శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 11 / Sri Lalitha Chaitanya Vijnanam - 11

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 5 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 11 / Sri Lalitha Chaitanya Vijnanam - 11 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల

🌻 11. 'పంచతన్మాత్రసాయకా' 🌻

పంచతన్మాత్రలు బాణములుగా గలది. దేవి నాలుగవ

హస్తమున పంచతన్మాత్రలు అను ఐదు బాణములు ధరించి యున్నదని అర్థము.

రాగమను పాశము, క్రోధమను అంకుశము, మనోరూపమైన ఇక్షు దండము మూడు బాహువులలో ధరించి యున్నట్లుగా ముందు తెలుపబడినది.

నాలుగవ బాహువునందు సృష్టి నిర్మాణ కారకములైన

శబ్దము స్పర్శ రూపము రసము (రుచి) గంధములు ఈ ఐదు బాణములు- శబ్దము ఆకాశగుణము. స్పర్శ వాయు లక్షణము. రూపము వెలుగు లక్షణము. రుచి జల లక్షణము. గంధము లేక వాసన పృథివీ

లక్షణము.

పంచభూతములకు, పంచతన్మాత్రలకు ఇట్టి అనుబంధము కలదు. అటులనే శబ్దము వలన వినుట, అది వినుటకు చెవి; వాయువు వలన స్పర్శ, అది గ్రహించుటకు చర్మము; వెలుగు వలన రూప దర్శనము, అది చూచుటకు కన్ను, జలము వలన రుచి, రుచి చూచుటకు నాలుక; పృథివి వలన గంధము, అది వాసన చూచుటకు ముక్కు ఐదు జ్ఞానేంద్రియములుగ ఏర్పరుపబడును. ఇట్లు పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు వెరసి పదిహేను తత్త్వములుగా ఏర్పడుచున్నవి.

ఇవి నిజమునకు అయిదే, ఒక్కొక్కటి త్రివిధముగ విభజివింపబడి పదిహేనుగ గోచరించుచున్నవి. ఇందు ఒక్కొక్క త్రిభుజమున ఒకదానికన్న నొకటి సూక్ష్మముగ నుండును. ఇంద్రియము స్థూలము. అందు పని చేయు తన్మాత్ర సూక్ష్మము. ఆ తన్మాత్రకు ఆధారముగ నున్న ఆకాశాది భూతములు సూక్ష్మతరములు. “పరతత్త్వమును పంచీకరణము చేయుచున్నాను” అని ఈ హస్తము నందలి ఐదు బాణముల ద్వారా దేవి సూచించుచున్నది.

ఈ పంచీకరణమే లేకుండినచో సృష్టి కేవలము త్రిగుణాత్మకముగ, సూక్ష్మముగ నుండెడిది.

"పంచభూతాత్మకమైన సృష్టి నిర్మాణము చేయుచున్నాను" అని తెలుపుటకే పంచ బాణములు.

పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములతోపాటు పంచ కర్మేంద్రియములను కూడ ఏర్పరచుటచే అందు పరతత్త్వము నాలుగు స్థితులలో వర్తించగలదు (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ స్థితులు), ఇట్లు నాలుగు వ్యూహములు, నాలుగు పంచారములను అధిష్ఠించి యుండినట్లు దేవి ఇరువది నాలుగు తత్త్వములుగ (గాయత్రీ ఛందస్సుగ) సృష్టి నిర్మాణము చేయుచున్నదని గ్రహించవలెను. పై తెలుపబడిన పంచారములే పంచముఖిగను, పంచభుజిగను లేక మకరముగను పెద్దలు పేర్కొందురు.

'మ' అను అక్షరమునకు సంఖ్యా శాస్త్రమున విలువ '5'. ఈ సందర్భమున మకరమును గూర్చి కొంత గ్రహించుట ఆవశ్యకము.

మకరమనగా మొసలియని కూడ అర్థము కలదు. అనగా పట్టి యుంచునది అని అర్థము. నాలుగు మకరములు పరతత్త్వమును నాలుగు స్థితులలో పట్టియుంచినవని గ్రహింపవలెను.

“పరమ పురుషుని కర్మేంద్రియముల యందును, జ్ఞానేంద్రియముల యందును, పంచతన్మాత్రల యందును, పంచభూతముల యందును ఇమిడ్చి యుంచు చున్నాను. అట్టీముడ్చుట అతని సంకల్పము. ఆ సంకల్పమును నిర్వర్తించుటకే నేను చిదగ్నికుండము నుండి చతుర్భాహువులతో ఉద్భవించితిని అని దేవి సందేశ మిచ్చుచున్నది.

దేహముయొక్క పట్టు, ఇంద్రియముల యొక్క పట్టు, జీవునకు బంధహేతువు లగుచున్నవి. బహిరంగమున కల వైభవమునకు ఆకర్షింపబడుట వలన ఈ పట్టు ఏర్పడుచున్నది. అంతరంగ మందలి దివ్యత్త్వము నందు ఆకర్షణము కలిగి, పెరిగినచో బహిరంగ ఆకర్షణలు తగ్గును.

భాగవతమందలి గజేంద్ర మోక్షణము ఈ ధర్మమునే తెలుపుచున్నది. సరస్సునందలి జలముల యందు అత్యాసక్తి (నీరాశ) కలిగి, గజేంద్రుడు ప్రవర్తించుటచే పట్టుబడెను. అంతర్యామి యగు భగవంతుని శరణు

కోరి మోక్షణము పొందెను.

అంతరంగమున కూడ సూక్ష్మముగ, సూక్ష్మతరముగ మరి రెండు మొసళ్ళు గలవు. అందు మొదటిది విజ్ఞానమునకు లోబడుట. మానవుడు తనకు తెలిసిన విషయములతో ఆనందించుటతో పాటు గర్వపడు చుండును కూడ. గర్వము దంభమునకు దారితీయును.

దంభము ఆడంబరమునకు దారితీయును. అది కారణముగ తెలియని వారిని అవహేళన చేయుచుండును. ఆత్మస్తుతి, పరనింద దినచర్య యందు భాగమగును. చదివినవార మనుకొను వారందరు ఈ మొసలికి పట్టుబడి యుందురు.

సూక్ష్మతరమైన పంచారము తానొకడున్నాడను భావము. దీనినే అహంకార భావ మనిరి. పరతత్త్వమే తానుగా ఉన్నడనియు, తనకు ప్రత్యేక అస్తిత్వము లేదనియు తెలియువరకు ఈ మొసలి పట్టు యుండును. అది తెలుపుటకే ' సోహ మస్మి' అను మహా మంత్రము.

సశేషం....
🌹🌹🌹🌹🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 11   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 11. Pañcatanmātra-sāyakā पञ्चतन्मात्र-सायका 🌻

Pañca means five and tanmātra-s are sound, touch, sight, taste and smell, the subtle modifications of the five basic elements ākāś, air, fire, water and earth.

The earlier nāma spoke about the bow and this nāma talks about Her arrows. She has five arrows. These five arrows are made of flowers. The five flower arrows represent five subtle elements. These five flowers or arrows are described differently in various tantra śāstra-s.

These five flowers are lotus flower, raktakairava flower, kalhara flower, indivara flower and flowers of mango tree. These five flowers represent excitement, madness, confusion, stimulation and destruction. The arrows are used in wars targeting the enemies.

Lalitāmbikā targets Her devotees with these arrows to destroy the illusion or māyā as the five subtle elements are associated with māyā. This is Her right lower hand. Vārāhī Devi is represented by this hand.

Nāma-s 8,9,10 and 11 have secret bījākśara-s. For example, eighth nāma has hrīṃ bīja which is known as māyā bīja.

The eighth nāma begins with rāgasva which is formed of ra + aga + sva. Aga means Śiva. The bīja for Śiva is hāṁ (हां). This is to be taken as ha. The next is ra (र) and this is to be taken as it is.

Sva means the letter īṁ (ईं) with a bindu (dot) on the top. The bīja hrīṁ (ह्रीं) is thus formed by ha + ra + īṁ and pronounced as hrīṁ. Like this in the other three nāma-s such bījākaśara-s (da, ra, ka, la, ya, sa, va, ā, ī, ū) are hidden.

That is why Lalitā Sahasranāma is considered on par with Veda-s. Most importantly, this Sahasranāma should not be recited with rāga or svara (musical notes).

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

No comments:

Post a Comment