భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 180


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 180 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మార్కండేయ మహర్షి - 6 🌻


45. వ్యవస్థలో ప్రతి శ్రాద్ధకర్మకీ నక్షత్రం చూచుకోవలసిన ఆవశ్యకత, దానిని గురించిన మీమాంస ఏర్పడుతున్నది. ప్రతి శ్రాద్ధానికి ముహూర్తం చుడవలసివస్తుంది.

46. విధినిషేధాలు వచ్చేటప్పటికి అదొక పెద్ద confusion అయిపోతున్నది. అయితే ఆ విషయాన్ని దాచి, అంటే దాన్ని గురించి చెప్పక, ఆ తిథినాడే చేసెయ్యటం మనకు అలవాటు చేసారు. అట్లా ప్రతీదీ కూడా ఒక విమర్శనీయమైన విషయం అవుతుంది. ప్రతీదానికి పంచంగం చూడాల్సివస్తుంది కాబట్టి, అలా వ్యవస్థ చేస్తున్నారు. దానిని కుదిరినంత అనుసరిస్తూ, ఏదో కష్టసుఖాలు అనుభవిస్తున్నారు.

47. అదృష్టవశాత్తు ఆ శ్రాద్ధకర్మలు నిర్వీర్యంగా ఉన్నాయి. అందులో ఏమీలేదు కాబట్టి అవి మనని ఏమీచేయటంలేదు. అదే తిథినాడూ శ్రాద్ధం పెట్టాలని ఏమీలేదు. ముందుకాని, వెనుక కానీ చెయ్యవచ్చు. ప్రతీదానికీ తిథే ప్రధానం అనుకోవటం ఊరికే మనకు అలవాటయిపోయింది.

48. గయలో శ్రాద్ధంపెడితే మళ్ళీ పెట్టవలసిన అవసరం లేదంటారు. నిజమేనా అని కొందరి సందేహం. ఏదో ఒక చోట చేస్తే ఇంకొకచోట అఖ్ఖరలేదు అంటే, అనవసరం అన్నమాటే అది. అసలాంటి మాట – Provison – ఉందంటేనే, మానివేయచ్చని, ఎగవేయచ్చని అర్థంవస్తుంది. నేటికి మిగిలిన ఆ కాస్త క్రియాకలాపంకూడా విస్మరిస్తే, పెద్దలను మరచిపోతారు.

49. వారి ఋణాన్నితీర్చుకోవటానికి ఇక ఏ పనీచెయ్యరు. కాబట్టి సంప్రదాయంలో ఒక అర్థముంది. అయితే, ఇప్పుడున్నటువంటి ఛాందస ప్రవృత్తిలో చేయటం మాత్రం శాస్త్రసమ్మతం కాదు. అది అంత ఆవశ్యకమూ కాదు. మొత్తానికి ఏదో ఆరాధన ఇంకా మిగిలి ఉంది! అందుకు సంతోషించాలి.

50. అసలు పెళ్ళితోసహా అన్నికార్యాలూ శ్రద్ధతోచెయ్యాలి. వ్యవహారంలో ఏమైపోయిందంటే, పిత్రుకార్యాల(శ్రాద్ధం)లో వాడతంచేత, శ్రద్ధ అనే మాట ఎక్కడవచ్చినా అది చెడ్డమాటే అవుతున్నది. అలా అయిపోయింది ఈ వ్యవస్థ. ఏదైనా పాపపు మాట వింటే, రామరామ అంటాం. రామ శబ్దం ఉత్తమం. ఎక్కడయినా స్మరించవచ్చు.

51. పెళ్ళిలో కూడా!! కొత్త దంపతులు దణ్ణం పెడితే రామరామ అంటే ఊరుకుంటార! ఏం! రామనామం చెడ్డదా? వీళ్ళకలా అలవాటు అయిపోయిందంతే! ఎక్కడో ‘పాపం శమించుకాగ’ అనే అర్థంలో రామశబ్దం వాడబడటంచేత, శుభంలో ఎక్కడా వాడకూడదని అనటం అలవాటయిపోయింది.

52. కాబట్టి మన అలవాట్లు ఒకమాటు విమర్శచేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇలా మన అలవాట్లు కొన్ని అర్థరహితంగా కూడా ఉన్నాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2020

No comments:

Post a Comment