నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
🍀. మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 3వ పాద శ్లోకం
23. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ‖ 23 ‖
గురుర్గురుతమః ---
గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;
గురుః ---
సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;
గురుతమః ---
ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.
ధామ ---
పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.
సత్యః ---
మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.
సత్యపరాక్రమః ---
నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.
నిమిషః ---
యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)
అనిమిషః ---
ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.
స్రగ్వీ ---
వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.
వాచస్పతిః ---
వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.
ఉదారధీః ---
ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు. వాచస్పతి ఉదారధీః - పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 23 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻
🍀. Sloka for Midhuna Rasi, Arudra 3rd Padam
23. gururgurutamō dhāmaḥ satyaḥ satyaparākramaḥ |
nimiṣō nimiṣaḥ sragvī vācaspatirudāradhīḥ || 23 ||
Guruḥ:
The greatest teacher.
Gurutamaḥ:
One who is the teacher of all forms of knowledge.
Dhāma:
The Supreme Light.
Satyaḥ:
One who is embodied as virtue of truth specially.
Satyaparākamaḥ:
One of unfailing valour.
Nimiṣaḥ:
One whose eye-lids are closed in Yoga-nidra.
Animiṣaḥ:
One who is ever awake.
Sragvī:
One who has on Him the necklace called Vaijayanti, which is strung with the subtle aspects of the five elements.
Vācaspatir-udāradhīḥ:
Being the master of Vak or word i.e. knowledge, He is called so. As his intellect perceives everything, He is Udaradhih. Both these epithets together constitute one name.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
No comments:
Post a Comment