ప్రసాద్ భరద్వాజ
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 148, 149 / Sri Lalitha Chaitanya Vijnanam - 148, 149 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖
🌻148. 'నిత్యశుద్ధా"🌻
ఎల్లప్పుడూ శుద్ధ స్థితి యందుండునది శ్రీమాత.
ఎల్లప్పుడూ అనగా భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు అని అర్థము. శాశ్వతముగ శుద్ధమైనది. శుద్ధ అనగా మలినములు లేనిది. అజ్ఞానము, అహంకారము, కోరిక, వైషమ్యము, మోహము ఇత్యాది మలినములు లేకుండుటయే శుద్ధ స్థితి. మాయ తాకనిది శుద్ధ స్థితి. శ్రీమాతకు మాయ ప్రధానమగు పనిముట్టు. మాయతోనే సృష్టి నిర్మాణము, నిర్వహణము గావించు చుండును. మాయ ఆమెపై ఆధిక్యము కలది కాదు.
సృష్టియందు మలినము తప్పనిసరి. సృష్టి కార్యము అగ్నికార్యమగుటచే మసిబారుట కూడ జరుగు చుండును. అన్ని లోకముల యందు కొద్దియో గొప్పగనో మలినముండుట తప్పనిసరి. దానిని ప్రతినిత్యము పరిశుభ్ర పరచుకొనుట సాధన. బ్రహ్మాదులకైనను ఇది తప్పదు. త్రిమూర్తులు గూడ అప్పుడప్పుడు మాయా మోహములను మలినము సోకినవారే అని పురాణములు తెలుపుచున్నవి. అట్టి మలినములు సోకని శాశ్వత శుద్ధత్వము ఇచ్చట చెప్పబడుచున్నది.
జీవ చైతన్యము కూడ అట్టి శుద్ధత్వము కలిగి యున్నది. ఈ కారణముచేతనే జీవుడు దైవాంశయే కాని అతనిని ఆవరించి యుండు అహంకారాది అష్ట ఆవరణలు మలినముల నుత్పత్తి చేయుచు నుండును. వీని ప్రభావము జీవునిపై నున్నప్పుడు అతని సహజస్థితి జీవుడు కోల్పోవును. అతడు నిర్మలుడే అయినను, శరీర సహవాసము వలన, శరీర వాసనలు సోకుట జరుగుచుండును.
శరీరము మలినములతో కూడినది. అందుండువాడు నిర్మలుడు. నిర్మలుడు నిర్మలుడుగానే యుండవలెనన్నచో అహంకారాది భావనలు దాటవలెను. “తా నున్నాడు” అని భావించు ప్రతి మానవుడు అహంకారియే. దైవమే తానుగ నున్నాడు. నిజమునకు దైవమే వున్నాడు. “నేనుండుట మాయ” అని నిత్యము తెలిసినవాడు నిత్య శుద్ధు డగును. అట్లగుటకు సాధన కావలెను. సాధనవలన సిద్ధి పొందువాడు జీవుడు. శ్రీమాత నిత్యసిద్ధ, కావున 'నిత్యశుద్ధ',
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 148 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nitya-śuddhā नित्य-शुद्धा (148) 🌻
She is eternally pure. Impurity is associated with the gross body and the embodiment of purity is within the impure gross body. Brahman is always pure as It is not subject to changes or modifications. Impurity arises only if an object undergoes changes.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 149 / Sri Lalitha Chaitanya Vijnanam - 149 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ‖ 45 ‖
🌻149. 'నిత్యబుద్ధా'🌻
శ్రీమాత శాశ్వత బుద్ధి స్వరూపిణి అని అర్థము.
జ్ఞాన స్వరూపిణి అని అర్థము.
శుద్ధత్వమువలె బుద్ధత్వము కూడ శ్రీమాత సహజ స్థితి. ఆమె బుద్ధి స్వరూపిణి కనుక బుద్ధి ప్రచోదనము చేయుమని ఆమెను ఆరాధించుట జరుగుచున్నది. అందులకే గాయత్రి మంత్రము. శుద్ధి, బుద్ధి అనునవి ఒక దానివెంట ఒకటి కలుగు సిద్ధులు. శుద్ధి నిత్యము గావించుకొను చుండవలెను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశముల శుద్ధి శ్రద్ధతో గావించుకొనుచు బుద్ధి ప్రచోదనమునకు ప్రయత్నించుట సాధన.
బుద్ధిని గొని శుద్ధిని సాధించుట, శుద్ధితో బుద్ధిని ఆహ్వానించుట నిత్యము జరుగవలెను. అట్టి వారికే సంసారము నుండి తరించుటకు వీలగును. జైనమతమున తరణమును చెందుటకు ఆరాధించు శ్రీమాతను 'తారాదేవి' అని పిలుతురు. శుద్ధబుద్ధులు అను తీర్థంకరులు తారాదేవి అనుగ్రహముచే తరించిరని తెలుప బడుచున్నది.
శుద్ధి, బుద్ధి తరించుటకు ముఖ్యమని తెలియవలెను. ఈ కారణముగనే నిత్యశుద్ధా, “నిత్యబుద్ధా' అను నామములు వరుసగా పేర్కొనబడినవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 149 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nitya-buddhā नित्य-बुद्धा (149) 🌻
She is eternally wise. Knowledge is gained by experience whereas being wise (jñāna) is inbuilt. Knowledge is acquired from the wise. Bṛhadāraṇyaka Upaniṣad (IV.iii.30) says ‘the knower’s function of knowing can never be lost, because it is imperishable.
But there is not that second thing separate from it which it can know’. The Brahman is self illuminating intelligence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Dec 2020
No comments:
Post a Comment