సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 3
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 3 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 3 🍀
త్రిగుణ అసార్ నిర్గుణ హే సార్!
సారాసార్ విచార్ హరి పార్!!
సగుణ నిర్గుణ గుణాచే అగుణ్!
హరి వీణ మన్ వ్యర్డ్ జాయ్!!
అవ్యక్తి నిరాకార్ నాహీ జ్యా ఆకార్! !
జేధోని చరాచర హరిసీ భజే!!
జ్ఞానదేవా ధ్యానీ రామకృష్ణ మనీ !
అనంత్ జన్మోనీ పుణ్య హెయ్!!
భావము :
త్రిగుణము అసారము, నిర్గుణము సారము. సారమేది? ఏది అసారము? అనే విచారము చేసి తెలుపగలదు హరి పాఠము.
సగుణము, నిర్గుణము గుణములతో కూడియున్నదే అగుణము. హరితో మనసుకు సంబంధము లేకపోతే జీవితమంతా వ్యర్థమే.
అవ్యక్తుడు నిరాకారుడు, ఆకారము లేనివాడు ఎవ్వరి నుండి ఈ చరాచర సృష్టి జరిగినదో అట్టి హరినే భజించుము.
అనంత జన్మల పుణ్యము వలన నిరంతరము రామ కృష్ణుల రూపమునే ధ్యానము చేయుచు మనసు నిలిపి వారి నామమునే జపించే భాగ్యము కలిగినాదని జ్ఞాన దేవుడు అన్నాడు.
🌻. నామ సుధ -3 🌻
త్రిగుణాలలో లేదు సారము
నిర్గుణములో కలదు సారము
సారమేది? ఏది అసారము
చేయు విచారము హరిపాఠము
సగుణము మరియు నిర్గుణము
మారుచున్న గుణములదే అగుణము
మనసు హరితో సంబంధము
వీడినచో అంతా వ్యర్థము
అవ్యక్తము నిరాకారము
లేదు అతనికి ఆకారము
ఎవ్వరి నుండి ఈ చరాచరము
అట్టి హరినే భజియించుము
జ్ఞాన దేవుని ధ్యానము
రామ కృష్ణులలో లీనము
అనంత జన్మల పుణ్యము
హరినామములో మనసు స్థిరము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment