శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 143 / Sri Lalitha Chaitanya Vijnanam - 143

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 76 / Sri Lalitha Sahasra Nama Stotram - 76 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 143 / Sri Lalitha Chaitanya Vijnanam - 143 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ‖ 44 ‖


🌻143. 'నిరుపప్లవా' 🌻

నాశనము లేనిది శ్రీలలిత అని భావము.

సృష్టి స్థితుల యందు గాక లయమున కూడ వుండునది శ్రీలలిత. ప్రకృతి పురుషులు లయమున కూడ నుందురు. లయమున ఆమెది యోగనిద్ర. అనగా మెలకువా కాదు, లేనిస్థితి కాదు. వుండియూ లేనట్లుండుట, లేకయూ వుండుట. లేనిచో ఉద్భవించదు కదా! ఉండునుకాని, ఉన్నట్లు ఆమెకు తప్ప మరి ఎవ్వరికిని తెలియదు.

కాలము రూపమున మేల్కొనినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వారికి వున్నామని తెలియును. ఎట్లుంటిమి? అను ప్రశ్న కూడ జనించును. ఎట్లుంటిమో తెలియకపోవుట నిద్రస్థితి. తెలిసి యుండుట యోగనిద్రా స్థితి. శ్రీదేవి లయమునకూడ బీజప్రాయముగ తత్త్వ మందిమిడి యుండును. కావున ఆమె నాశనము లేనిది. శ్రీలలిత నారాధించు భక్తులు కూడ ఇట్లే నాశనము లేక యుందురు.

"నాభక్తులెన్నటికిని నశించరు” అని శ్రీకృష్ణుడు పలికినదీ సత్యమే. సనక సనందనాదులు, నారదుడు అట్టి దేవీ భక్తులు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 143 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirupaplavā निरुपप्लवा (143)🌻

She is perdurable, yet another quality of the Brahman. The same meaning is conveyed in nāma 180.

There is another interpretation, which says that She produces ambrosia that spreads to the 72000 nerves in human body. This refers to Her subtlest Kuṇḍalinī form.

When Kuṇḍalinī reaches sahasrāra, it produces ambrosia that drips through the throat and spreads throughout the nervous system.

This nāma is split into nir (the word nir has many meanings and in this context, it means body) + upa (approaching) + plavā (dripping). This means that when Kuṇḍalinī approaches sahasrāra the ambrosia starts dripping into the body system.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2020


No comments:

Post a Comment