రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
70. అధ్యాయము - 25
🌻. సతీ వియోగము - 4 🌻
ఆకాశవాణి ఇట్లు పలికెను-
ఓ పరమేశ్వరా! నీవు ధన్యుడవు. నీతో సమముగా శపథమును నెరవేర్చుకోగల మహాయోగి, మహాప్రభువు ఈ ముల్లోకములలో మరియొకడు లేడు (54).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ ఆకాశవాణిని వినగానే సతీదేవి కాంతిని కోల్పోయి శివుని ఇట్లు ప్రశించెను. నాథా !నీవుచేసిన శపథమేమి? నాకు చెప్పుడు(55) హితమును చేయు ఆ శివ ప్రభుడు, సతీదేవి ఇట్లు ప్రశ్నించిననూ, తాను వివాహములో పూర్వము విష్ణువు యెదుట చేసిన శపథమును వెల్లడించలేదు(56). అపుడు సతి ప్రాణ ప్రియుడు, తన భర్తయగు శివనిధ్యానించెను. ఓ మహర్షీ !తన ప్రియుడు తనను త్యజించుటకు గల కారణము ఆమెకు సమగ్రముగా అవగతమయ్యెను(57).
అపుడు ఆ దాక్షాయణి శంభుడు తనను వీడుట లెరింగి, అనవరతము నిట్టూర్పులు విడుచుచూ, మిక్కిలి దుఃఖించెను(58). శివునకు ఆమె మనోగతము అవగతమయ్యెను. ఆ ప్రభుడు ఇతరములగు అనేక గాథలను ప్రస్తావించి తన సత్యశపథమును ప్రస్తావించకుండా గుప్తముగ నుంచెను(59).
ఆయన సతితోగూడి వివిధ వృత్తాంతములను చెప్పుచూ, కైలాసమును చేరుకొనెను. ఆ శివయోగి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండి సమాధిని పొంది ఆత్మాను సంధానమును జేసెను. (60) ఆ కైలాస దామమునందు సతీదేవి మహా దుఃకముతో కూడిన మనస్సుతో నుండెను, (61)
ఓ మహర్షీ !లోకలీలను అనుసరించు నట్టియు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గల్గినట్టుయు, సర్వసమర్థులైన ఆ సతీ శివులు ఇట్లు చిరకాలమును గడిపిరి(62). అపుడు భక్తుల మహా దుఃఖములనైననూ తొలగించు ఆ శివుడు ధ్యానమును వీడెను. ఆ విషయమును నెరింగి జగన్మాతయగు ఆ సతి అచటకు విచ్చేసెను(63).
దుఃఖముతో నిండిన హృదయముతో ఆ దేవి శివునకు నమస్కరించెను. విశాల హృదయుడగు శంభుడు తన ఎదురుగా ఆమెకు ఆసనము నిచ్చెను(64). ఆయన ఆమెకు మిక్కిలి ప్రీతితో మనోహరములగు అనేక గాథలను చెప్పెను. ఆప్రభుడు అట్టి లీలను ప్రదర్శించి, వెను వెంటనే ఆమె దుఃఖమును తొలగించి వేసెను.(65). ఆమె పూర్వమునందు వలనే ఆనందించెను. ఆయన తన శపథమును వీడలేదు.
వత్సా!పరమేశ్వరుడగు శివుని విషయములో ఆశ్చర్యమనునది లేదని యెరుంగవలెను(66).
ఓ మహర్షీ మహర్షులు శివాశివుల గాథను ఇట్లు వర్ణించిరి. కొందరు విద్వాంసులు కానివారు వారికి వియోగమును వర్ణించిరి. కాని, వారికి వియోగమెట్లు సంభవమగును (67) శివాశివుల చరిత్రను యథార్థముగా ఎవ్వరు యెరుంగ గలరు? వారిద్దరు తమ ఇచ్ఛచే క్రీడించి, చరిత్రను సృష్టించుచుందురు గదా !(68) సతీ శివులు శబ్దార్థముల వలె నిత్యము కలిసియుందురు గదా! వారికి అట్టి ఇచ్ఛ కలిగిన పక్షములో మాత్రమే వారిద్దరికీ వియోగము సంభవమగును(69).
శ్రీ శివమహాపురాణములో రెండవదియగు సతీ ఖండములో సతీ వియోగమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది(25)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
10 Dec 2020
No comments:
Post a Comment