శ్రీ విష్ణు సహస్ర నామములు - 27 / Sri Vishnu Sahasra Namavali - 27


🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 27 / Sri Vishnu Sahasra Namavali - 27   🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మిధునరాశి- పునర్వసు నక్షత్ర 3వ పాద శ్లోకం


🌻 27. అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ‖ 27 ‖


🍀. అసంఖ్యేయః ---
లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.

🍀. అప్రమేయాత్మా ---
కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.

🍀. విశిష్టః ---
అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడని వాడు.

🍀. శిష్టకృత్ ---
తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.

🍀. శుచిః ---
పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.

🍀. సిద్ధార్థః ---
సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.

🍀. సిద్ధసంకల్పః ---
సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.

🍀. సిద్ధిదః ---
భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.

🍀. సిద్ధిసాధనః ---
సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Vishnu Sahasra Namavali - 27   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Midhuna Rasi, Punarvasu 3rd Padam

🌻 27. asaṅkhyeyō prameyātmā viśiṣṭaḥ śiṣṭakṛcchuciḥ |
siddhārthaḥ siddhasaṅkalpaḥ siddhidaḥ siddhisādhanaḥ || 27 || 🌻


🌻 Asaṅkhyeyaḥ:
One who has no Sankhya or differences of name and form.

🌻 Aprameyātmā:
One whose nature cannot be grasped by any of the means of knowledge.

🌻 Viśiṣṭaḥ:
One who excels everything.

🌻 Śiṣṭakṛt:
One who commands everything. Or one who protects shishtas or good men.

🌻 Suciḥ:
Pure

🌻 Siddhārthaḥ:
One whose object is always fulfilled.

🌻 Siddhasaṅkalpaḥ:
One whose resolutions are always fulfilled.

🌻 Siddhidaḥ:
One who bestows Siddhi or fulfillment on all who practise disciplines, in accordance with their eligibility.

🌻 Siddhisādhanaḥ:
One who brings fulfillment to works that deserve the same.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

No comments:

Post a Comment