🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 91 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 13 🌻
నాల్గవ భూమిక :-
385. నాల్గవ భూమిక సగము సూక్ష్మలోకమునకు సగము మానసిక లోకమునకు చెందియుండును. మానసిక లోకమునకిది గడపవంటిది. సూక్ష్మాగోళము యొక్క అనంత ప్రాణశక్తియందు సంపూర్ణమైన ఎఱుక కల్గి పూర్ణశక్తి స్వరూపుడైయుండును. ఇది భగవంతుని అనంతశక్తియొక్క పరిమిత లక్షణము.
386. ఇతడు మరణించిన వారిని బ్రతికించును. సృష్టికి ప్రతిసృష్టి చేయును. అసలు తన శక్తులను ప్రదర్శించకున్నను లేక, శక్తులను దుర్వినియోగ పరచుకున్నను అయిదవ భూమికను చేరగల్గును. కొన్ని సమయములందు, సద్వినియోగ పరచినచో సద్గురువుల సహాయముతో ఆరవ భూమికకు చేర్చబడును. ఈ సహాయము జీవన్ముక్తుల వలన గాని బ్రహ్మీభూతులవలన గని కాదు.
387. ఆధ్యాత్మికముగా పరిపూర్ణులు కాని యోగులు మహిమలను ప్రదర్శించుటలో, అసలు వస్తువులను ఉన్నవి ఉన్నట్లు గాక, తద్భిన్నముగ మనకు కనిపించునట్లు చేయుదురు. అనగా, అసలు సృష్టియే మిథ్య. అట్టి మిథ్యలో మరియొక మిథ్యను ప్రవేశపెట్టెదరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Nov 2020
No comments:
Post a Comment