శివగీత - 81 / The Siva-Gita - 81




🌹. శివగీత - 81 / The Siva-Gita - 81 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 7 🌻

వహన్త్యంభో యథా నద్యో - నాడ్యః కర్మఫలం తథా |
అనం తైకోర్ద్వగా నాడీ - మూర్ద పర్యంత మంజసా 31

సుషుమ్నేతి సమాదిష్టా - తయాగచ్ఛ న్విముచ్యతే |
తత్రావ స్థిత చైతన్యం - జీవాత్మానం విదుర్భుథాః 32

యథారాహురదృశ్యోపి - దృశ్యతే చంద్ర మండలే |
తద్వత్సర్వగతో స్యాత్మా - లింగ దేహిహి దృశ్యతే 33

యథాఘటే నీయమానే - ఘటాకాశోపి నీయతే |
తద్వ త్సర్వగతో ప్యాత్మా - లిగా దేహే వినిర్గతే 34

నిశ్చల: పరి పూర్ణోపి - గచ్ఛ తీత్యు పచర్యతే |
జాగ్రత్కలే తథాజ్జోయ - మభి వ్యక్త విశేషధీ: 35

నదులు నీటిని కలిగి యున్నట్లుగా ఈ నాడులు కర్మ ఫలమును బొందియునవి. ఈ నూట యొక్క నాడులలో నొకటి శిరస్సువరకు ఎడతెగకుండ విస్తరించి యుండును. దానినే సుషుమ్ననాడి అందురు. ఆ నాడి ద్వారా జీవము (ప్రాణము) పోయిన వాడు ముక్తిని పొందును. అక్కడ స్థిరపడియున్న చైతన్యమే జీవుడని పెద్ద లందురు.

రాహుగ్ర హమెట్లు అగోచరుడై చంద్రునిలో అగుపడుచున్నాడో, అట్లే సర్వగతు డైన యాత్మకూడ లింగ శరీర సంబంధముతో కన్ను కగుపడును. కుండను తీసుకెళ్ళుచుండగా తద్గతమైన ఘటాకాశమునుకొ పోవుట్లెన్న బడునో అట్లే అంగ శరీరము నిర్గ మించుట చేత సర్వగతుడైన మరియు నిర్మలుండైన పరి పూర్ణుండగు నాత్మకూడ వెళ్ళుచున్నాడని భావించు బడును.

నిజముగా నిష్క్రియుడగు యా జీవుడు జాగ్రదవ స్థయందు జ్ఞానవంతుడై బుద్ధింద్రియ స్పూర్తి కలిగి సూర్యుడు దశ దిశల రీతిగా సమస్త వస్తువులందును వ్యాపించియున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 81   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -7
🌻

The way rivers remain full with water, these nerves remain full with Karma Phalam (fruits of Karmas).

Among these 101 nerves one nadi spans without break till the top of the head. Through that nadi the Jiva (Prana) gets liberated at the time of death. There the permanently established consciousness itself is Jiva.

The way the planet Rahu despite being invisible becomes visible as grasping the moon, on similar lines the all pervading Atma becomes visible when connected through Linga deham (Subtle body).

As like as the infinite sky looks as being captured inside the pots separately, the same way the one single Atma (Paramatma) which is alone all pervading looks like separately established inside the bodies of all creatures.

But In reality, the action less Jiva alone pervades entire creation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #sivagita


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

No comments:

Post a Comment