గీతోపనిషత్తు - 98


🌹. గీతోపనిషత్తు - 98 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 26 - 11 . ప్రాణాయామ యజ్ఞము - వ్యాన వాయువు దేహమున ప్రజ్ఞ అంతర్యామిత్వము చెందుటకు, దేహము అంతట వ్యాపించి యుండుటకు పని చేయుచు నుండును. జీవప్రజ్ఞ దేహ వ్యాప్తి చెందుటకు, దేహము మొత్తము కదలికలకు, దేహము పెరుగుదలకు వ్యాన వాయువు తోడ్పడుచుండును. ఉదానము నుండి వ్యానము చేరిన జీవప్రజ్ఞ సహస్రారమును చేరి తన నిజస్థితిని అనుభూతి చెందగలదు. ఈ మొత్తము మార్గమును “ప్రాణాయామ యజ్ఞ"మని దైవము తెలిపియున్నాడు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

🌷 5. వ్యాన వాయువు: 🌷

వ్యాన వాయువు దేహమంతయు వ్యాపించి యుండును. శిరస్సునుండి పాదముల వరకు అన్ని భాగముల యందు పని చేయుచు నుండును. దేహమున ప్రజ్ఞ అంతర్యామిత్వము చెందుటకు, దేహము అంతట వ్యాపించి యుండుటకు పని చేయుచు నుండును. జీవప్రజ్ఞ దేహ వ్యాప్తి చెందుటకు, దేహము మొత్తము కదలికలకు, దేహము పెరుగుదలకు వ్యాన వాయువు తోడ్పడుచుండును.

ఉదానము నుండి వ్యానము చేరిన జీవప్రజ్ఞ సహస్రారమును చేరి తన నిజస్థితిని అనుభూతి చెందగలదు. ఈ విధముగ ప్రాణము, అపానము, సమానమున సామ్యము చెందుట, సమాన వాయువునుండి జీవప్రజ్ఞ ఉదానవాయువు చేరుట, ఉదాన మాధారముగ ఊర్ధ్వముఖ మగుట, ఊర్ధ్వముఖము చెందిన ఉదానము వ్యానమును చేరుట ఈ మొత్తము మార్గమును “ప్రాణాయామ యజ్ఞ"మని దైవము తెలిపియున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2020

No comments:

Post a Comment