భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 45


🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 45   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 12 🌻

173. ఒక్క మానవ రూపమందే చరముగా ప్రత్యగాత్మ తన మూల తత్వమైన పరమాత్మస్థితిని అనుభూతి నొందగలదు.

174. భగవంతుడు తన దివ్య చైతన్యములో స్వయముగా సృష్టియందలి వస్తుజాలముతో తాదాత్మ్యత చెందుచున్నప్పుడు," నేను ఎవడను?" అన్నట్టి తొలిపలుకునకు బాహ్యమునకు నిజముగను, వాస్తవములో మిధ్య యైన యీ ఈ దిగువ సమాధానములు వచ్చెను.

నేను శిలను
నేను లోహమును
నేను వృక్షమును
నేను క్రిమిని, కీటకమును
నేను మత్స్యమును
నేను పక్షిని
నేను జంతువును
నేను పురుషుడను (లేక )స్త్రీని

175. భగవంతుడు తన దివ్యస్వప్నములో స్వయముగా మానవ రూపముతో తాదాత్మ్యత- చెందినప్పుడు అతని అతడింక అర్థస్పృహలో నుండక, పూర్ణచైతన్యము కలవాడయ్యెను.

Notes___ప్రత్యగాత్మ (ప్రత్యక్+ఆత్మ) పరమాత్మ నుండి వేరుపడిన ఆత్మ (Drop Soul).

176. మానవుని పూర్ణచైతన్యం యావత్తు దివ్యస్వప్న మును చెడగొట్టి మానవునికి తాను భగవంతుడుననెడి నిజమైన మెలకువ ఇచ్చుటకు కారణమైనది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

15 Sep 2020

No comments:

Post a Comment