప్తా వ్యపి పరాం రుజమ్ 54

నీయతే మృత్యు నా జంతు :- పరిష్వక్తో పి బంధుభి:
సాగరాంత ర్జలగతో - గరుడేనేవ పన్నగః 55

కదిలిన దంతములు, మందగించిన దృష్టి గలవాడై రోగ నివారణమునకై కారము, చేదు, ఒగరు గల వస్తువులను వాడును. వాతము చేత వంగిన నడుము గతిక (కటి) భాగము, కుత్తుక, హస్తములు, తొడలు గలవాడై శక్తి హీనుడగును, మరియు ఈ పలురకాలైన వ్యాధులచేత కూడికొన్నవాడై మలముతో దూషితమైన దేహముగలవాడై, తన వారిచేత దూషితుడై, ఆచార హీనుడై ప్రవర్తించుచుండును. సులభముగా లభించని రుచికరమైన ఆహారమును, మెత్తని అవయములు పడక మొదలగు సుఖములనే కోరుచుండును.

అవయవములు కంపనము కలవాడై, సర్వేంద్రియముల శైథిల్యము వలన బాలుర చేతను అపహాస్యమునకు గురిఅగుచున్నాడు.

ఆనారోగ్యము, ముసలితనము మొదలగువాటి వలనను దారిద్ర్యాదుల తోడను అనుభవించిన దుఃఖముల కంటెను అధికమై ఎటువంటి వారికిని భయగ్రస్తుని చేయుచు సామ్యహీనమగుట చేత చావువలన దుఃఖమన్నింటిని మించిన దగును. సముద్రములో తలదాచు కొనియున్న పామునుకూడా గరుడని రీతిగా ఆత్మీయుల చేత చుట్టబడి యున్నను (ప్రాణి నైనను) మృత్యువు చేత నపహరించబడును.


🌹   The Siva-Gita - 63   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 9
🌻

With shivering limbs, with organs of deteriorated functions, he stays and becomes an object of mockery by the children and young ones.

Because of sickness, and poverty there remains no limit to his sufferings. Similar to how Garuda (eagle) attacks a snake even if it's hidden in waters, similarly even if surrounded by all the family members, in the end he becomes prey to the god of death.

Failing to keep himself clean, falling in filth and excreta, failing to remain spiritually pious as well; he becomes the object of scornful treatment from his family.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

15 Sep 2020

No comments:

Post a Comment