✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మన 7 శరీరాలలో వచ్చే మార్పులు - 1 🌻
💠. 1.) ప్లానెటరీ లైట్ బాడీ యాక్టివేషన్:-
మన అన్నమయకోశంలోనికి అధిక కాంతి ప్రవేశిస్తుంది. భౌతిక దేహానికి సంబంధించిన ఏడు చక్రాలలోకి భగవంతుని కాంతి నింపబడి 1 నుండి 6 ప్రోగుల DNA యాక్టివేషన్ లోకి తీసుకురాబడుతుంది.
ఇందులో ఉన్న 12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తాయి. శరీరం లోపల బయట కాంతితో నింపబడి మన చుట్టూ 1.8 మీటర్ల వరకు బంగారురంగు కాంతి వలయం ఏర్పడుతుంది.
కాంతిదేహంతో కూడుకున్న fluorescent tube మన యొక్క సహస్రార చక్రం నుండి ఏర్పడుతుంది. మన యొక్క ఆరా, శరీరం, చక్రాస్, అణువులు, పరమాణువులు అన్నీ కాంతితో నింపబడి *"ప్లానెటరీ లైట్ బాడీ"* యాక్టివేషన్ లోకి తీసుకురాబడుతోంది.
అన్నమయకోశం- ప్లానెటరీ లైట్ బాడీగా మారుతుంది. మనం ప్లానెటరీ స్థాయికి ఎదుగుతాం.
💠 2. సోలార్ లైట్ బాడీ యాక్టివేషన్:-
ప్రాణమయకోశం సోలార్ లైట్ బాడీగా మారుతుంది. ఏడవ ప్రోగుDNA యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇందులో ఉన్న12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తాయి. 8 నుండి 15 చక్రాలు యాక్టివేషన్ లోకి వచ్చి నీలిరంగు, గులాబి రంగు కలిసి బంగారురంగు కాంతితో శరీరమంతా నిండిపోతుంది.
భగవంతుని యొక్క ప్రేమ, జ్ఞానం, శరీరం అంతా వ్యాపించి 2వ దేహమైన ప్రాణమయకోశం *"సోలార్ లైట్ బాడీ"* గా మారుతుంది. దీని వలన మన యొక్క భౌతికస్థాయి మనం ఏ సూర్యకుటుంబంలో ఉన్నామో ఆ స్థాయికి ఎదుగుతుంది.
💠 3. ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీ యాక్టివేషన్:-
3వ దేహమైన మనోమయకోశం, ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీగా మారుతుంది. 8వ ప్రోగు DNA యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇందులో ఉన్న12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తాయి. 15 నుండి 22 చక్రాలు యాక్టివేషన్ లోకి తీసుకురాబడతాయి. గ్రీన్ వైలెట్ బంగారు రంగు కాంతితో మీ ఆరా 2.5 మీటర్ల వరకు పెరుగుతుంది. కాంతితో కూడుకున్న 4 sides పిరమిడ్స్ శరీరంలో జాయిన్ అవుతాయి. మన యొక్క ఆరా చుట్టూ ఒక గొప్ప కాంతి గోళం ఏర్పడుతుంది. అది మన చుట్టూ రొటేట్ అవుతుంది.
దీని కారణంగా 3 వ దేహం మనోమయకోశం ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీగా మారుతుంది. దీనివలన మన సౌర కుటుంబంతో సమానమైన సౌర కుటుంబాల స్థాయికి మనం ఎదుగుతాం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment