🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 83 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 05 🌻
352.తాను చూచిన మనుష్యుడు, తాను చూచుచుండగనే తనయొద్దనుండి దూరముగా పోవుటవంటిది అంతర్ముఖ క్రమము.
353.మార్గములో ప్రవేశించు కొలదీ, చైతన్యము అంత హెచ్చుగా లోపలికి చొచ్చుకొని పోవుచుండును.
354.చైతన్యము అంతర్ముఖ మగుటకు ప్రారంభించుటతో మానవుని స్థితిలోనున్న భగవంతుడు, క్రమక్రమముగా భౌతిక ప్రపంచము యొక్క ద్వంద్వ సంస్కార అనుభవమునకు దూరమగును.
355.ఘనరూపములోనున్న భౌతిక సంస్కారములు క్రమక్రమముగా ద్రవరూపములో పలుచనై, అవి క్రమక్రమముగా ఆవిరిరూపములో మరింతగా అదృశ్యమగుట,అంతర్ముఖ ప్రక్రియలో జరుగు క్రమపద్ధతి.
356.కాని కొన్ని సందర్భములలో, మిక్కిలి అరుదుగా భౌతిక సంస్కారములు హఠాత్తుగా అదృశ్యమై వాటి నుండి విముక్తి నొందిన చైతన్యము, పరమాత్మలో ఏకత్వమొంది,పరమాత్మానుభూతిని పొందును.ఇట్టిది చాల అరుదుగా జరిగెడి సంఘటనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2020
No comments:
Post a Comment