భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 206


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 206 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. చ్యవనమహర్షి-సుకన్య - 3 🌻


12. అలాంటి గ్రంథాల్లో ఓ అక్షరానికో, ఓ శ్లోకానికో ఒకరికి అర్థం తెలియకపోతే, తనకర్థమయేలాగ దానిని అతడు దిద్దుకునేవాడు. ఈ ప్రకారంగా అనేక మార్పులు పురాణాలలో చోటుచేసుకున్నాయి.

13. ఇది కాక, ఒక ధర్మాన్ని గురించి పురాణాన్ని చెపుతున్నప్పుడు దీనికి ఈ కథను చేరిస్తే బాగుంటుందని, ఆ కథకు ఇంకొక కథ చేర్చటము, ఆ సూత్రాన్ని ఆ ధర్మాన్ని గట్టిగా చెప్పటానికి మరొక కథను-తనకు తెలిసిన కథను-అందులో పెట్టటము; ఏదైనా ఒక ధర్మాన్ని గురించి చెప్పవలసివస్తే అప్పుడు ఈ ధ్రమాలు ఈ సమయంలో చెపితే బాగుండును అను వాటిని అక్కడ చేర్చడం- ఇట్లా జరిగేవి.

14. ధర్మం చెప్పటం బ్రాహ్మణుడి ధర్మం. అతడి ఉద్యోగమే అది. అంటే ఎక్కడైనా ధర్మసంకటంవస్తే, బ్రాహమణుడు వెళ్ళి ఇది ధర్మం అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోవాలి. భూతదయ గొప్పది. సత్యం గొప్పది. శౌచము(అంటే ఎప్పుడూ మనసుకు, శరీరానికి శుచి ఉండటం) చాలా ముఖ్యం.

15. ఇలాంటి వాళ్ళు ఎవరయితే ఉన్నారో-భూతదయ కలిగి సత్ప్రవర్తనతో ఉండి మనస్సు, శరీరము శుచిగా పెట్టుకోగలిగిన వారెవరైన ఉంటే; వాళ్ళ పాదాలే సకల తీర్థములు, వాళ్ళ పాదస్పర్శచేత సమస్త తీర్థముల ఫలాలు కలుగుతాయి. “ప్రసిద్ధమయిన మహాక్షేత్రాలలో నైమిశము, చక్రతీర్థము, పుష్కర క్షేత్రము అనే మూడుతీర్థములు సకలలోకాలలో కూడా శ్రేష్ఠమయిన క్షేత్రాలు అవి. అక్కడకువెళ్ళి వాటిని సేవించినవాళ్ళకు సకల పాపములు నశిస్తాయి”.

16. రాక్షసులు ఎప్పుడు తపస్సుచేసినా, అనేకమందిని చంపటానికి వీలైనటువంటి ఆయుధాన్ని అదుగుతూ ఉంటారు. “ఒక బ్రహ్మాండమయిన ఆయుధం నాకిచ్చావంటే దానికి ఎదురు ఉండదు. దానితో ముట్టుకుంటేనే అందరూ చావాలి. బూడిద కావాలి” ఇట్లాంటి వరాలే అడుగుతారు. లోకలో ఆకలి లేకుండా చేయమని ఒకడు, లోకంలో తాము ముట్టుకుంటే ఎవరైనా చనిపోవాలి అని మరొకడు – రాక్షసులు ఇలాంటి వరాలే అడుగుతారు. అందరికీ లోకంమీదనే దృష్టి.

17. శరీరానికి బలం ఇచ్చేటటువంటి, ఆయ్స్సును వృద్ధి పరచేటటుబంటిది ఒక ఔషధాన్ని అశ్వినీదేవతల దగ్గరినుంచి గ్రహించి లోకానికి ఇచ్చాడు చయవనమహర్షి. ఆయుర్వేదంలో కొన్ని మూలికలనుఇచ్చి, వాటికి ప్రయోగాలు చెప్పడని కూడా శాస్త్రం చెబుతున్నది. ‘చ్యవనప్రాశ‘ అనేది ఆయనపేరు మీదుగానే నేడు వాడకంలో ఉంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2021

No comments:

Post a Comment