శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 322 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 322-1. 'కామ కళారూపా' 🌻

శివ పార్వతుల కళయే కామకళ. అట్టి రూపము అర్ధనారీశ్వర రూపము. కామకళా రూప మనగా శివపార్వతులు ఒకరి నొకరు చేరియున్న రూపము. సృష్టి అంతయూ ప్రకృతి పురుషుల సమాగమమే. స్థూలము నుండి అత్యంత సూక్ష్మస్థితి వరకు కూడ వీరిరువురును కలిసియే యుందురు. వీరి కలయిక చేతనే రూపము కూడ ఏర్పడుచున్నది. ఆమె కామేశ్వరి, అతడు కామేశ్వరుడు. ఒకరియం దొకరికి అమిత ఆసక్తి సహజముగ నుండును.

నిజమునకు ఒకే తత్త్వము ప్రకృతి పురుషులుగ ఏర్పడినది. గనుక వారి నడుమ అట్టి ఆకర్షణ శాశ్వతమై యున్నది. ఒక తత్త్వము సూర్యతత్త్వముగను, మరియొక తత్త్వము చంద్రతత్వముగను భూమిపై వీరు రకరకములైన కళలను అస రాత్రములు పంచుచున్నారు. పదహారు కళలతో ప్రకృతి తత్వము చంద్రకాంతిగ భూమిని పోషించు చున్నది. ఆ కళలన్నియూ సూర్యుడు ఆధారముగ తానందించినవే. చంద్రుడే లేనిచో భూమిపై అంకుర శక్తియే లేదు. అట్లే మూల ప్రకృతి లేనిచో జనించుట అనునదియే లేదు. సృష్టియే లేదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 322-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 322-1. Kāmakalā rūpā कामकला रूपा (322)🌻

She is in the form of kāmakalā. This is Her subtler form which is known only to Her spouse Śiva. The subtlest form is Her kuṇḍalinī form in sahasrāra, where She conjoins Her spouse. Kuṇḍalinī in lower cakra-s does not become subtlest and it attains the subtlest form only in sahasrāra. Kāma refers to the object of adoration, the object that is desired. Here, Śiva becomes the most desired of all, as He is the Supreme Reality or Paramārtha. Śiva being the Supreme Ruler, He is addressed as Kāmeśvara. By addressing Him thus, He not only becomes the object of desire (Kāma), but also becomes the Supreme Ruler (Īśvara). This how He becomes Kāma + Īśvara = Kāmeśvara. Kalā refers to vimarśa form of Śiva, Mahātripurasundarī. Śiva alone is Self-illuminating and Śaktī illuminates the universe with the brilliance of Śiva. Their conjoined form is Kāmakalā.

Kāmakalā consists of three bindu-s (dots) forming a triangle and below this triangle there is an inverted triangle (hārda-kalā) where the three kūṭa-s of Pañcadasī mantra are placed. From this lower inverted triangle all triads are born which ultimately leads to the creation of this universe. The two parallel dots are Her bosoms by which this universe is nurtured and a single dot above these two dots is Her third eye. Kāma means intent to create and kalā refers to a part of the main object, in this case, Śiva. The conjugation of Kāma and kalā leads to the manifestation of Kāmeśvara and Kāmeśvarī forms. Śiva and Śaktī unite only in their kāma forms i.e. kāma + īśvarī and kāma + īśvara. These two, are Their highest forms that cause Creation. She is known as ‘Mahā-tripura-sundarī’ in the Kāmakalā form and is also known as bindutraya samaṣti rūpa divyākṣara rūpiṇi. Mahā means supreme, tripura means three cities (could mean entire triads, the cause for creation that are ruled by Her). The deeper meaning of tripura is Her three actions viz. creation, sustenance and destruction. Sundarī means beauty. So ‘Mahā-tripura-sundarī’ means the beautiful and Supreme Mother, who creates, nourishes and dissolves. These three acts are subtly mentioned in Kāmakalā.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Nov 2021

No comments:

Post a Comment