భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 181


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 181 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. విశ్వామిత్రమహర్షి - 1 🌻


01. భగవంతుడితో వైరం పెట్టుకుంటే కూడా ఈశ్వరుడిలో లీనమయ్యారు రాక్షసులు. కాబ్ట్టి వైరం పెట్టుకుంటే తగిన వాడితో పెట్టుకోవాలి, అల్పుడితో పెట్టుకోకూడదు. అల్పుడితో వైరము, స్నేహము రెండూ చెడ్డవే! వైరమయినా, స్నేహమయినా ఉత్తముడితోతే ఉండాలి. అది చాలా ఉత్తమమయిన పని. అది చాలా ఉన్నతమయిన స్థానానికి తీసుకెళ్ళుతుంది.

02. మహర్షుల ఉపదేశం అంటే, మంత్రాలరూపంలో ఉరికే అక్షరాలు చెప్పటం కాదు. వాళ్ళు చేసిన తపస్సునుకూడా వానియందు ఉంచి ఇస్తారు. దానికే ‘ఉపదేశం’ అని పేరు.

03 . విశ్వామిత్రుడి యొక్క శాపగ్రస్తులైన ఆ సంతానంలో కొందరికి(ఆంధ్రులలో కలిసినవారిలో) నాస్తికత్వము, అనాగరికత, విశ్వామిత్రుడి శాపమువల్లనే వచ్చాయి. శాపానంతరము వాళ్ళు పశ్చాత్తాపము పొంది శరణు వేడగా, విశ్వామిత్రుడు దయతో వారికి తిరిగి తమ పూర్వఔనంత్యాన్ని పొందే మార్గంకూడా అనుగ్రహించాడు.

04. ఋషిపుత్రులైన వారు, అలా ఆనాటికి అనాగరికులతో నిండిఉన్న ఆంధ్రభూములకు రావటం, తపస్సులు చేయటం, తిరిగి తమ పూర్వవైభవాన్ని పొందటం, ఆ క్రమంలో ఈ ప్రాంతపు అనాగరికులు కూడా నాగరికులై ఆర్యధర్మాన్ని పొండటం-ఇవన్నీ విశ్వామిత్రుడి శాపంవల్లనే జరిగాయి.

05. ఆయన శాపంకూడా లోకానుగ్రహకారణమై పరిణమించిందన్న మాట. ఆంధ్రులమైన మనం ఆయనకు ఎంటో ఋణపడి ఉన్నాం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2020

No comments:

Post a Comment