ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 137, 138 / Sri Lalitha Chaitanya Vijnanam - 137, 138 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖
🌻137. 'నిరాకారా' 🌻
ఆకారము లేనిది శ్రీదేవి అని అర్థము.
పంచభూతముల సృష్టికి ముందు ఆకారములుండవు. కేవలము వెలుగు, శబ్దము, వాని వలయములు, గుణములుండును. వానికి పూర్వము శుద్ధచైతన్యముండును. దానికి పూర్వము సత్యము మాత్రమే యుండును. శ్రీదేవి సహజ స్థితి అట్టి సత్యము.
ఆమె నుండియే పై తెలిపినవన్నియూ వ్యక్తమగుచుండును. ఆ స్థితిలో
ఆమెకు గుణములు లేవు. రూపములు లేవు. అందువలననే తరువాతి నామములలో (139) ఆమెని నిర్గుణ అని కూడ అందురు. విధముగ 25 నామము లిచ్చట పేర్కొనబడినవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 137 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirākārā निराकारा (137) 🌻
She is formless. Ākāra means form, figure, shape, etc. This is an important aspect of nirguṇa Brahman (nirguṇa means devoid of all qualities or properties).
The qualities of the formless Brahman are being described one after another.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 138 / Sri Lalitha Chaitanya Vijnanam - 138 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖
🌻138. 'నిరాకులా' 🌻
కలత చెందనిది శ్రీదేవి అని అర్థము.
అజ్ఞానమున్నచోట కలత యుండును. శ్రీలలిత విద్యా స్వరూపిణి అగుటచే, అవిద్యా సంబంధమైన కలత యుండదు. సృష్టి యందు అవిద్య లేక అజ్ఞానము తప్పదు. జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి యుండును. విద్యాసంపన్నులు అవిద్యను గర్షించక, విద్యను ఆశ్రయించి యుందురు. అవిద్యకూడా సృష్టియందలి భాగమే అని తెలిసి యుందురు.
అందువలన వారికి ఘర్షణ యుండదు. అట్టి సమగ్రభావనమునకు శ్రీదేవి అధిష్టాన దేవత. ఆమెకు సురులు, అసురులు కూడ సమానమే. మితిమీరినపుడు సర్దుబాట్లు చేయు చుండును.
విద్యావంతులు కూడా అవిద్య తాకిడివలన కలత చెందుట జరుగుచుండును. వారి విద్య సమగ్రము కాదు. అజ్ఞానమును దూషించు జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము కాదు. అవసర మగుచో దానిని నిర్జించుటయే గాని దూషించుట విద్యావంతులు చేయరు.
దూషించువారికి కలత తప్పదు. అట్టివారికి మనస్సు చంచలమగును. చంచలమగు మనస్సు కలతబారిన నీరువలె ఉండును. కలతలు ఎక్కువగ నుండును.
భూషణాదులకు దూరముగ ప్రశాంతము, అచంచలము అగు మనస్సుతో నుండుటయే నిజమగు జ్ఞానము. జ్ఞాని, జ్ఞానము అజ్ఞానముల స్వరూపముల నెరిగి తన కర్తవ్యము ననుసరించుచూ జీవించును. అట్టివారు నిరాకులు.
శ్రీదేవి త్రిగుణాతీత కూడ అగుటవలన ఆమెకు కలత యుండదు. కలతలన్నియు త్రిగుణ సృష్టియందే ఉండును.
చరితము చంచలము అయిన మనసుగల వారికి శ్రీదేవి దూరము. వారు దేవి ఆరాధన మార్గమున కలతలను బాసి, స్థిరచిత్తమును గొని, అటుపై దేవి అనుగ్రహమునకు ప్రయత్నింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 138 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirākulā निराकुला (138) 🌻
She is without agitation. Ākulā means confounded, confused, agitated, flurried, or disordered. Nir negates all that is meant by ākulā. This means that She is not agitated, not confused etc. She is the cause for these attributes, but She is not affected by these attributes.
Though She is associated with ignorance or avidyā, still she is not agitated. She is associated with ignorance means She is the cause of avidyā.
When She is in the form of māyā or illusion, She causes ignorance. Māyā prevents the sādhāka to acquire knowledge. This nāma means that even though ignorance is caused by Her, She is not agitated by this ignorance.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Dec 2020
No comments:
Post a Comment