శివగీత - 75 / The Siva-Gita - 75



🌹. శివగీత - 75 / The Siva-Gita - 75 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ 

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 1 🌻

శ్రీరామ ఉవాచ :-

భగవన్ కుత్ర జీవోసౌ జంతో ర్దే హేవ తిష్టతే

జాయతే నా కుతో జీవః - స్వరూపం వాస్య కిం వద 1


దేహాంతే నా కుత్ర యాతి - గత్వా నాకుత్ర తిష్టతి

కథ మాయాతి నా దేహం - పునర్నాయాతి నా వద 2


సాధు పృష్టం మహాభాగ ! గుహ్య ద్గుహ్యత రం హియ త్

దే వైరపి సుదుర్జే య - మింద్రా ద్యైర్యా మహర్షి భి: 3


అన్యస్యై నైవ వక్తవ్యం - మయాపి రఘునందన !

త్వద్భ క్త్యా హం పరం ప్రీతో - వ్య క్ష్యా మ్య వ హిత శ్రుణు 4


సత్య జ్ఞానాత్మ కో నంతః - పరమానంద విగ్రహః

పరమాత్మా పరంజ్యోతి - రావ్యక్తో వ్యక్త కారణమ్ 5


శరీర స్వరూపమును తెలిసికొని జీవుని గురించి విషయమును తెలిసికొనుటకై రాముడు పునఃప్రశ్నించు చున్నాడు.

ఓయీ భగవంతుడా! మహిమగల ఈ దేహమందు పరోక్షుడ (కనులకు అగుపడని)గు జీవుడుంటున్నాడా? జన్మించుచున్నడా? జీవుడను పేరేట్లు వచ్చినది? ఈ జీవత్వమనునది స్వాభివికమా? అజ్ఞానముతో కూడియున్నదా? జీవుని స్వరూపమెటువంటిది ? అది జ్ఞానాత్మకమా ? తద్విరుద్ధమా? దేహ స్వరూపమును గురించి యెట్లు వచ్చును? లేదా రాదా? అదంతయూ సవిస్తారముగా నాకు బోధించుమనెను.

శ్రీ భగవంతుడుపదేశించెను:- మిగుల రహస్యమగు నిది యింద్రాది దేవతలా చేతను కూడా తెలియదగినది కాదు. నీ యందలి భక్తీ చేత ప్రసన్నుండనై చెప్పుచున్నాను. అవధాన మనస్కుండవై వినుము. దీనిని పరవారలకు తెలుపతగదు. ప్రిబింబరూపుడగు జీవుని స్వరూపమును తెలిసికొనుటకు మొట్టమొదట బింబరూపగు పరమేశ్వర జ్ఞానమును గురించి తప్పకుండా తెలిసికొని బింబమానము నాదేశించుచున్నాడను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 75 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -1
🌻

After knowing in minute details about the gross material body, Rama enquired about the Jiva. Rama said:

O Bhagawan! In this versatile gross body, does the Jiva dwell inside in minute form? Does he take birth inside? How did he receive a name called 'Jiva'? Is the Jivatwam natural or is it bound by ignorance?

How does teh Jiva look like? Please explain me all about Jiva in detail. Sri Bhagawan said: This concept is not even known to Indra et al gods. Pleased with your devotion I am explaining you these secrets. Listen carefully.

These secrets shouldn't be disclosed to undeserving ones. before knowing the form of the Jiva one has to know the form of the Parameshwara who is Bimbarupa .

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

No comments:

Post a Comment