✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 16వ అధ్యాయము - 4🌻
భవోను చూస్తూ ఆయన నవ్వి ఇది ఎటువంటి ఆహ్వానం ? భోజనం చేసేందుకు ఇదేనా వేళ ? నీ ఆహ్వనానికి బంధితుడనయి నేను ఇంకా భోజనం తినకుండా ఉన్నాను, ఇప్పుడు వెంటనే నాకు ఇవ్వు అని అన్నారు. భవ్ ఈమాటలకు అపరిమిత ఆనందపడి, తను 12 గం. బండి తప్పిపోవడం వల్లనే ఈఆలస్యం అయింది అని అన్నాడు.
బాలాభవ్ అప్పుడు భవ్తో, జరిగినదానికి విచారించక, శ్రీమహారాజుకు త్వరగా భోజనం వడ్డించమని అన్నాడు. బాలాభవ్ అప్పుడు రొట్టె, కూర, ఉల్లిపాయలు బయటకుతీసి శ్రీమహారాజుకు సమర్పించాడు. ఆయన రెండు రొట్టెలుతిని, ఒకటి భక్తులకు ప్రసాదంగా వెనక్కి ఇచ్చారు.
ఇది చూసిన వారందరూ శ్రీమహారాజుకు తన భక్తులమీద ఉన్న ప్రేమ, ఆత్మీయతలకు ఆశ్చర్యపోయారు. ఇది శ్రీకృష్ణుడు కౌరవుల విందుభోజనాలు వదలి, విదురుని ఇంటిలో సామాన్యమైన భోజనం ఇష్టపడినట్టు ఉంది. అదే విధంగా శ్రీమహారాజు మిగిలిన భక్తులు తెచ్చిన శ్రేష్టమయిన పదార్ధాలు మరియు మిఠాయిలు వదలి, భవ్ కావర్ రొట్టెలకోసం వేచి ఉన్నారు.
శ్రీమహారాజునుండి భవ్ కుడా ప్రసాదం తీసుకున్నాడు. ఎక్కడయితే ఇటువంటి నిజమయిన భక్తి ఉందో, ఇటువంటి ఘటనలు జరుగుతాయి. వైద్యపరీక్షలో ఉత్తీర్ణుడవు అవుతావు అని భవను ఆశీర్వదించి, శ్రీమహారాజు భవోను అకోలా వెనక్కి వెళ్ళమన్నారు. తాను ఆయన ఆశీర్వచనాల కోసమే తప్ప మరిఏమీ కోరడానికి రాలేదని భవ్ జవాబు చెప్పాడు. ఇంకా, శ్రీమహారాజు పాదాలే తనకు నిజమయిన ఆస్థి అనీ, అది ఎప్పుడూ మనసులో ఉంచుకుంటాననీ భవ్ అన్నాడు. అలా అంటూ భవ్ అకోలా తిరిగి వెళ్ళిపోయాడు.
షేగాంలో తుకారాం షేగాంకర్ అనే పవిత్రుడు ఉండేవాడు. అతను ఒకపేద వ్యవసాయకుడు. అతను రోజంతా పొలంలో పనిచేసిన తరువాత, శ్రీమహారాజు దర్శనం కోసం మరియు ఆయన పొగగొట్టంలో పొగాకునింపడం కోసం, ఇంకా ఇతరములైన చిల్లరపనులు చేసేందుకు మఠానికి వెళ్ళేవాడు. ఈవిధమయిన అతని దినచర్య చాలారోజులు జరిగింది. విధి ఎవరినీ విడువదు. విధిప్రకారం జరగవలసిన ఘటనలు జరుగుతాయి.
యదావిధిగా ఒకరోజు తుకారాం తనపొలానికి వెళ్ళాడు. ఒక వేటగాడు చేతిలో తుపాకితో కుందేళ్ళకోసం అక్కడికి వచ్చాడు. అది ప్రొద్దుట సమయం అవడంవల్ల, తుకారాం తన పొలంలో మంట ముందు కూర్చుని ఉన్నాడు. అతని వెనుక పొదలో ఒక తెల్లటి కుందేలు కూర్చునిఉంది. దానిని వేటగాడు చూసాడు. అతను తుపాకీ తీసి కుందేలు మీద గురిపెట్టి కాల్చాడు. కుందేలు చంపబడింది, కానీ చిన్న గుండుతునక తుకారాంకి చెవి వెనుక తగిలి తలలో ప్రవేశించింది. వైద్యులు ప్రయత్నించారు కానీ దానిని బయటకు తీయడంలో విఫలం అయ్యారు.
దీని ఫలితంగా అతనికి నిరంతరం తలలో నొప్పిగా ఉండి నిద్రకూడా పట్టేదికాదు. అప్పుడు అతను భగవంతునికి మొక్కుకున్నాడు. కానీ ఉపశమనం ఏమీ లభించలేదు. అలాంటి పరిస్థితిలోకూడా అతను మఠానికి వెళ్ళడం కొనసాగించాడు.
మఠంలోని ఒక భక్తుడు, మందులు వాడడంమాని, మఠంలోనేల ఊడ్చడం వంటి నిజమైన సేవలు మహారాజుకు అందించి ఆయన ఆశీర్వచనాలు పొందితే ఈబాధ నయమవుతుంది అని సలహా ఇచ్చాడు.
తుకారాం అంగీకరించి రోజా ఊడవడం మొదలుపెట్టి మఠాన్ని అద్దంలా శుభ్రంగా ఉంచేవాడు. ఇలా ఇతనిసేవ 14 సం. జరిగింది. ఒకరోజున ఇలా తుడుస్తూఉంటే, తలలో దూరిన ఆ గుండుతునక, చెవిలో నుండి బయటపడింది. అకస్మాత్తుగా అతని నొప్పి కూడా మాయంఅయింది. ఇది ఖచ్చితంగా అతను 14 సం. పాటు శ్రీమహారాజుకు చేసిన సేవలఫలితమే.
అతను మిగిలిన జీవితం అంతాకుడా మఠాన్ని తుడవడం కొనసాగించాడు. దైవిక నమ్మకం సాధారణంగా స్వయంగా అనుభవించిన మీదట పుట్టి తరువాత దృఢంగా ఉంటుంది. యోగులకు చేసిన సేవ ఎప్పుడూ వృధాకాదు. ఈ గజానన్ విజయ గ్రంధం భక్తులకు, ఈజీవన సాగరంలో రక్షకునిగా అగుగాక. శ్రీహరిహరార్పణమస్తు
శుభం భవతు
16. అధ్యాయము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 82 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 16 - part 4 🌻
Looking at Bhau, Maharaj smiled and said , “What sort of invitation is this? Is this the time for taking food? As I was bound by your invitation, I am still without food. Now give it to Me immediately.” Bhau was overjoyed at these words and said that the delay in reaching Shegaon was due to his missing the 12 O'clock train.
Balabhau then asked Bhau to serve the food to Shri Gajanan Maharaj quickly, without feeling sorry for whatever had happened. Then Balabhau took out, the breads, besan, onions and chilies and offered them to Shri Gajanan Maharaj , who ate two breads and gave one as prasad to all devotees.
Looking at this, all were surprised to see the love and affection Shri Gajanan Maharaj had for His devotees; it was just like Shri Krishna, who preferred to stay with Vidur and accept the poor food at his place instead of sweets of the Kauravas.
Similarly Shri Gajanan Maharaj waited for the bread of Bhau Kavar, declining all the rich food and sweets brought by other devotees. Bhau also took the prasad from Shri Gajanan Maharaj . Wherever there is sincere devotion, such things do happen.
Shri Gajanan Maharaj asked Bhau to go back to Akola and blessed that he would pass the medical examination. Bhau replied that he had come only for Maharaj’s blessings, and not to asking anything else.
He further said that his wealth were the feet of Shri Gajanan Maharaj , which he would ever cherish in his mind. Saying so, Bhau Kavar went back to Akola. There was a pious person named Tukaram Shegokar at Shegaon. He was a poor agriculturist.
After working the whole day on his fields, he used to go to Matth for the darshan of Shri Gajanan Maharaj , and serve Him by filling up His pipe with tobacco and other sundry work. This routine of his, continued for many days. Destiny spares nobody, and destined things do happen. As usual, one day, Tukaram went to his fields.
There came a hunter, with a gun in his hand, in search for rabbits. It was the morning time and Tukaram was sitting in his fields warming himself near a fire. The hunter noticed that there was a white rabbit sitting near a bush behind Tukaram. He took up his gun, aimed at the rabbit and fired.
The rabbit was killed, but a small shot hit Tukaram behind the ear and entered his head. Doctors tried, but failed to take it out. As a result of this, he had continuous pain in the head and was not able to get sleep. He then offered vows to God, but did not get any relief.
He continued to go the Matth in this condition also. One of the devotees in the Matth advised him to stop taking medicine and start offering sincere service to Shri Gajanan Maharaj , like sweeping the floors of the Matth, to get His blessings, which only would cure him of the ailment. Tukaram agreed and started sweeping the floors daily and kept the Matth clean like mirror.
This service of his continued for 14 years; one fine day, while sweeping the floor, the shot which had entered his head, slipped out from his ear and fell down. Suddenly the pain in his head also vanished. This was certainly the result of the service he rendered to Shri Gajanan Maharaj for those 14 years.
He continued his service of sweeping the floors of Matth throughout his life. Spiritual belief generally generates from self experience and then it remains firm. The service offered to the saints never go waste. May this Gajanan Vijay Granth prove to be a savior to the devotees in this ocean of life.
||SHUBHAM BHAVATU||
Here ends Chapter Sixteen
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment