గీతోపనిషత్తు - 96
🌹. గీతోపనిషత్తు - 96 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 26 - 9 . ప్రాణాయామ యజ్ఞము - అంతర్గతమై సమాన వాయువు చేరిన ప్రజ్ఞ, స్పందనాత్మక చైతన్యమై నిలచి, అంతర్లోకాను అన్వేషణమునకు కుతూహలము చూపును. స్పందనాత్మక ప్రజ్ఞ కాధారమేమి? అని అన్వేషించును. అట్టి అన్వేషణమున ద్వయ శబ్దముగ వచ్చుచున్న స్పందన ప్రజ్ఞ కేంద్రమున అంతర్ముఖ మనసును లగ్నము చేయును. స్పందన ప్రజ్ఞా కేంద్రమున జీవప్రజ్ఞ ఆసక్తి కలిగియుండగ, ప్రాణ అపాన ప్రవృత్తులు మరింత సమీకరణము చెంది సామ్యము సాధింప బడును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
Part 9
పంచప్రాణములు దేహమున ఈ క్రింది భాగములలో పనిచేయుచున్నవి.
🌷 4. ఉదాన వాయువు - 1 🌷
అంతర్గతమై సమాన వాయువు చేరిన ప్రజ్ఞ, స్పందనాత్మక చైతన్యమై నిలచి, అంతర్లోకాను అన్వేషణమునకు కుతూహలము చూపును. స్పందనాత్మక ప్రజ్ఞ కాధారమేమి? అని అన్వేషించును. అట్టి అన్వేషణమున ద్వయ శబ్దముగ వచ్చుచున్న స్పందన ప్రజ్ఞ కేంద్రమున అంతర్ముఖ మనసును లగ్నము చేయును. స్పందన ప్రజ్ఞా కేంద్రమున జీవప్రజ్ఞ ఆసక్తి కలిగియుండగ, ప్రాణ అపాన ప్రవృత్తులు మరింత సమీకరణము చెంది సామ్యము సాధింప బడును.
ప్రాణము వలన అన్నము, నీరు, గాలి స్వీకరించుట, వినుట, స్పర్శించుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట అను విషయములు మనసుచే గ్రహింపబడుట, వినుట, అర్థము చేసుకొనుట, సంఘమున ఆర్జనము, దానము యిత్యాది ప్రవృత్తు లేర్పడుచున్నవి. అపానము వలన మలమూత్రములు, చెమట
ఏర్పడుచున్నవి.
అట్లే ప్రాణము వలన దేహము యొక్క జననము, అపానము వలన మరణము జరుగుచున్నవి. ఈ రెండు ప్రవృత్తులును చక్కగ సమీకరణము చెంది, సామ్యము సాధించి నపుడు జనన మరణ ప్రవృత్తులు కూడ సామ్యము చెందును.
నిదానముగ గాలిపీల్చి ప్రశాంతముగ గాలి విడుచుటలో శ్వాస ప్రసన్నమగును. సామ్యమునందు నిలబడును. ఇట్టి సమయమున ఉచ్ఛ్వాసలో నిశ్వాస, నిశ్వాసలో ఉచ్ఛ్వాస లీనమై పీల్చి విడుచు ప్రయత్నము ఆగిపోవును. కావలసిన గాలి సహజముగ లోనికి వచ్చుట, బయటకు వెళ్లుట జరుగును. ఇట్టి స్థితిలో మనసు, శ్వాస ఒకటియై నిలచిపోవును.
ఇట్లు నిలచిపోవుటనే 'ప్రాణాయామము' అందురు. అపుడే అంతర్గతమైన జీవ ప్రజ్ఞ స్పందనాత్మక కార్యక్రమమునకు ఆధారమును వెదకును. ఆ వెదకుటలో స్పందనము నుండి సూక్ష్మ స్పందనములోనికి ప్రవేశించును. అనగ హృదయ కేంద్రము నుండి సుషుమ్నలోనికి ప్రవేశించుట జరుగును. అచట ఊర్ధ్యమగునొక వెలుగుదారి లభించును. కంఠము నుండి ఉదాన వాయువు ఊర్ధ్యమున కాకర్షించుచుండగ, ఉదానవాయు మార్గమున క్రమముగ భ్రూమధ్యమున చేరును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment