Theosophy / దివ్య జ్ఞానం - తలాలు ( dimensions) - 2


Theosophy/దివ్య జ్ఞానం - తలాలు ( dimensions) - 2 :

శాస్త్రజ్ఞుల స్థాయికి, ఋషుల స్థాయితో పోలిస్తే.... కొన్ని కోట్ల రెట్లు స్థాయీ భేదాలు ఉన్నాయి. మనకు అసలు ఏమీ తెలియదు. ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి వేసుకుని అనుభూతి రహితంగా జీవిస్తున్నాము. అందుచేత మనము ఈ ఏడు తలల సాంద్రతను అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైన ఇటువంటి.... ఘనీభవించిన, అటువంటి ఆత్మ శక్తి ఏమిటి అంటే భౌతిక శరీరము. దీనినే మనము ఏడవ తలము అన్నాము. అంటే ఫిజికల్ ప్లేన్ అంటే మెటీరియల్ ప్లేన్ అంటే మేటర్. మనం మాట్లాడుకునే ఆది తలం.... భౌతిక- ఆదితలం.... అంటే 7.1 తలం. భౌతిక ఆది శరీరము ఏడు రెట్లు ఘనీభవిస్తే మనకు కనిపిస్తున్న ఈ భౌతిక - భౌతిక(7.7 తలం) శరీరము ఏర్పడుతుంది.

పదార్ధములలో ఉన్న అణువుల మధ్య ఉన్న ఖాళీ జాగా ఏమిటి? ఈ ఖాళీ జాగా నే "ఆకాశము" అంటాము కదా! ఆకాశ తత్వం యొక్క లక్షణం ఏమిటి శబ్దమే కదా! రూపం నకు నామం ఉంది. నామాతీత స్థితిలో ఎక్కడ ఉంటాం? విజ్ఞాన తలంలో ఉంటాం......నామ,రూపా తీత స్థితిలో ఏముందో...అదే విజ్ఞాన మయ తలం. ఆత్మ దాని పైన ఉన్నది. దానికి పైన ఉన్నది అనుపాదక తలం. దానికి పైన ఉన్నది ఆది తలం.

మనం ఎక్కడున్నాం? భౌతిక తలంలోనే ఉన్నాము. ఎంత తక్కువ స్థితిలో మనం ఉన్నామో తెలుసుకోండి..... ఎందుకు గురువులు మనల్ని పట్టించుకోరో మనకు అర్థం అయి ఉండాలి..... మీరు అరూపా స్థితి (నామ రూపాస్థితి)కి వస్తే తప్ప గురువు చెప్పింది మనకు అర్థం కాదు.

ఇప్పుడు మీరున్న స్థితిలో మీకు గురువు ఏదైనా చెప్పాడనుకోండి......గీత గీసేసు కుంటారు. ఇంకా ఆ గీత దాటరు. రూపం కదా !రూపాన్ని దాట గలగాలి.

అగ్నిలో పదార్ధాలన్ని వేసి సూక్ష్మీకృతం చేసి అంటే దాన్ని అరూపా స్థితికి తీసుకొని వెళ్లి, చల్లార్చి మనకు కావలసిన రూపాన్ని ఇచ్చుకుంటాము. ఈ ప్రక్రియే "యజ్ఞవిద్య" అనే అద్భుతమైన శాస్త్రము.

మనము జీవాత్మ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. అది ఆది యొక్క ఆది తలంలో ఉంది.(1.1) ఆ స్థితికి చేరాలంటే, భౌతికంగా ఏడు తలాలు దాటి(7.7-7.1), కామము యొక్క ఏడు తరాలు దాటాలి(6.7-6.1) అవి దాటాక మనస్సు యొక్క ఏడు తలాలు దాటాలి(5.7-5.1) అలాగే 4.7-4.1,3.7-3.1,2.7-2.1,1.7-1.1 అలా అన్ని తరాలు కలిపి మొత్తం 49 తలాలు దాటాలి. వీటిని "49 మరుద్గణాలు "అని అంటారు. కానీ ఈ 49 మరుద్గణాలలో....మనం 42 తలాలకి నమస్కారం పెట్టేస్తున్నాము. అంటే ఆ తలాల యొక్క పరిజ్ఞానం మనకు లేదు.

ఇక మిగిలిన తలాలలో7వ తలమైన భౌతిక తలంలో

ఉన్నటువంటి 7 తలాల్లో కూడా మొదటి మూడు తలాలు అయిన భూః భూవః సువః గూర్చి మనం మాటలాడుతున్నాం. తర్వాత ఉన్న మహః జనః తపః సత్యం....ఈ తలాల గూర్చి సవ్య అవగాహన లేదు.(సశేషం)

📚శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాష్టరు గారు

🖋️భట్టాచార్య



11 Jan 2021

No comments:

Post a Comment