✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 25 🌻
321.దిక్కు, కాలమునకు లోబడియున్న భౌతిక గోళము, అసంఖ్యాక విశ్వములతో సూర్యులతో, గ్రహములతో,ప్రపంచములతోకూడిన అనంతాకాశముతో సహా యీ భౌతిక గోళము, సూక్ష్మ ప్రపంచముతో పోల్చిచూచినచో,ఒక చిన్న తునకవంటిది.
322. భౌతికగోళమును ఆవశ్యక అస్తిత్వమందురు. ఇది సూక్ష్మ గోళమునుండి తమ ఉనికిని పొందుచున్నది. ఇది సూక్ష్మగోళము యొక్క ప్రతిబింబము ఈ దశలో భగవంతునికి-సృష్టికి గల సంబంధము ప్రభువు-బానిస వంటిది. ఈ దశలో ఉన్న పరిణామ చైతన్యము దుష్టాత్మ యందురు.
ఈ దుష్టాత్మకు భౌతిక సంబంధమైన దేదియైనను సంతోషించి అనుభవించు స్వాభావికమైన ప్రవృత్తి కలదు. ఇక్కడ భగవంతునికి మానవునకుగల సంబంధ భావమును మౌఖిక ఏకత్వ మందురు. (అనగా మాటలలో మాత్రమే భాగవంతునితో తనకుగాల ఐక్యమును అంగీక రించుచున్నాడు)
----------------------------------------
Notes
భౌతికగోళము
అసంఖ్యాకమగు
సూర్యులు
చంద్రులు
నక్షత్రములు
గ్రహములు
అనంతాకాశము
దిక్కు,కాలము
విశ్వములు
323. భౌతిక ఆస్తికత్వమైన పాంచభౌతిక స్థూలకాయము ద్వారానే ఱాతి నుండి మానవుని వరకు పరిణామము జరిగినది. భగవంతుని అనుగ్రహము వలననే రూపము లేని ఆత్మకు స్థూలరూపము వచ్చినది. ఈ స్థూలరూపము లేనిదే ఆధ్యాత్మిక పరిపూర్ణత్వముగాని, ఋషిత్వము గాని కలుగునని యూహించుట వెర్రితనము.
స్థూలదేహము పరమాద్భుతమైన అద్వితీయ యంత్ర నిర్మాణము. దీనిలో మిగిలిన నాలుగుని అస్తిత్వములను ఉన్నవి మానవరూపమును క్షుద్ర జగత్తనియు, ఇది విశ్వ జగత్తు యొక్క సంగ్రహరూపమనియు సూఫీలు పిలుతురు.
ఒక సద్గురువు లేక అవతారపురుషునియొక్క సార్వభౌమమిక మనసుయొక్క సహాయము లేకుండా వీటి మర్మమెవరికీ తెలియరాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment