గీతోపనిషత్తు - 94


🌹. గీతోపనిషత్తు - 94 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 7 . ప్రాణాయామ యజ్ఞము - అపానవాయువు శరీరము నుండి ముక్కుపుటముల ద్వారా వదలబడు వాయువు. అపాన వాయువును శ్రద్ధగ, పూర్తిగ వదలవలెను. మలినములను విసర్జించుటకు అపానవాయువు, ప్రాణములను పెంచుటకు ప్రాణవాయువు అనుస్యూతముగ దేహమున పనిచేయుచు నున్నవి. వానిని సక్రమముగ నిర్వర్తించుకొనుట ముఖ్యము 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 7


పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.


🌷 2. అపాన వాయువు : 🌷

అపానవాయువు శరీరము నుండి ముక్కుపుటముల ద్వారా వదలబడు వాయువు. ఇది దేహము నందు ఉదర వితానము క్రింది భాగము నుండి భుజము వరకు పనిచేయుచు నుండును.

ఈ వాయుశక్తే ఈ శరీర భాగమును పటిష్టముగ నుంచగలదు. శరీరమందలి ఈ భాగము ఆరోగ్యపరముగ చాల ముఖ్యము. సర్వసామాన్యముగ ఈ భాగమే మొదట అనారోగ్యమునకు గురి యగును.

ఈ శరీర భాగమున జీర్ణాశయము, కాలేయము, చిన్న, పెద్దప్రేవులు, మూత్ర పిండములు, ఆయేయము, మల మూత్ర విసర్జనాంగములు వున్నవి. మలమూత్రములు పరిపూర్ణముగ విసర్జింపబడుటకు ఈ వాయువు ప్రధాన కారణము. అట్లే జీర్ణశక్తికి కూడ నిదియే ఆధారము.

మలమూత్రములే కాక దేహమందలి మలినములను పారద్రోలుటకు ఈ వాయు బలమే ముఖ్యము. అజీర్తి, కడుపునొప్పి, వికారము, తలనొప్పి, అతిమూత్ర వ్యాధి, రక్తపోటు, కీళ్ళనొప్పులు, మలబద్ధకము, జలుబు, దగ్గు, విరేచన ములు, జ్వరములు ఇవి అన్నియు ఈ భాగముననే పుట్టును.

కావున అపాన వాయువును శ్రద్ధగ, పూర్తిగ వదలవలెను. మలినములను విసర్జించుటకు అపానవాయువు, ప్రాణములను పెంచుటకు ప్రాణవాయువు అనుస్యూతముగ దేహమున పనిచేయుచు నున్నవి. వానిని సక్రమముగ నిర్వర్తించుకొనుట ముఖ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2020

No comments:

Post a Comment