భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 63



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 63   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 13 🌻

256. భవిష్యత్సంబంధములు:

కొంతకాలము గడచిన తరువాత, తన జీవితములో యిదివరకెన్నడు చూచియుండనివారిని చూచును; కలిసికొని యుండనివారిని కలిసికొనును. వీరెవరో తనకు తెలియదు కాని తాను పూర్వమొకప్పుడు స్వప్నములో చూచిన ఆవస్తువులే యివి, ఆ ప్రాణులే యివి, ఆవ్యక్తులే వీరు.

257. మానవుడు ముందు ముందు (భావిలో) కలిసికొన వలసిన వ్యక్తులను కూడా ముందుగానే (పూర్వమే) స్వప్నావస్థలో కలిసికొనును.

258. స్వప్ననాటకము, గతజన్మయొక్కయు, ప్రస్తుత జన్మయొక్కయు దైనందిన జీవిత సంస్కారముల ఫలితమైనప్పుడు, స్వప్ననాటకములో భవిష్యత్సంబంధమైన రూపములకు, సంఘటనలకు మానవుడు ముందుగనే సాక్షీ భూతుడగుట ఎట్లు సాధ్యము?

259. జాగ్రదవస్థలో _ తాను సరిగా అన్వేషించినవి, సన్నిహితముగా కలిసికొన్నవి (వస్తువులు, మానవులు) స్మృతికి వచ్చినపుడు, అవి, గతములో కొన్నిరోజులక్రితమో, కొన్ని నెలల క్రితమో లేక, కొన్నిసంవత్సరములకు పూర్వమో తన స్వప్నగత దృశ్యములేనని గుర్తుకు తెచ్చుకొని, గతమునకు సాక్షీ భూతుడగుచున్నాడు.

260. గతమే వర్తమానముగా ప్రతిబింబిచుచున్నది. ఇట్లు మానవుడు స్వప్న నాటకములో చిక్కుకుపోయి, తన గతమును వర్తమానముగా పరీక్షించుచు గతములోనే లీనమౌచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

No comments:

Post a Comment