గీతోపనిషత్తు - 43




🌹. గీతోపనిషత్తు - 43 🌹

🍀 3. నియత కర్మ - తన పని తాను చేయుట, అదికూడ శ్రద్ధతో చేయుట ముఖ్యము. తనది కాని పని తాను చేయుటవలన జీవుడు బద్ధుడగును. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. కర్మయోగము - 08 📚

8. నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణః |

శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః ||

నియమింపబడిన కర్మను మాత్రమే చేయుట రెండవ సూత్రము. తన పని తాను చేయుట, అదికూడ శ్రద్ధతో చేయుట ముఖ్యము. తనది కాని పని తాను చేయుటవలన జీవుడు బద్ధుడగును. తన పని ఏమో తాను తెలుసుకొని హద్దులు మీరక నిర్వర్తించవలెను.

తన పనిలో లోపములు లేకుండ నిర్వర్తించుటే తనకు ముఖ్యము. ఇతరుల పనులలో జొరబడుట, వారి పనుల లోని లోటుపాటులను చర్చించుట, విమర్శించుట తగదు.

అట్లు చేయువారికి తమ పనులను నిర్వర్తించుకొను సామర్థ్యము తగ్గును. శ్రద్ధ తగ్గును గనుక సామర్థ్యము తగ్గును. ఇతరుల పనులలో తలదూర్చువారు వడ్రంగము పనిచేయుటకు పూనుకొనిన కోతివలె దుఃఖపడుదురు.

తమకు నియమించిన పని చేయకపోవుట వలన జీవనయాత్ర కుంటుపడును. అందుచేత దైవము ఏకాగ్రతతో, నియంత్రిత పని నియమముతో, శ్రద్ధతో ఆచరింపుమని రెండవ ఆదేశము చేసినాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

No comments:

Post a Comment