✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక - 5 🌻
500. ఫనా:-- భగవంతుని వైపు పురోగమించు ప్రయాణమునకు అంత్యము.
Notes:-- ఫనా = నిర్వాణము; నాశనము శూన్య స్థితిలో అంతర్ధానము
Notes:-- బకా=నిత్యత్వము
బకా:-- భగవంతునిలో సాగించు ప్రయాణమునకు ప్రారంభము
ఫనా:-- అన్యము, ద్వైతమదృశ్యము
బకా:-- ద్వైతము అదృశ్యమైన తరువాత పొందు భగవంతుని జ్ఞానము
ఫనా:-- శాశ్వత జీవితము(బకా) నకై, ఆథ్యాత్మిక జాగృతిలో ఫలితమిచ్చుటకై, రాగములకు, ఆత్మసంకల్పమునకు, మిథ్యాహమునకు మరణము సంభవించుట. మిథ్యాహమును మరచి పోవుట.
501. నిర్వాణములో రూపము (ప్రమాణము) అదృశ్యమై, కేవలత్వము నిలిచి భగవంతుడు అగుచున్నొడు.
502. ప్రధాన దేవదూతల నివాసము మనోభువనమునకు ఆవలనున్న సస్త అంతర్గోళములు.
503. మనోభువనమునకు సత్యగోళమునకు మధ్యనున్న సప్త అంతర్గోళములు సత్యగోళమునకు సామీప్య మందున్నప్పటికీ సత్యగోళమును స్పృశించలేవు అన్నది నిజమే కాని మొత్తం నిజము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Dec 2020
No comments:
Post a Comment