✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక - 3 🌻
491. ఈ సర్వశూన్య స్థితి యొక్క అనుభవము, సామాన్య మానవునకు నిత్యము కలిగెడు సుషుప్తిలో జరుగుచునేయున్నది. పరిమిత అహము, లోకములు అదృశ్యమగుచున్నవి. పూర్ణచైతన్యము మాత్రము సుషుప్తిలో నిద్రాణమైయున్నది. సంస్కారములు కూడా అంతర్ధానమైనవి.
492. సామాన్యమానవుని నిత్యజీవితంలో నిత్యము కలిగెడి సుషుప్తిలో చైతన్యము నిద్రాణమై యుండగా, నిర్వాణావస్థలో చైతన్యము ఎరుకతో నుండును.
493.సర్వశూన్య స్థితియొక్క అనుభవమే నిర్వాణము.
494. మిథ్యాజీవితములో, పరిణామములోనున్న ఫనాలలోను, ఆథ్యాత్మిక మార్గములోనున్న ఫనాలలోను చైతన్యము ఉండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Dec 2020
No comments:
Post a Comment