శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 97 / Sri Gajanan Maharaj Life History - 97


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 97 / Sri Gajanan Maharaj Life History - 97 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 19వ అధ్యాయము - 5
🌻

యోగమార్గం అనుసరించేవారు తనప్రగతికోసం మొదట కుండలిని, సుషుమ్న గూర్చి పూర్తి జ్ఞానంకలిగి ఉండాలి. వీటి అన్నిటి చిట్టచివరి ఫలం ఆత్మజ్ఞానం, కానీ ఆ ఆత్మను గూర్చి తెలుసుకోవడం దానిమీద ప్రేమ లేకుండాకాదు. ఏపని అయినా చేసేదానియందు ప్రేమలేకపోతే వృధాయే.

కాబట్టి ఈమూడు విధాలయిన విజ్ఞానమార్గాలలోనూ ఈప్రేమ అనేదాన్ని రక్షించడం అవసరం. నలుపు, మంచిఛాయ, పొట్టి, పొడుగు, అందం, కురూపి అనేవి శరీరానికి సంబంధించినవి. వీటి ప్రభావం ఆత్మకి ఏమీ ఉండదు. శరీరాలు వేరుగా ఉన్నా కానీ ఆత్మ అందరికీ ఒక్కలాగే ఉంటుంది.

అలానే ఇది మూడు విధములయిన జ్ఞానమార్గాలకూ వర్తిస్తుంది. బాహ్యంగా అవివేరుగా కనిపించినా, చివరి లక్ష్యం వీటి అన్నిటిదీ ఒక్కటే. ఒకసారి అవి లక్ష్యంచేరాకా, మార్గాలు వేరనేది మరిచిపోతాం. ఎవరు ఏమార్గాన్ని పాటిస్తారో వాళ్ళకి అది సాధ్యం అవుతుంది. ఎవరయితే తమలక్ష్యం చేరలేరో వాళ్ళుమాత్రమే తాము పాటించిన మార్గం గొప్పతనం నిరూపించేందుకు యుద్ధం చేస్తారు. ఈమూడు మార్గాలు అనుసరించిన వారందరూ, లక్ష్యం చేరిన మీదట యోగులయి ఒకరిలో ఒకరు కలిసి పోతారు.

వశిష్ఠుడు, వామదేవ్, జమదగ్ని, అత్రి, పరాసరు మరియు శాండిళ్యముని ఈలక్ష్యం కర్మమార్గం ద్వారా పొందారు. వ్యాస, నారద, కాయద కుమార, మారుతి, శబరి, అక్రూరుడు, ఉద్ధావ. సుధామ, పార్ధ మరియు విధురుడు భక్తియోగం అనుసరించారు. శ్రీశంకరాచార్య గురువార్, మశ్చీంద్రకు సమానమైన ఫలం దొరికింది, వాళ్ళచివరి ఫలితంలో ఏవిధమయిన బేధంలేదు. అదే సాంప్రదాయం ఆ తరువాతకూడా కొనసాగుతోంది. కావున ఏవిధమయిన సంకోచంపడకు.

కర్మమార్గం ప్రాముఖ్యతను శ్రీపాదవల్లభుడు కాపాడారు. గంగాపూరుకు చెందిన మహాయోగి శ్రీనరసింహసరస్వతి కూడా ఇదేపని చేసారు. నామా, సవతా, ధ్యానేశ్వరు, సేనా, కన్హ, చోఖామహరు మరియు దామాజీపంత్ థానేదార్ భక్తిమార్గం అనుసరించారు. శ్రీగోండాకు చెందిన షేక్ మహమ్మదు, జాల్నాకు చెందిన ఆనందస్వామి, సురుజీ అంజనగాం కి చెందిన దేవనాథ్ మహారాజు యోగమార్గం ఇష్టపడ్డారు.

ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవ్ కర్మమార్గం అనుసరిస్తున్నారు. నేను ఇంకా అనేకులు భక్తిమార్గం ఇష్టపడ్డాం. పాలసకు చెందిన దోండిబువా, సోన్గర్ కు చెందిన నానా, జాల్నాకు చెందిన యశ్వంతరావు భక్తిమార్గంలో కృతార్ధులయారు. ఖల్లాఅమ్మా, షిరిడీ సాయిబాబా మరియు గులాబరావు కూడా చివరి లక్ష్యంఅయిన ఆత్మజ్ఞానం పొందారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 97 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj


🌻 Chapter 19 - part 5
🌻

The follower of ‘Yoga Marga’ for his success should first have full knowledge of Kundalini and Sushamna.

The ultimate fruit of all these paths lies in selfknowledge; but that ‘knowing the self’ should not be done without love for it. Any act without love for it is a waste. So it is necessary to protect the ‘love aspect’ in all these three paths to selfrealization.

Black, fair, short, tall ugly and beautiful are the attributes of the body, and they have no effect on the soul.

Bodies are different but all have got the same soul. Likewise it is applicable to these three paths of Realization. Externally they have different appearances, but the ultimate goal is the same for all of them.

Once the goal is reached, the different paths are forgotten. Whatever path one follows becomes important for him. Only those who fail to reach the goal fight for proving the greatness of a particular path.

All the followers of these three paths, after reaching the goal become saints and then merge with each other. Vashistha, Vamdeo, Jamdagni, Atri, Parashtar and Shandilyamuni, reached their goal by the path of ‘Karma yoga’.

Vyas, Narad, Kayadhukumar, Maruti, Shabari, Akrura, Udhava, Sudama, Partha, and Vidur followed ‘Bhakti Yoga’.

Shri Shankaracharya Guruwar, Macchindra, Gorakh and Jalander climbed the great staircase of ‘Yoga Marga’. Vashistha, Vidur and Macchindra got the same fruit. There was no difference in their ultimate gain.

The same traditions continued thereafter, so, do not have any doubt about it. Shripad Vallabha protected the importance of ‘Karma Marga’.

The great saint, Shri Narsinha Saraswati of Gangapur, did the same. Nama, Savata, Dnyaneshwar, Sena, Kanhu, Chokha Mahar and Damajipant Thanedar followed ‘Bhakti Marga’.

Sheikh Mohammed of Shri Gonda, Anandiswami of Jalna, Devnath Maharaj of Surji, Anjangaon liked ‘Yoga Marga’. Now, at present, Vasudeo follows ‘Karma Marga’. Many others and I like ‘Bhakti Marga’.

Dhondibua of Palus, Nana of Songir, and Yashwantrao of Jalna are successful in ‘Bhakti Marga’. Khalla Amma, Saibaba of Shirdi, and Gulabrao have also achieved the ultimate realisation of the self.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


04 Nov 2002

No comments:

Post a Comment