కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 132


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 132 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 62 🌻


నాకు ఇవాళ సరిగ్గా నిద్రపట్టలేదండి!

నాకు ఇవాళ నిద్రా సుఖం సరిగ్గా లభించలేదు.

నాకు ఇవాళ స్వప్నం సరిగ్గా రాలేదండి.

నాకు ఇవాళ స్వప్నంలో చాలా డిస్టర్బెన్స్‌ గా వుందండి.

నాకు ఇవాళ జాగ్రదావస్థలో చాలా డిస్టర్బెన్స్‌గా వుందండి.

అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళకు గురౌతు, అనేక రకములైనటువంటి ఇంద్రియ వ్యాపారముల చేత లాగబడుతున్నారు. అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, వాటన్నింటి చేత, ఇంద్రియములు పరిణామ శీలములై, వ్యవహార శీలములై, ప్రతిబింబ జ్ఞాన సహితములై, అజ్ఞాన ప్రభావం చేత, అవిద్యా ప్రభావం చేత, మోహ ప్రభావం చేత, మాయా ప్రభావం చేత, భక్తి విశ్వాసములు లోపించడం చేత, అనన్యభక్తి లోపించడం చేత, ఈశ్వరుని యందు సరియైనటువంటి చిత్త ఏకాగ్రతను నిలుపుకోలేకపోవడం చేత, ఎవరికైతే అనన్య భక్తి ఉందో, భక్తి విశ్వాసములు - అంటే అవ్యభిచారీ భక్తి అంటారు. అట్టి అవ్యభిచారీ భక్తిని గనక ఆశ్రయించి, అనన్యభక్తిని పొందినటువంటివారు, తప్పక మూడుగుణాలని జయిస్తారు.

కాబట్టి తప్పక గుణత్రయాన్ని, శరీరత్రయాన్ని, దేహత్రయాన్ని, ఈషణ త్రయాన్ని ఇటువంటి త్రిపుటిని దాటాలి అంటే, ఈ అవస్థాత్రయాన్ని దాటటం అత్యవసరం. ఎవరైతే అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడో, అదే చైతన్యం. అదే ప్రజ్ఞ. అదే ఆత్మ. అదే అంతర్యామి. అదే ప్రత్యగాత్మ. అదే యథార్థ నేను.

కాబట్టి అటువంటి తురీయ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. అటువంటి తురీయస్థితిలో సహజముగా నిలకడకలిగి ఉండాలి. దృష్టిని సదా భూమా స్థితి యందు నిలుపగలిగినటువంటి వాడై ఉండాలి. ఏమార్పూ లేక ఉండాలి. ఏ పరిమాణము లేక ఉండాలి. ఏ అనుభవమూ లేక ఉండాలి. ఏ బంధము లేక ఉండాలి.

ఏ రకమైనటువంటి కుంగుబాట్లు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి దిగులు లేక ఉండాలి. ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి. ఏ రకములైనటువంటి అవస్థాత్రయ ప్రభావం లేకుండా ఉండాలి. ఆ రకంగా సాక్షిత్వమును సదా ఆశ్రయించాలి. ఇట్లా సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే ఆ అంతర్యామిత్వాన్ని, ఆ ఆత్మస్థితిని నిలబెట్టుకోగలుగుతున్నారు.

బుద్ధి అహంకారముతో కూడిన ఆత్మచైతన్యము ‘అహంకర్త అహం భోక్త’ నేను కర్తను, నేను భోక్తను అని వ్యవహరించుచున్నది. అట్టి జీవుని బుద్ధి, అహంకారము అను ఉపాధినుండి వేరుపరచినచో కాలత్రయ నియామకుడగు ఈశ్వరుడే అగుచున్నాడు. ఈ విధముగా తెలిసిన వారు తనను ఇతరుల నుండి రక్షించుకొనగోరరు.

ముఖ్యమైన అంశాలని యమధర్మరాజుగారు నచికేతునికి ఉపదేశిస్తున్నారు ఈ కఠోపనిషత్తు సందర్భముగా. ప్రధానము.. ఈశ్వర లక్షణాన్ని నిరూపిస్తున్నారు. ఎవరైతే ఈ బుద్ధికి వేరైనటువంటి వాళ్ళు, అంటే మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకి సంబంధించిన వాడు ఈశ్వరుడు.

గోళకములు, ఇంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్ర సహితమైనటువంటి జ్ఞానము, మనస్సు, బుద్ధి ఇదంతా జీవుడు. దీని అవతల ఉన్నటువంటి మహతత్త్వము, అవ్యక్తము, ప్రత్యగాత్మ ఈ మూడు స్థితులకు సంబంధించినవాడు ఈశ్వరుడు. అయితే ఈశ్వరత్వాన్ని సాధించడం మానవులందరికి తప్పనిసరి. ఆ దివ్యత్వానుభవం లేకుండా, ఆత్మానుభూతిని పొందజాలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2020

No comments:

Post a Comment