మంత్ర పుష్పం - భావగానం - 12



🌹. మంత్ర పుష్పం - భావగానం - 12 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మంత్రం పుష్పం - 31 to 34 చివరి భాగం 🌻


🌻. మంత్రపుష్పం 31.

తద్విప్రాసో విపన్వవో

జాగృవాం స్సమిన్దతే

విష్ణోర్య త్పరమం పదమ్


🍀. భావ గానం:

కోరికలు దోషాలు లేని వారు

జాగృతి చలనాలు కలవారు

విష్ణులోక కాంతులు పెంచేరు

పరలోక ప్రకాశము పెంచేరు



🌻. మంత్ర పుష్పం 32.

ఋతగ్o సత్యం పరమ్బ్రహ్మ

పురుషం కృష్ణ పింగళమ్

ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం

విశ్వరూపాయ వై నమో నమః


🍀. భావగానం:

ముక్తినాధుడు సత్యరూపుడు

బ్రహ్మ రూపుడు నల్లనివాడు

పైకి వెలుగు తేజోవంతుడు

విరూపనేత్రుడు విశ్వరూపుడు

దేవదేవునకు మరల వందనము.



🌻. మంత్ర పుష్పం 33.

నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి

తన్నో విష్ణు ప్రచోదయాత్


🍀. భావ గానం:

నారాయణుని ఉహించెదను

వాసుదేవుని ధ్యానించెదను

విష్ణు చైతన్యము కలుగు గాక.



🌻. మంత్ర పుష్పం 34.

ఆకాశ త్పతితం తోయమ్

యథా గచ్ఛతి సాగరం

సర్వదేవ నమస్కారః

కేశవమ్ ప్రతి గచ్ఛతి


🍀. భావ గానం:

ఆకాశ ధారాల నీరులు

ఎలా సాగరమే చేరునో

సకలదేవ వందనాలు

ఆ పరందామునే చేరును.

మంత్రపుష్పం సంపూర్ణం

సర్వం భగవదర్పణం స్వాహా.

సమాప్తం.
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం


03 Oct 2020

No comments:

Post a Comment