✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముఖ్య సూత్రములు - 5 🍀
21. ఇట్టి యోగుల బుద్ధి నుండి, చిత్తము నుండి, యింద్రియముల నుండి, వాక్కు నుండి, నడవడిక నుండి బ్రహ్మమే విదితమగును.
22. వీరు ప్రాణాయామ మార్గమున అంతర్గతులై బ్రహ్మోపాసనము చేయుచు, ముక్తస్థితి యందుండగ వీరి నుండి బ్రహ్మమే జీవులకు వలసిన హితమును గావించు చుండును.
23. కర్మ సన్న్యాస యోగులు చేయు కర్మలన్నియు వాని నుండి దైవము నిర్వర్తించునవే. వారికి కర్తృత్వభావమే యుండదు. ఇష్టాయిష్టము లుండవు. కావున కర్మబద్ధులు కారు.
24. సన్న్యాసమను పదమునకు గీతయందలి యీ అధ్యాయమే సరియగు, సంపూర్ణమగు నిర్వచనము. ఈ సూత్రములకు సరిపడనిది సన్న్యాసము కాదు. ఇది సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jan 2021
No comments:
Post a Comment