శివగీత - 99 / The Siva-Gita - 99



🌹. శివగీత - 99 / The Siva-Gita - 99 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ


ద్వాదశాధ్యాయము

🌻. ఉపాసనా విధి - 7 🌻


కోటి మధ్యాహ్న సూర్యభం - చంద్ర కోటి సుశీలతమ్ ;

చంద్ర సూర్యాగ్ని నయనం - స్మేర వక్త్ర సరో రుహమ్. 36


ఏకో దేవ స్సర్వ భూతేషు కూఢ

స్సర వ్యాపీ సర్వ భూతంత రాత్మా,

సర్వా ధ్యక్ష స్సర్వ బూతాధి వాస

స్సక్షీ చేతాకేవలో నిర్గునశ్చ. 37


ఏకో వశీ సర్వ భూతాంత రాత్మ

శ్యేకం బీజం నిత్య దాయఃక రోతి,

తంమాం నిత్యం యేను పశ్యంతి ధీరా

సైషాం శాంతి శ్వాశ్వతి నేత రేశామ్. 38


అగ్నిర్య థైకో భువనం ప్రవిష్టో

రూపం రూపం ప్రతి రూపో బభూవ,

ఏక స్తతా సర్వ భూతాంత రాత్మ

న లిప్యతే లోక దు: ఖేన బాహ్య : 39


వేదేహ యో మం పురుషం మహాంత

మాదిత్య వర్ణం తమసః పరస్తాత్,

స ఏవ విద్వానమృతో త్ర భూయా

న్నాన్య: పంథా అయనాయ విద్యతే. 40


కోటి సంఖ్యాక మైన సూర్యులతో సమానమగు కాంతియు కోటి సంఖ్యాకమైన చంద్రులతో సమానమగు శీతలత్వము గల యట్టి సూర్య చంద్రాగ్ని నేత్రములు కల నా ముఖ పద్మమును స్మరించుము.

సమస్త ప్రాణుల యందు న్నట్టి, సర్వ వ్యాపి, సర్వాంత ర్యామియు నైన సర్వేశుడు నిర్గునుడగు సర్వ సాక్షి యోక్కడే అయియున్నాడు. సర్వ భూతంతర్గత మై ప్రదాన భీజమగు నన్ను ధ్యానించు వారికి శాశ్వత మైన ముక్తి లభించును. అన్యులకు లేదు.

అగ్ని యొక్కటే అయినను ఏ ప్రకారము గ భువనములలో అనేకాకార ములైన పదార్ధములలో ప్రవేశించి యనే కాకారాములుగా నగు పడినను నిరాకారము గానే యుండు నట్లు ఒక్కడైన పరమేశ్వరుడు సమస్త భూతములందుయును ప్రవేశించి యున్నను సంసారిక సుఖ దుఖము ల కతీతుడై ప్రత్యేకముగా నుండును.

( నిర్తిప్తుడని తాత్పర్యము ) నన్ను అతి ప్రాచీనుని గాను, మహాత్ముని గాను, సూర్య కాంతిక లాడి ని గాను, నన్ను తెలిసికొనిన యెడల విముక్తిని పొందుదువు. పండితునికి మోక్షమును కింతకంటే మరొక మార్గము లేదు.


హైరన్య గర్భం విదధామి పూర్వం

వేదాంశ్చత స్మై ప్రహినోమి యోహమ్,

తం దేవ మీడ్యం పురుషం పురాణం

నిశ్చిత్య మాం మ్రుత్యుముఖాత్స్ర ముచ్యతే. 41


ఏవం శాన్త్యాది యుక్తస్సన్ - వేత్తిమాం యస్తు తత్వతః ;

నిర్ముక్త దుఃఖ సస్తాన - స్సొంతే మయ్యేవ లీయతే. 42


ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతయాం ద్వాద శో ధ్యాయ:

నన్ను మొదట (ప్రప్రథమున ) బ్రహ్మను పుట్టించి వాడికి వేదములొసగిన వాడిని గాను, పురాణ పురుషుని గాను దేవ వంద్యుని గాను తెల్సి కొనిన వాడు మృత్యువాత బడడు,

శమద మాది గుణములతో కూడుకొనిన వాడై ఈ విధముగా నన్ను తెలిసికొనునో అట్టి వాడు దుఖములనుబరి త్యజించి నాలో నైక్యమందుచున్నాడు .

ఇది పద్మ పురాణాన్తర్గత మగు శివ గీతలో పండ్రెండవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 99 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 12
🌻Upasana Jnanaphalam - 6 🌻


Having a splendor as bright as billions of suns, having coolness as cool as billions of moons, such a face of mine having sun, moon and fire as the eyes, you should think of.

The all pervading, one, residing in the hearts of all creatures, such a formless brahman is me who is the witnesser of everything. one who meditates on me seeing me in all creatures, such a yogi gets permanent rest called liberation. Others do not gain this.

The way one single fire appears in various colors and forms while burning in various places yet it remains formless everywhere; the same way despite residing inside various forms I remain untouched with all kinds of happiness & sorrows and remain unique.

One who realizes me as the one ancient Purusha of Vedas, having sun like splendor, a high souled one, such a human gains liberation. There is no other way to liberation than knowing me in reality.

One who knows me as the ancient being who at the beginning gave birth to Brahma (hiranyagarbha) and gave him the Vedas, one who realizes me as the ancient Purusha, as the one worshipable lord of all Devas; such a Yogi doesn't fall into the mouth of death. One who knows me in aforementioned manner and has subdued his senses, is peaceful; such a one merges in me.

Here ends the 12th chapter of Shiva Gita from Padma Purana Uttara Khanda..

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


26 Oct 2020

No comments:

Post a Comment