✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 6
🌻.ధూమ్రలోచన వధ - 2 🌻
15. అంతట దేవి వాహనమైన సింహం కోపంతో కేసరాలు (జూలు) విదుల్చుతూ, మిక్కిలి భయంకరంగా గర్జిస్తూ అసురసైన్యం పై పడింది.
16. కొందరిని తన ముంద్రి కాలి దెబ్బతోను, కొందరిని తన నోటితోనూ, మరికొందరు మహాసురులను తన వెనుక కాళ్లతో తొక్కి అది చంపింది.
17. సింహం తన గోళ్లతో కొందరి లోకడుపులను చీల్చింది; మరికొందరి శిరస్సులను తన "పంజా" దెబ్బతో ఖండించి వేసింది.
18. ఇతరుల బాహువులను శిరస్సులను విచ్ఛిన్నమొనర్చింది. జూలు విదుర్చుతూ మరికొందరి లోకడుపుల నుండి రక్తపానం చేసింది.
19. మిక్కిలి కినుకబూని ఉన్న ఆ దేవీ వాహనమైన వీర్యవంత మైన సింహం క్షణకాలంలో ఆ సెన్యానంతటిని నాశనం చేసింది.
20–21. ధూమ్రలోచనాసురుడు దేవిచే చంపబడడం, పిదప ఆమె సింహంచే అతని సైన్యమంతా పరిమార్పబడడం విని దైత్యాధిపతి అయిన శుంభుడు రోషంతో పెదవి అదుర, చండముండ మహాసురులను ఆజ్ఞాపించాడు :
22-23. “ఓ చండా! ఓ ముండా! అచటికి బహుసైన్యసమేతులై పోయి, ఆమె తలపట్టి ఈడ్చుకొని గాని, బంధించి గాని, త్వరగా కొనిరండి. అలా చేయడానికి మీకేమైనా సంశయం కలిగితే, అసురులందరూ యుద్ధంలో ఆమెను తమ ఆయుధాలన్నింటితో హింసిస్తారుగాక.
24. “ఆ దుష్టురాలు గాయపరచబడి ఆమె సింహం పడగొట్టబడి నప్పుడు ఆ అంబికను పట్టుకొని, బంధించి ఇచటికి శీఘ్రంగా కొనిరండి.”
శ్రీ మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “ధూమ్రలోచనవధ” అనే షషాధ్యాయము సమాప్తం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 24 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 6:
🌻 The Slaying of Dhumralochana - 2 🌻
15. Then the lion, vehicle of the Devi, shaking its mane in anger, and making the most terrific roar, fell on the army of the asuras.
16. Some asuras, it slaughtered with a blow of its fore paw, others with its mouth, and other great asuras, by treading over with its hind legs.
17. The lion, with its claws, tore out the hearts of some and severed heads with a blow of the paw.
18. And it severed arms and heads from others, and shaking its mane drank the blood from the hearts of others.
19. In a moment all that army was destroyed by that high-spirited and exceedingly enraged lion who bore the Devi.
20-21. When Shumbha, the lord of asuras, heard that asura Dhumralocana was slain by the Devi and all his army was destroyed by the lion of the Devi, he was infuriated, his lip quivered and he commanded the two mighty asuras Chanda and Munda:
22-23. 'O Chanda, O Munda, go there with large forces, and bring her here speedily, dragging her by her hair or binding her. But if you have any doubt about doing that, then let the asuras strike (her) in the fight with all their weapons.
24. 'When that shrew is wounded and her lion stricken down, seize that Ambika, bind and bring her quickly.'
Here ends the sixth chapter called 'The Slaying of Dhumralocana' of Devi-mahatmya in Markandeya purana during the period of Savarni, the Manu.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/
04 Nov 2020
No comments:
Post a Comment