సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 29


🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 29 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

చివరిభాగము

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ



🍀. శ్రీ మజ్జతి జ్ఞానాబాయి ఆయి అభంగ్|| 🍀

సర్వసుఖాచీ లహారి -

జ్ఞానాబాయి అలంకాపురి -

శివపీఠి హే జునాట్ -

వేదశాస్తే దెతీ గవాహి -

మణ్పతి జ్ఞానాబాయి ఆయి

జ్ఞానాబాయిచే చరణ్ -

శరణ్ ఎకా జనార్ధనీ -

జ్ఞానాబాయి తెథే ముగుట్

భావము

సర్వసుఖాల తరంగము జ్ఞానాబాయి అలంకాపురము అంటే జ్ఞానేశ్వర్ మహరాజ్ హరిపాఠము రచించి సమాధి పొందిన స్థలము అళంది అని భావము.

అక్కడి పురాతనమైన శివ పీఠమునకు జ్ఞానాబాయి ముకుళము కావున జ్ఞానాబాయి జనని అని వేద శాస్త్రముల సాక్షము ఇచ్చినవి.

జ్ఞానాబాయి చరణములకు ఏక జనార్ధని శరణి అనగా ఏకనాథ్ మహరాజ్ జ్ఞానేశ్వరుని శరణు వేడినారు.

🌻. నామసుధ || 🌻

సర్వసుఖాల తరంగము -

జ్ఞానాబాయి అలంకాపురము

శివ పీఠము పురాతనము -

జ్ఞానాబాయి అక్కడిముకుఠము

వేదశాస్త్రాల సాక్షము -

జ్ఞానాబాయిది మాతృ హృదయము

ఏక జనార్ధని శరణము

జ్ఞానాబాయి చరణము.

సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2021

No comments:

Post a Comment