శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 16 / Sri Devi Mahatyam - Durga Saptasati - 16




🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 16 / Sri Devi Mahatyam - Durga Saptasati - 16 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 5
🌻. దేవీ దూతసంవాదం - 1 🌻

ఉత్తరచరితము
మహాసరస్వతీ ధ్యానమ్

తన (ఎనిమిది) హస్తకమలాలలో ఘంట, శూలం, నాగలి, శంఖం, రోకలి, చక్రం, ధనుస్సు, బాణాలు ధరించేదీ, మబ్బు అంచున ప్రకాశిస్తుండే చంద్రునితో సమమైన కాంతి కలదీ, పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించినదీ, ముల్లోకాలకూ ఆధారభూతమైనదీ, శుంభుడు మొదలైన దైత్యులను వధించినదీ అయిన అపూర్వయైన మహాసరస్వతిని భజిస్తున్నాను.

1-2. ఋషి పలికెను :
పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనే రక్కసులు తమ బల గర్వాలతో ఇంద్రుని ముల్లోకాలనూ (ఆధిపత్యాన్ని), హవిర్భాగాలను హరించారు.

3. అలాగే ఆ ఇరువురూ సూర్య చంద్ర యమ వరుణ కుబేరుల అధికారాలు కూడా తమ వశం చేసుకున్నారు.

4. వాయువు అధికారాన్ని, అగ్ని కర్మను సైతం వారే నిర్వహించారు. ఇలా తమ అధిపత్యాలను, రాజ్యాలను కోల్పోయి దేవతలు ఓడిపోయారు.

5. ఆ ఇరువురు మహాసురులు తమ అధికారాలను హరించి తరిమివేయడంతో దేవతలందరూ అపరాజిత అయిన దేవిని సంస్కరించారు.

6. ఆపదలలో నన్ను మీరు స్మరించినప్పుడెల్ల, తత్ క్షణమే మీ ఘోరవిపత్తుల నన్నింటిని నేను అంతమొందిస్తాను” అని ఆమె మాకు వరం ఇచ్చి ఉంది.

7. ఇలా నిశ్చయించుకుని దేవతలు పర్వతసార్వభౌముడైన హిమవంతుని వద్దకు పోయి, అచట విష్ణుమాయయైన దేవిని స్తుతించారు.


🌻. యా దేవీ సర్వభూతేషు...... స్తోత్రము 🌻

8-9. దేవతలు పలికారు:
“దేవికి, మహాదేవికి నమస్కృతులు! నిత్యశుభంకరి అయిన ఆమెకు ఎల్లప్పుడూ నమస్మృతులు. మూలప్రకృతి, రక్షాశక్తి అయిన ఆమెకు నమస్కృతులు. నియతచిత్తులమై మేము ఆమెకు ప్రణమిల్లుతున్నాము.

10. భయంకరికి నమస్సులు! శాశ్వతకు, గౌరికి, (జగత్) పోషకురాలికి నమస్సులు! కైముదీ (వెన్నెల) రూపకు, చంద్రరూపకు, సుఖరూపకు సర్వదా నమస్కృతులు.

11. "శుభస్వరూపిణికి నమస్సులు! అభ్యుదయానకి, విజయానికి స్వరూపమైన ఆమెకు నమస్కారాలు! భూపాలురకు అభాగ్యదేవత, భాగ్యదేవత కూడా అయిన శివపత్నివి; అటువంటి నీకు నమస్కారాలు.

12. కష్టాలలో దరిచేర్చేది, సారస్వరూపిణి, సర్వకార్యాలను ఒనర్చేది, “ఖ్యాతి” అయినది (వివేకజ్ఞానం అయినది), కృష్ (నల్లని) వర్ణం, ధూమ (పొగ) వర్ణమూ అయిన దుర్గాదేవికి ఎల్లప్పుడూ నమస్కారాలు.

13. అతి సాధుస్వరూప, అతి రౌద్రస్వరూప అయిన ఆమెకు పదే పదే సాగిలపడి ప్రణమిల్లుతున్నాం. జగత్తును భరించే ఆమెకు నమస్కారాలు. సంకల్ప శక్తి రూపిణి అయిన దేవికి నమస్కారాలు.

14-16. సర్వభూతాలలో విష్ణుమాయ అనే పేరుతో నిలిచి ఉండే దేవికి మాటిమాటికి నమస్కారాలు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 16 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 5:
🌻 Devi's conversation with the messenger - 1
🌻

Meditation of Mahasaraswati :

I meditate on the incomparable Mahasaraswati who holds in her (eight) lotus-like hands bell, trident, plough, conch, mace, discus, bow and arrow; who is effulgent like destroyer of Sumbha and other asuras, who issued forth from Parvati's body and is the substratum of the three worlds. The Rishi said:

1-2. Of yore Indra's (sovereignty) over the three worlds and his portions of the sacrifices were taken away by the asuras, Sumbha and Nisumbha, by force of their pride and strength.

3. The two, themselves, took over likewise, the offices of the sun, the moon, Kubera, Yama, and Varuna.

4. They themselves exercised Vayu's authority and Agni's duty. Deprived of their lordships and sovereignties, the devas were defeated.

5. Deprived of their functions and expelled by these two great asuras, all the devas thought of the invincible Devi.

6. 'She had granted us the boon, "Whenever in calamities you think of me, that very moment I will put an end to all your worst calamities."'

7. Resolving thus, the devas went to Himavat, lord of the mountains, and there extolled the Devi, who is the illusive power of Vishnu.


🌻. Yaa Devi Sarva Bhooteshu Stotram 🌻

The devas said:

8-9. 'Salutation to the Devi, to the Mahadevi. Salutation always to her who is ever auspicious. Salutation to her who is the primordial cause and the sustaining power. With attention, we have made obeisance to her.

10. 'Salutation to her who is terrible, to her who is eternal. Salutation to Gauri, the supporter(of the Universe). salutation always to her who's is of the form of the moon and moon-light and happiness itself.

11. 'We bow to her who is welfare; we make salutations to her who is prosperity and success. Salutation to the consort of Shiva who is herself the good fortune as well as misfortune of kings.

12. 'Salutations always to Durga who takes one across in difficulties, who is essence, who is the authority of everything; who is knowledge of discrimination and who is blue-black as also smoke-like in complexion.

13. 'We prostrate before her who is at once most gentle and most terrible; we salute her again and again. Salutation to her who is the support of the world. Salutation to the devi who is the form of volition.

14-16. 'Salutations again and again to the Devi who in all beings is called Vishnumaya.


Continues....
🌹 🌹 🌹 🌹 🌹

26 Oct 2020

No comments:

Post a Comment