శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 39, 40 / Sri Lalitha Chaitanya Vijnanam - 39, 40

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 23 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 39, 40 / Sri Lalitha Chaitanya Vijnanam - 39, 40 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

17. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత


🌻 39. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత 🌻

శివునికే ఎరుక కలిగిన సౌభాగ్యము, లావణ్యము, మార్దవము గల ఊరువుల (తొడల) జంట గలది అని భావము.

ఊరువుల బలము సంతానశక్తికి చిహ్నము. బలిష్ఠమైన, పుష్టికరమైన ఊరువులు కలవారు ఆరోగ్యకరమైన సంతానమును అందించగలరు. సృష్టి అంతయు శ్రీదేవి సంతానమే. శివుని సంకల్పము ఆధారముగ శివుని సహకారముతో శ్రీదేవి సమస్త సృష్టిని జనింప చేయుచున్నది.

గత పది నామముల నుండి పరమశివుని కామేశునిగ కీర్తించుట గమనార్హము. సృష్టి సంకల్పము ఏర్పడిన శివుని కామేశుడందురు. అతనికి సంకల్పమే లేనిచో సృష్టికార్యమే లేదు. శివుడు కామేశుడైనప్పుడే అమ్మవారి కల్పన ముండును గాని, కామేశుడు కానప్పుడు కాదు.

అట్లుగాని సమయములో శివశక్తులు ఐక్యత చెందియుందురు. అనగా అర్థనారీశ్వరుడుగ శివుడండును. సత్సంతానము బడయగోరు స్త్రీలు ఈ నామము ధ్యానించినచో సఫలీకృతులు కాగలరు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 39 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 39. Kāmeśa- jñāta- saubhāgya- mārdavoru-dvayānvitā कामेश-ज्ञात-सौभाग्य-मार्दवोरु- द्वयान्विता (39) 🌻

The beauty of Her thighs is known only to Her consort and Creator Kāmeśvara.

This indirectly refers to the secretive nature of Śaktī kūṭa of Pañcadaśī that begins from this nāma.

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 40 / Sri Lalitha Chaitanya Vijnanam - 40 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

17. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత


🌻 40. 'మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత 🌻

మాణిక్యములచే నిర్మింపబడిన మకుటములవలె కన్పించు

మోకాలు చిప్పలు గలది అని అర్థము.

మాణిక్యములు సహజముగ ప్రకాశించునవి. వాటితో కూడిన

డిప్పలు (మకుటము) వలె గోచరించు గుండ్రని, అందమైన, ప్రకాశవంతమైన, పుష్టికరమైన, ఆకర్షణీయమైన మోకాలు చిప్పలు గలది అమ్మవారు.

శ్రీదేవి ప్రకృతి సౌందర్యమూర్తి, ప్రకృతి యందలి సమస్త సౌందర్యము ఆమె అంగాంగములయందు భావన చేయుచు సౌందర్య ఉపాసన చేయుట భారతీయ సంప్రదాయమున ఒక విశేషము.

సౌందర్యమును ఆరాధన చేయుట ద్వారా సాధకునిలోని సౌందర్యము రూపుదిద్దుకొని సాధకుడు కళ కలిగియుండును. అతని యందు శ్రీదేవి కళ పెరుగును. తద్వారా క్షుత్పిపాస వంటి మలినములు తొలగును.

మోకాలు చిప్పలు జ్యోతిషమున మకరరాశి చిహ్నములు. మకరరాశి సంవత్సర చక్రమున సూర్యోదయమునకు సంకేతము. సూర్యోదయ ప్రభలు అన్ని రంగుల కాంతులను వెదజల్లుచుండును.

మాణిక్యములు కూడ అట్లే కాంతులను ప్రకాశింపజేయును. ఉదయించు చున్న సూర్యబింబమును శ్రీదేవి మోకాలు చిప్పతో సరిపోల్చవచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 40 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻. 40. Māṇikya- mukuṭākāra- jānudvaya-virājitāमाणिक्य-मुकुटाकार-जानुद्वय-विराजिता (40) 🌻

Each of Her knees is like a single piece of ruby (again red colour) appearing like a crown.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


17 Oct 2020



No comments:

Post a Comment