🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దత్తాత్రేయ మహర్షి - 1 🌻
జ్ఞానం:
1. ధర్మమనే కవచం పోతే రాక్షసుల బాధ ఎప్పుడూ ఉంటుంది. రాక్షసులు ఎప్పుడూ ఉంటారు. మనుష్యుడు ధర్మమనే కవచాన్ని ఏర్పాటు చేసుకుని ఆత్మరక్షణ చేసుకోవాలి దానితో. రాక్షసులు లేకుండా లోకాలను సృష్టించమని ఎవరూ అడగటానికి వీలులేదు.
2. వారు పూర్వకల్పంలోని జీవులే. ఈశ్వరుడి యొక్క సృష్టి లక్షణమది. వాళ్ళ వల్ల బాధలేకుండా చేసుకోవాలి. లోకంలో తేళ్ళు ఉన్నాయి, పాములున్నాయి. అవి లేకుండా చెయ్యమని భవంతుణ్ణి అడగకూడదు. మనమే జాగ్రత్తగా నడవాలి. సృష్టి యొక్క లక్షణమే అది.
3. ఈ శక్తులెందుకుండాలి అంటే, అవి లేకపోతే మనం చేసిన పాపాలకు శిక్ష ఎలా ఉంటుంది మరి? కాబట్టి పాపం చెయ్యగలిగే లక్షణం ఎప్పుడయితే మనుష్యుడికి ఉందో, దానికి శిక్షను ఇవ్వగలిగిన శక్తి సృష్టిలోకూడా లక్షణంగా ఇస్తాడు.
4. ఒకసారి అలర్కుడనే కాశీరాజు అడిగిన ప్రశ్నకూ దత్తాత్రేయుడు, “నిన్ను నీవు తెలుసుకో. ఇంద్రియముల యొక్క లక్షణములను బుద్ధితో ఆలోచించి తెలుసుకో! లోపల ఏ అంగములూ లేకుండా అంతర్యామిగా పరమాత్మ అనే వస్తువు ఉంటుందని తెలుసుకో! అసంగుడవై సర్వాంగముల యొక్క లక్షణములు తరువాత తెలుసుకో!” అని తత్త్వాన్ని ఉపదేశించాడు.
5. “ముందర విషయాలను గురించి, వాటి దోషాలను గురించి తెలుసుకో. వాటికి పరిహారం ఏది? అసలివి ఎందుకు వచ్చాయి? లోపల ఇవి ఎవరివి? ఈ దేహి ఎవరు? అని తెలుసుకుని చిచారణ చేసిచూస్తే, ఈ ఇంద్రియములు ఎవరివీ కావు.
6. వీటన్నిటికీ అతీతంగా ఉండి అధిష్ఠానంగా ఉండే వస్తువును తెలుసుకున్న తరువాత, అప్పుడు నిస్సంగుడై అంతర్లీనుడై, తాను అస్మగుడై అప్పుడు ఈ అంగములు ధరించి కూడా దేని చేత బాధింప బడకుండా ఉండే యోగస్థితి సాధ్యం” అని ఉపదేశించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Oct 2020
No comments:
Post a Comment