1) 🌹 శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 21 / Vishnu Sahasranama Contemplation - 21🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 289 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 11 / Sri Lalita Chaitanya Vijnanam - 11 🌹
5) 🌹. నారద భక్తి సూత్రాలు - 107 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 78 🌹
7) 🌹. శివగీత - 75 / The Shiva-Gita - 75 🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 63 / Gajanan Maharaj Life History - 63 🌹
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 57 🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹
11) 🌹. మంత్రపుష్పం - భావగానం - 8 🌹
12) 🌹. శివ మహా పురాణము - 232 🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 108 🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 121 🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 63🌹
16) 🌹 Seeds Of Consciousness - 186 🌹
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 41 📚
18) 🌹. అద్భుత సృష్టి - 39 🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 23 / Sri Vishnu Sahasranama - 23 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 11 🌴*
11. సర్వద్వారేషు దేహే(స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్త్వమిత్యుత ||
🌷. తాత్పర్యం :
దేహ ద్వారములన్నియును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్త్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును.
🌷. భాష్యము :
దేహమునకు రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికారంధ్రములు, నోరు, జననావయము, పృష్టమను తొమ్మిది ద్వారములు గలవు. ఈ తొమ్మిది ద్వారములలో ప్రతిదియు సత్త్వగుణ లక్షణములచే ప్రకాశమానమైనప్పుడు మనుజుడు సత్త్వగుణమును వృద్ధిచేసికొనిననాడని అవగాహన చేసికొనవచ్చును.
అట్టి సత్త్వగుణమున మనుజుడు విషయములను వాస్తవదృక్పథమున గాంచునట్లు, వినుటయు, స్వీకరించుటయు చేయగలడు. ఆ విధముగా అతడు అంతర్భాహ్యములందు శుద్ధుడు కాగలడు. అనగా ప్రతిద్వారముమందును ఆనందము మరియు సౌఖ్యలక్షణములు వృద్ధి కాగలవు. అదియే సత్త్వగుణపు వాస్తవస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 501 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 11 🌴*
11. sarva-dvāreṣu dehe ’smin
prakāśa upajāyate
jñānaṁ yadā tadā vidyād
vivṛddhaṁ sattvam ity uta
🌷 Translation :
The manifestation of the mode of goodness can be experienced when all the gates of the body are illuminated by knowledge.
🌹 Purport :
There are nine gates in the body: two eyes, two ears, two nostrils, the mouth, the genitals and the anus. When every gate is illuminated by the symptoms of goodness, it should be understood that one has developed the mode of goodness.
In the mode of goodness, one can see things in the right position, one can hear things in the right position, and one can taste things in the right position.
One becomes cleansed inside and outside. In every gate there is development of the symptoms of happiness, and that is the position of goodness.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 21 / Vishnu Sahasranama Contemplation - 21🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 21. నారసింహవపుః, नारसिंहवपुः, Nārasiṃhavapuḥ 🌻*
*ఓం నారసింహవపుషే నమః | ॐ नारसिंहवपुषे नमः | OM Nārasiṃhavapuṣe namaḥ*
నరస్య ఇమే నారాః నరునకు సింహమునకు సంబంధించు అవయవములు ఏ శరీరము (వపువు) నందు కనబడుచుండునో అట్టి వపువు ఎవనికి కలదో అట్టివాడు.
భాగవతసారముగా పేరొందిన శ్రీమన్నారాయణీయమునందలి 25వ దశకమునందు, మేల్పతూర్ నారాయణ భట్టాత్రివారు దర్శించిన నృసింహరూపము.
:: శ్రీమన్నారాయణీయం - 25వ దశకము ::
ఉత్సర్పద్వలిభంగభీషణహనుం హ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోశ్శతోద్గతనఖక్రూరాంశుదూరోల్బణమ్ ।
వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘనప్రధ్వానవిర్ధావిత స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః ॥ 4 ॥
స్వామీ! అట్టహాసము చేసినపుడు నీ చెక్కిళ్ళు (గండ భాగము) ముడుతలు పడుచున్నవి. నీ కంఠభాగము పొట్టిగానుండి దృఢముగానున్నది. బాగుగా పుష్టిగలిగియున్న నీ హస్తములయొక్క గోళ్ళు మిక్కిలి వాడియై మహా భయంకరముగా ఉన్నవి. నీ శరీరము ఆకాశమునంటుకొనుచున్నట్లు చాలా ఎత్తుగానున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘగర్జనమువలె ఉండి శత్రువులను తరిమితరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసింహ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 21 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 21 Nārasiṃhavapuḥ 🌻*
*21 Nārasiṃhavapuṣe namaḥ*
One in whom the bodies of a man and a lion are combined. The reference is to the incarnation of man-lion form of Viṣṇu known as Nr̥siṃha.
Melpathur Narayana Bhattathiri who epitomized 18,000 splendid verses of Śrīmadbhāgavata into Śrīmannārāyaṇīyaṃ with 1036 verses, described the form of Nr̥siṃha in the 25th canto asunder.
Śrīmannārāyaṇīyaṃ - 25th Canto
Utsarpadvalibhaṃga-bhīṣaṇahanuṃ
hrasvasthavīyastara-grīvaṃ
pīvaradośśatodgata-nakha
krūrāṃśudūrolbaṇam,
Vyomollaṃghi-ghanāghanopamaghana
pradhvānavirdhāvita -
spardhāluprakaraṃ namāmi -
bhavatastannārasiṃhaṃ vapuḥ. (4)
Your cheeks were made terrifying by the lines formed by wrinkles when You roared, with a short but stout neck, with a hundred mighty arms with outstretching claws shining and instilling fear, with a tumultuous roar like that of thunder originating in dense clouds, which drives away repeatedly hordes of enemies, Your such manifestation in the form of a Narasiṃha (man-lion), I humbly and devoutly salute.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥
Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 290 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 38
*🌻 About Bairagi - 1 🌻*
My episode caused an uproar in Peethikapuram. Rumour spread that some Brahmin bairagi entered Sri Kukkuteswara temple and had darshan of Swayambhu Datta. As he was a Kshudra Mantrika, he applied his kshudra Shakti, on Kukkuteswara and Swayambhu Datta.
Because of Archaka Swami’s (priests) austerities, the power had not decreased and it gave opposite result and this bairagi was lying unconscious without heart beat or pulse beat. Commonly rumours spread fast. The people there were very clever in projecting truth as untruth and untruth as truth and make others believe.
Sripada Srivallabha who manifested among these clever people, was much more clever than them. He was enjoying the things happening there. He is an eternal enjoyer and divine enjoyer. Archaka Swami’s greatness increased tremendously in Peethikapuram.
Rumours spread that, because of their austerities, one ‘kshudra mantrika’ became unconscious and lying like a dead body, if they followed them, all the troubles would go and if special ‘pujas’ were done through them, one would get great merit. ‘Pujas’ were being done by Archaka Swamis. Brahmins were being given great ‘sambhavanas’. Meanwhile, there was a disturbance among Archaka Swamis.
They were struggling hard physically doing ‘pujas’ to Swayambhu Datta and Kukkuteswara, so they were being given great ‘dakshinas’ along with different types of Swayampakam (giving uncooked raw food materials).
But when they kept the money in boxes in their houses, it was disappearing by morning. Because they had promised to do ‘archana’ on behalf of everybody, they had to do the ‘pujas’ compulsorily.
Moreover, though they were being given food materials of different kinds and they were eating more than previously, they were becoming weak. On one hand, they became weak and on the other, their money was disappearing. If they expressed their plight, they would be in trouble.
When there was a strong rumour that they follow great austerities and they were great mantra and tantra scholars, it would be insulting if people came to know that they came under the influence of ‘yakshini’ and were losing their money. So they did not say anything and kept it to themselves.
They decided to know whether the bairagi, who was unconscious, was really dead or alive. This thing was brought before Bapanarya. Bapanarya examined the body of the bairagi and said, “he has not died, He also has not become unconscious
He is in a type of ‘samadhi state’. Some people thought that if this bairagi was cremated ignoring the words of Sri Bapanarya, the yakshini dosham would be removed.
Some others said that if the body was cremated, the bairagi’s powers would increase and he would create more troubles. Only because of Sripada’s wonderful ‘will’, my body was not burnt.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 11 / Sri Lalitha Chaitanya Vijnanam - 11 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల
*🌻 11. 'పంచతన్మాత్రసాయకా' 🌻*
పంచతన్మాత్రలు బాణములుగా గలది. దేవి నాలుగవ హస్తమున పంచతన్మాత్రలు అను ఐదు బాణములు ధరించి యున్నదని అర్థము.
రాగమను పాశము, క్రోధమను అంకుశము, మనోరూపమైన ఇక్షు దండము మూడు బాహువులలో ధరించి యున్నట్లుగా ముందు తెలుపబడినది.
నాలుగవ బాహువునందు సృష్టి నిర్మాణ కారకులైన శబ్దము స్పర్శ రూపము రసము (రుచి) గంధములు ఈ ఐదు బాణములు- శబ్దము ఆకాశగుణము. స్పర్శ వాయు లక్షణము. రూపము వెలుగు లక్షణము. రుచి జల లక్షణము. గంధము లేక వాసన పృథివీ
లక్షణము.
పంచభూతములకు, పంచతన్మాత్రలకు ఇట్టి అనుబంధము కలదు. అటులనే శబ్దము వలన వినుట, అది వినుటకు చెవి; వాయువు వలన స్పర్శ, అది గ్రహించుటకు చర్మము; వెలుగు వలన రూప దర్శనము, అది చూచుటకు కన్ను, జలము వలన రుచి, రుచి చూచుటకు నాలుక; పృథివి వలన గంధము, అది వాసన చూచుటకు ముక్కు ఐదు జ్ఞానేంద్రియములుగ ఏర్పరుపబడును. ఇట్లు పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు వెరసి పదిహేను తత్త్వములుగా ఏర్పడుచున్నవి.
ఇవి నిజమునకు అయిదే, ఒక్కొక్కటి త్రివిధముగ విభజివింపబడి పదిహేనుగ గోచరించుచున్నవి. ఇందు ఒక్కొక్క త్రిభుజమున ఒకదానికన్న నొకటి సూక్ష్మముగ నుండును. ఇంద్రియము స్థూలము. అందు పని చేయు తన్మాత్ర సూక్ష్మము. ఆ తన్మాత్రకు ఆధారముగ నున్న ఆకాశాది భూతములు సూక్ష్మతరములు. “పరతత్త్వమును పంచీకరణము చేయుచున్నాను” అని ఈ హస్తము నందలి ఐదు బాణముల ద్వారా దేవి సూచించుచున్నది.
ఈ పంచీకరణమే లేకుండినచో సృష్టి కేవలము త్రిగుణాత్మకముగ, సూక్ష్మముగ నుండెడిది.
"పంచభూతాత్మకమైన సృష్టి నిర్మాణము చేయుచున్నాను" అని తెలుపుటకే పంచ బాణములు.
పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములతోపాటు పంచ కర్మేంద్రియములను కూడ ఏర్పరచుటచే అందు పరతత్త్వము నాలుగు స్థితులలో వర్తించగలదు (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ స్థితులు), ఇట్లు నాలుగు వ్యూహములు, నాలుగు పంచారములను అధిష్ఠించి యుండినట్లు దేవి ఇరువది నాలుగు తత్త్వములుగ (గాయత్రీ ఛందస్సుగ) సృష్టి నిర్మాణము చేయుచున్నదని గ్రహించవలెను. పై తెలుపబడిన పంచారములే పంచముఖిగను, పంచభుజిగను లేక మకరముగను పెద్దలు పేర్కొందురు.
'మ' అను అక్షరమునకు సంఖ్యా శాస్త్రమున విలువ '5'. ఈ సందర్భమున మకరమును గూర్చి కొంత గ్రహించుట ఆవశ్యకము.
మకరమనగా మొసలియని కూడ అర్థము కలదు. అనగా పట్టి యుంచునది అని అర్థము. నాలుగు మకరములు పరతత్త్వమును నాలుగు స్థితులలో పట్టియుంచినవని గ్రహింపవలెను.
“పరమ పురుషుని కర్మేంద్రియముల యందును, జ్ఞానేంద్రియముల యందును, పంచతన్మాత్రల యందును, పంచభూతముల యందును ఇమిడ్చి యుంచు చున్నాను. అట్టీముడ్చుట అతని సంకల్పము. ఆ సంకల్పమును నిర్వర్తించుటకే నేను చిదగ్నికుండము నుండి చతుర్భాహువులతో ఉద్భవించితిని అని దేవి సందేశ మిచ్చుచున్నది.
దేహముయొక్క పట్టు, ఇంద్రియముల యొక్క పట్టు, జీవునకు బంధహేతువు లగుచున్నవి. బహిరంగమున కల వైభవమునకు ఆకర్షింపబడుట వలన ఈ పట్టు ఏర్పడుచున్నది. అంతరంగ మందలి దివ్యత్త్వము నందు ఆకర్షణము కలిగి, పెరిగినచో బహిరంగ ఆకర్షణలు తగ్గును.
భాగవతమందలి గజేంద్ర మోక్షణము ఈ ధర్మమునే తెలుపుచున్నది. సరస్సునందలి జలముల యందు అత్యాసక్తి (నీరాశ) కలిగి, గజేంద్రుడు ప్రవర్తించుటచే పట్టుబడెను. అంతర్యామి యగు భగవంతుని శరణు
కోరి మోక్షణము పొందెను.
అంతరంగమున కూడ సూక్ష్మముగ, సూక్ష్మతరముగ మరి రెండు మొసళ్ళు గలవు. అందు మొదటిది విజ్ఞానమునకు లోబడుట. మానవుడు తనకు తెలిసిన విషయములతో ఆనందించుటతో పాటు గర్వపడు చుండును కూడ. గర్వము దంభమునకు దారితీయును.
దంభము ఆడంబరమునకు దారితీయును. అది కారణముగ తెలియని వారిని అవహేళన చేయుచుండును. ఆత్మస్తుతి, పరనింద దినచర్య యందు భాగమగును. చదివినవార మనుకొను వారందరు ఈ మొసలికి పట్టుబడి యుందురు.
సూక్ష్మతరమైన పంచారము తానొకడున్నాడను భావము. దీనినే అహంకార భావ మనిరి. పరతత్త్వమే తానుగా ఉన్నడనియు, తనకు ప్రత్యేక అస్తిత్వము లేదనియు తెలియువరకు ఈ మొసలి పట్టు యుండును. అది తెలుపుటకే ' సోహ మస్మి' అను మహా మంత్రము.
సశేషం....
🌹🌹🌹🌹🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 11 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 11. Pañcatanmātra-sāyakā पञ्चतन्मात्र-सायका 🌻*
Pañca means five and tanmātra-s are sound, touch, sight, taste and smell, the subtle modifications of the five basic elements ākāś, air, fire, water and earth.
The earlier nāma spoke about the bow and this nāma talks about Her arrows. She has five arrows. These five arrows are made of flowers. The five flower arrows represent five subtle elements. These five flowers or arrows are described differently in various tantra śāstra-s.
These five flowers are lotus flower, raktakairava flower, kalhara flower, indivara flower and flowers of mango tree. These five flowers represent excitement, madness, confusion, stimulation and destruction. The arrows are used in wars targeting the enemies.
Lalitāmbikā targets Her devotees with these arrows to destroy the illusion or māyā as the five subtle elements are associated with māyā. This is Her right lower hand. Vārāhī Devi is represented by this hand.
Nāma-s 8,9,10 and 11 have secret bījākśara-s. For example, eighth nāma has hrīṃ bīja which is known as māyā bīja.
The eighth nāma begins with rāgasva which is formed of ra + aga + sva. Aga means Śiva. The bīja for Śiva is hāṁ (हां). This is to be taken as ha. The next is ra (र) and this is to be taken as it is.
Sva means the letter īṁ (ईं) with a bindu (dot) on the top. The bīja hrīṁ (ह्रीं) is thus formed by ha + ra + īṁ and pronounced as hrīṁ. Like this in the other three nāma-s such bījākaśara-s (da, ra, ka, la, ya, sa, va, ā, ī, ū) are hidden.
That is why Lalitā Sahasranāma is considered on par with Veda-s. Most importantly, this Sahasranāma should not be recited with rāga or svara (musical notes).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 107 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 77
*🌻 77. సుఖ దుఃఖెచ్చా లాభాది త్వక్తే కాలే ప్రతీ(క్ష్య్ర)క్షమాణ క్షణార్ధమపి వ్యర్థం న నెయమ్ ॥ 🌻*
భక్తుడు సుఖ దుఃఖాది ద్వంద్వాలను జయించినప్పుడు అతడికి సామాన్యమైన కర్తవ్యాలు ఏమీ ఉండవు. అప్పుడు ఊరకే ఉండడానికి కాలం భారంగా తోస్తుంది. కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండడానికి భక్తుడు శ్రేయో మార్గాన్ని అవలంపీస్తూ కాలాన్ని వినియోగినాడు.
అలా కాకుండా ఊరక ఉంటే మానసికమైన వ్యాపారాలు జనిస్తాయి. వాటికి సందు ఇస్తే ఆ విషయాలే బలీయమై, భక్తికి ఆటంకం కలిగించడమే కాకుండా భక్తిని చెడగొదడతాయి. అందువలన సాధకులు వారు అందుకున్న స్థాయిని (కిందికి దిగజార్చకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఎంతమంచి ఇత్తడి అయినా ప్రతిరోజూ శుభ్రపరచకపోతే చిలుము పట్టుతుంది కదా ! అలాగే సాధన క్రమంలో పట్టు జారకుండా చూచుకుంటె ఆ భక్తి ప్రవర్ధమానమై తేజరిల్లుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 75 / The Siva-Gita - 75 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము - 1 🌻*
శ్రీరామ ఉవాచ :-
భగవన్ కుత్ర జీవోసౌ జంతో ర్దే హేవ తిష్టతే
జాయతే నా కుతో జీవః - స్వరూపం వాస్య కిం వద 1
దేహాంతే నా కుత్ర యాతి - గత్వా నాకుత్ర తిష్టతి
కథ మాయాతి నా దేహం - పునర్నాయాతి నా వద 2
సాధు పృష్టం మహాభాగ ! గుహ్య ద్గుహ్యత రం హియ త్
దే వైరపి సుదుర్జే య - మింద్రా ద్యైర్యా మహర్షి భి: 3
అన్యస్యై నైవ వక్తవ్యం - మయాపి రఘునందన !
త్వద్భ క్త్యా హం పరం ప్రీతో - వ్య క్ష్యా మ్య వ హిత శ్రుణు 4
సత్య జ్ఞానాత్మ కో నంతః - పరమానంద విగ్రహః
పరమాత్మా పరంజ్యోతి - రావ్యక్తో వ్యక్త కారణమ్ 5
శరీర స్వరూపమును తెలిసికొని జీవుని గురించి విషయమును తెలిసికొనుటకై రాముడు పునఃప్రశ్నించు చున్నాడు.
ఓయీ భగవంతుడా! మహిమగల ఈ దేహమందు పరోక్షుడ (కనులకు అగుపడని)గు జీవుడుంటున్నాడా? జన్మించుచున్నడా? జీవుడను పేరేట్లు వచ్చినది? ఈ జీవత్వమనునది స్వాభివికమా? అజ్ఞానముతో కూడియున్నదా? జీవుని స్వరూపమెటువంటిది ? అది జ్ఞానాత్మకమా ? తద్విరుద్ధమా? దేహ స్వరూపమును గురించి యెట్లు వచ్చును? లేదా రాదా? అదంతయూ సవిస్తారముగా నాకు బోధించుమనెను.
శ్రీ భగవంతుడుపదేశించెను:- మిగుల రహస్యమగు నిది యింద్రాది దేవతలా చేతను కూడా తెలియదగినది కాదు. నీ యందలి భక్తీ చేత ప్రసన్నుండనై చెప్పుచున్నాను. అవధాన మనస్కుండవై వినుము. దీనిని పరవారలకు తెలుపతగదు. ప్రిబింబరూపుడగు జీవుని స్వరూపమును తెలిసికొనుటకు మొట్టమొదట బింబరూపగు పరమేశ్వర జ్ఞానమును గురించి తప్పకుండా తెలిసికొని బింబమానము నాదేశించుచున్నాడను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 75 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -1 🌻
After knowing in minute details about the gross material body, Rama enquired about the Jiva. Rama said:
O Bhagawan! In this versatile gross body, does the Jiva dwell inside in minute form? Does he take birth inside? How did he receive a name called 'Jiva'? Is the Jivatwam natural or is it bound by ignorance?
How does teh Jiva look like? Please explain me all about Jiva in detail. Sri Bhagawan said: This concept is not even known to Indra et al gods. Pleased with your devotion I am explaining you these secrets. Listen carefully.
These secrets shouldn't be disclosed to undeserving ones. before knowing the form of the Jiva one has to know the form of the Parameshwara who is Bimbarupa .
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 78 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*Part 71
Sri Ganesaya Namaha
Sri Saraswatyai Namaha
Sri Pada Vallabha Narasimha Saraswati
Sri Guru Dattatreyaya Namaha
Sloka:
Gukarassyad gunatito rupatito rukarah | Guna rupa vihinatvat gururuityabhidiyate ||
GU stands for one who is beyond the three Gunas or qualities. RU stands for the one who is beyond Rupa or form.
Guru is the personification of the Absolute without attributes and form. We should inculcate the feeling that all forms belong to the Guru. You should realize that the Guru is beyond all form, beyond all qualities and beyond time.
Sloka:
Gukarah prathamo varno mayadi gunabhasakah | Rukarosti param brahma maya bhranti vimocakah ||
The first syllable GU belongs to the three Gunas which are the cause of illusion. The second syllable RU stands for the Parabrahman that destroys the delusion caused by illusion.
Sloka:
Evam gurupadam srestham devanamapi durlabham | Haha huhu ganaiscaiva gandharvairapi pujitam || Sloka: Dhruvam tesam ca sarvesam nasti tatvam guroh param | Guroraradhanam karyam swajivatvam nivedayet ||
The term GURU is of utmost importance. The term is so important that it should be used only in specific situations.
We keep using the word Guru loosely. It is said that children should not be given the name “Guru”. It’s okay to join the word Guru with another word while christening the baby, but the name “Guru” alone should not be used.
These days, “Guru” has become a generic term we use to flag down someone in bus stations, train stations or restaurants. I have pointed out many times that the term “Guru” is a very holy mantra. It is “Gunatitam” – beyond all qualities. It is “Mayatitam” – beyond all form. This is beyond the comprehension of even Gods.
The songsters of heaven such as Haha, Huhu and Gandharvas (heavenly beings) respect this term the most; for there is no sublime concept even for them other than this. Hence, the Guru must be worshiped.
While worshiping the Guru one has to offer one’s life which means all that he possesses as a living being. In the same way, the feeling “I am the being” should be sacrificed and one should dwell in the state of eternal consciousness in the form of pure bliss This is what is called a total offering.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 64 / Sri Gajanan Maharaj Life History - 64 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 13వ అధ్యాయము - 1 🌻*
శ్రీగణేశయనమః ! ఓశ్రీహరీ మీరు మహాయోగి, దయాసాగరుడవు మరియు గోప, గోపికలకు స్నేహితులు. ఓశ్రీహరి దయచేసి మీరు నాకు ప్రత్యక్షం కండి. మీదైవత్వం చూసేందుకు బ్రహ్మదేవుడు గోకులంనుండి ఆవులను దూడలను దొంగిలించవలసి వచ్చింది. ఆసమయంలో మీరు స్వయంగా ఆవులు దూడలుగా అయి మీ దైవత్వాన్ని బ్రహ్మదేవునకు ప్రత్యక్షించారు.
యమున లోని కాళీయ అనే తాచుపామును చిత్తుచేసి అక్కడనుండి అతనిని రమణిక ద్వీపం పంపించి గోపాలులకు అతని బాధనుండి ముక్తి కలిగించారు. అదేవిధంగా నాదురదృష్టాన్ని అణచివేసి నన్ను అన్ని భయాలనుండి విముక్తుడిని చెయ్యమని వేడుకుంటున్నాను.
ఓహరీ నేను అతి తెలివితక్కువయిన మీభక్తుడను, మీదీవెనలకు అర్హుడను, తగినవాడినీ కాను అయినా మీసహకారం, కృపయానాయందు ఉంచి నన్ను ఈచింతలన్నిటినుండి వెంటనే ముక్తుడిని చెయ్యమని కోరుకుంటున్నాను.
ఇప్పుడు వినండి.... బనకట్, హరి, లక్ష్మణ్ విథు మరియి జగదియోలు కలిసి శ్రీమహారాజు మఠానికి విరాళాలు కోసం తిరిగారు. నమ్మకం ఉన్నవాళ్ళు వెంటనే ఇచ్చారు, మరికొంతంమంది ఆకతాయి ప్రజలు మీయోగికి విరాళం అవసరం ఎందుకు ? శ్రీగజానన్ మహారాజు గొప్ప యోగి, ఏవిధమయిన చమత్కారమైనా చెయ్యగలవాడు అని మీరు ఎప్పుడూ అంటూఉంటారు కదా, మరి తన మఠం కోసం డబ్బు అవసరం ఎందుకు వచ్చింది ?
కుబేరుడు ఆయన బ్యాంకరు, ఈ విధంగా ప్రతిగుమ్మం దగ్గరకూ డబ్బుకోసం వెళ్ళనవసరంలేకుండా కుబేరుని పేర ఒక హుండీ తీస్తే సరిపోతుంది అని అన్నారు. దానికి జగదియో నవ్వి, ఈ విధంగా విరాళాల కోసం యాచించడం మీమంచికోసమే.శ్రీమహారాజుకోసం మఠం కానీ మందిరం కానీ నిర్మించవలసిన అవసరంలేదు. ఈ ప్రయాస అంతా మీ సుఖసంతోషాల కోసమే. ఈ ప్రపంచం అంతా శ్రీమహారాజుకు మఠం, ఈ అడవులన్నీ ఆయనకి ఉద్యానవనాలు, మరియు భూమి ఆయనకు శయనశయ్య.
ఎనిమిది సిద్దులు ఆయనకు సేవలు చేస్తూఉంటాయి. నీగురించి ఆయన లక్ష్యపెట్టరు, ఎందుకంటే ఆయన గొప్పతనం నీవు ఊహించుతున్న దానికంటే పూర్తిగా భిన్నమయినది. చీకటి పారద్రోలడానికి సూర్యునికి క్రొవ్వొత్తి ఏమి సహాయం చెయ్యగలదు ? సూర్యుడు స్వయనా కాంతివంతుడు, క్రొవ్వొత్తి అవసరం లేనేలేదు. ఒక గూర్ఖా మహారాజుకి ఏమి విశిష్టత తేగలడు ?
మానవులకి ప్రాపంచిక సుఖాలు, కోరికలు ఇటువంటి మంచిపనులు చెయ్యటంవలన పూర్తి అవుతాయి. ఔషధం శారీరిక రోగాన్ని నయంచెయ్యడానికి కానీ ఆత్మ కోసం కాదు అని గుర్తుంచుకోండి. శరీరం రోగ గ్రస్తం అవచ్చుకానీ ఆత్మకాదు. ఇంత ఎందుకు జీవన్మరణాల వల్లకూడా ఈ ఆత్మకు ఏవిధమయిన పరిణామంఉండదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 64 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 13 - part 1 🌻*
Shri Ganeshayanmah! O Shri Hari! You are the supreme saint, the ocean of kindness and an intimate friend of the Gopa and Gopis. O Shri Hari! Please manifest Yourself to me.
Brahmadeo had to steal cows and calfs in Gokul to see the Godliness in You. At that time You Yourself became cows of calfs and manifested the Godliness in You to Brahmadeo.
You crushed Kaliya Cobra in Yamuna and sent him to Ramanakdweep to free the Gopas of his menace. Likewise, I request You to trample my misfortune and to rid me of all fears. O Hari! I am the most ignorant devotee of Yours: undeserving and not suitable for Your blessings, but, even then, I request You to please oblige me by Your favor to free me from all worries immediately.
Now listen. Bankat, Hari, Laxman Vithu and Jagdeo together went around collecting donations for the Matth of Shri Gajanan Maharaj . Believers readily subscribed while some mischievous people taunted them saying, Why should your saint need donations?
You always say that Shri Gajanan Maharaj is a great saint capable of performing any miracle, then why should He need money for His Matth? Kuber is his banker Just draw a Hundi in the name of Kuber instead of going from door to door for money.
At this Jagdeo laughed and said, This begging for donations is for your good. There is no need to build Matth or temple for Shri Gajanan Maharaj. All this exercise is meant for bringing happiness to you.
This whole universe is a Matth for Shri Gajanan Maharaj . All these forests are gardens and the earth a cot for him. Eight Siddhis serve him like maids. He does not care for you, as his glory is entirely different from what you imagine it to be.
How can a candle help the sun in diffusing darkness? The sun is, itself, light and does not need a candle at all.
How can a watchman bring grandeur to an emperor? Human beings desire material pleasure and that can be fulfilled by this good deed.
Remember that the medicine is required to cure the disease of the body and not of soul. Body is susceptible to disease and not the soul. What of that, even birth and death does not affect the soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 57 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 7 🌻*
229. సాధారణముగా మరణము సమీపించు ఘడియలందు సూక్ష్మ శరీరమును , జీవశ క్తియు స్థూలదేహమునుండి పూర్తిగా వేరగును .కాని స్థూలదేహముతో గల సంబంధమును మనస్సు , మరణానంతరము 5 రోజుల వరకు కాపాడును .మరియొకప్పుడు 5 రోజుల తరువాత 7 రోజుల వరకు యీ సంబంధమును కాపాడును .
230. ఆత్మ , భౌతికలోకానుభవమును పొందుచున్నప్పుడు , జనన - మరణములు ;కష్ట - సుఖములు ; పుణ్య పాపములు , మొదలైన ద్వంద్వానుభవములు అన్నింటిని , ఈ స్థూల రూపమే పొందుచున్నది .
231. ఆత్మకు స్థూలరూపము నీడవంటిది .
232. ఆత్మ పొందుచున్న అనుభవములన్నియు , తనకు నీడ యైన స్థూలరూపానుభవములేకాని , ఆత్మకు ఎట్టి అనుభవము లేదు .
233. సంస్కారముల కారణముననే , ఆత్మ , శరీరములే తాననెడి అనుభవమును పొందుచున్నది .ఈ అజ్ఞానమునకు కారణము ,సమస్త అనుభవములకు కారణము ---ఈ సంస్కారములే .
234. రూపము లేని ఆత్మ , జనన_మరణములు లేని ఆత్మ ; అనంతమైన ఆత్మ ; శాశ్వతమైన ఆత్మ ; కష్ట -సుఖములు సుఖ _ దు:ఖములు మొదలగు ద్వంద్వములకు అతీతమైన ఆత్మ తనకు _ రూపమున్నదనియు , జనన_మరణములు పొందుచుంటిననియు , పరిమితిగల దాననియు, అనిత్యమైన దాననియు , కష్ట సుఖములు పుణ్య పాపములు _పొందుచుంటిననియు అనుభవుమును పొందుటకు సంస్కారములే కారణము .
ఈ అజ్ఞానమునకు కూడా సంస్కారములే కారణము . ఈ ద్వంద్వ అనుభవము లన్నియు స్థూల రూపమే పొందుచున్నది .
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 25 🌴
25. దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగాన్నివాస ||
🌷. తాత్పర్యం :
ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 417 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 25 🌴
25. daṁṣṭrā-karālāni ca te mukhāni
dṛṣṭvaiva kālānala-sannibhāni
diśo na jāne na labhe ca śarma
prasīda deveśa jagan-nivāsa
🌷 Translation :
O Lord of lords, O refuge of the worlds, please be gracious to me. I cannot keep my balance seeing thus Your blazing deathlike faces and awful teeth. In all directions I am bewildered.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మంత్ర పుష్పం - భావగానం - 8 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మంత్రం పుష్పం - 17 to 19 🌻*
*🌻. మంత్ర పుష్పం 17.*
*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*అసౌవై తపన్నపా మాయ తనం*
*ఆయతనవాన్ భవతి*
*ఆముష్య తపత ఆయతనంవేద*
*ఆయతనవాన్ భవతి*
*అపోవా ఆముష్య తపత*
*ఆయతనం ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*
*🍀. భావగానం:*
ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు.
సూర్య తేజో నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు.
నీరు జ్వాలల బంధ మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు.
*🌻. మంత్ర పుష్పం 18.*
*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*చన్ద్రమా వా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యశ్చన్ద్ర మసఆయతనం*
*వేద ఆయతనవాన్ భవతి*
*అపోవై చన్ద్రమస ఆయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*
*🍀. భావ గానం:*
ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
నీరు చంద్రుని దని తెలిసెదరో
వారు ఆ నివాసము పొందెదరు
ఎవరు చంద్ర నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
నీరుచంద్రుల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
*🌻. మంత్ర పుష్పం19.*
*యో౭పామాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*నక్షత్రాణివా అపామాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*యో నక్షత్రాణా మాయతనం వేద*
*ఆయతనవాన్ భవతి*
*అపోవై నక్షత్రాణా మాయతనం*
*ఆయతనవాన్ భవతి*
*య ఏవంవేద*
*🍀. భావ గానము:*
ఎవరు నీటి నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు
నక్షత్రాలకు నీరు నివాసమని
నీటికి నక్షత్రాలు నివాసమని.
నీరు, తారల నివాస మెరిగెదరో
వారు ఆ నివాసము పొందెదరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 233 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
51. అధ్యాయము - 6
*🌻. సంధ్య తపస్సును చేయుట - 3 🌻*
నమో నమః కారణకారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ |
సమస్తలో కాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ || 20
యస్యాsపరం నో జగదు చ్యతే పదాత్ క్షితిర్దిశస్సూర్య ఇందు ర్మనోజః |
బహిర్ముఖా నాభితశ్చాంతరింక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోsస్తు || 21
యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః | కథం స్తోష్యామి తం దేవం
వా ఙ్మనోsగోచరం హరమ్ || 22
సర్వకారణకారుణుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము (20).
భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, మన్మథుడు ఇత్యాది జగత్తు శివుని కంటె భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే గాక, బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమమే. ఆయన నాభినుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో! అట్టి నీకు నా నమస్కారము (21).
ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవని నుండి జగత్తు పుట్టినదో అట్టి, వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను? (22).
యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనా ః | న విప్రణ్వంతి రూపాణి వర్ణ నీయాః కథాం సమే || 23
స్త్రి యా మయా తే కింజ్ఞేయా నిర్గుణస్య గుణాః ప్రభో | నైవ జానంతి యద్రూపం సేంద్రా అపి సురాసురాః || 24
నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ | ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోsస్తుతే || 25
ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులగు మునులు కూడ వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను ? (23).
హే ప్రభూ! ఎవని రూపమును ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడ తెలియ జాలరో, ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను? (24).
ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. తపస్స్వరూపుడవగు హే శంభో! నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవా! నీకు అనేక నమస్కారములు (25).
బ్రహ్మోవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్యా స్సంస్తుతః పరమేశ్వరః | సుప్రసన్నతరశ్చా భూ చ్ఛంకరో భక్తవత్సలః || 26
అథ తస్యాశ్శరీరం తు వల్కలాజిన సంయుతమ్ | పరిచ్ఛిన్నం జటావ్రాలైః పవిత్రే మూర్ధ్ని రాజితైః || 27
హిమానీ తర్జితాం భోజసదృశం వదనం తదా | నిరీక్ష్య కృపయావిష్టో హరః ప్రోవాచ తామిదమ్ || 28
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆమె చేసిన ఈ స్తుతిని విని పరమేశ్వరుడు, భక్తవత్సలుడు అగు శంకరుడు మరింత ప్రసన్నుడాయెను (26).
ఆమె శరీరముపై నార బట్టను, మృగచర్మమును ధరించి యుండెను. పవిత్రమగు ఆమె శిరస్సుపై కేశములు జడలు కట్టి ప్రకాశించెను (27).
ఆమె ముఖము మంచు దెబ్బకు వాడిపోయిన పద్మమువలె నుండెను. ఆమెను చూచి దయ కలిగిన హరుడు ఆమెతో నిట్లనెను (28).
మహేశ్వర ఉవాచ |
ప్రీతాస్మి తపసా భ##ద్రే భవత్యాః పరమేణ వై | స్తవేన చ శుభ ప్రాజ్ఞే వరం వరయ సాంప్రతమ్ || 29
యేన తే విద్యతే కార్యం వరేణాస్మిన్మనోగతమ్ | తత్కరిష్యే చ భద్రం తే ప్రసన్నోsహం తవ వ్రతైః || 30
మహేశ్వరుడిట్లు పలికెను -
హే భద్రే! నీవు చేసిన గొప్ప తపస్సు చేత, స్తోత్రముచే త నేను ప్రీతుడనైతిని. ఓ శుభకరమగు బుధ్ధి గలదానా! ఇపుడు వరమును కోరుకొనుము (29).
నీ మనస్సులో నున్న కార్యసిద్ధిని నేను కలిగించెదను. వరమునిచ్చెదను. నీకు మంగళమగు గాక ! నీ వ్రతములచే నేను ప్రసన్నుడనైతిని (30).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 121 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. నరనారాయణ మహర్షులు - 2 🌻*
8. ఆర్యుడు విగ్రహాన్ని ఆరాధించనే ఆరాధించడు. విగ్రహాన్ని ఆరాధిస్తున్నారని తెలియనివాళ్ళు అంటారు. అంటే విగ్రహాన్ని పూజచేస్తూ, అంతర్వస్తువును-ఒక దేవతను-సూక్ష్మవస్తువును-హిందువు ధ్యానిస్తాడు. ఆ విగ్రహమందుకూడా అంతర్యామి ఉన్నాడు అని భావన. తనలోపల ఉండే వస్తువును ఆరాధనచేసుకొని తాను అంతర్ముఖుడు కాలేడు.
9. అందుచేత, బయట ఒక సుందరమైన విగ్రహాన్ని కల్పించుకొని ఆ నారాయణుడు అక్కడఉన్నట్లు భావనచేసి, కాని లోపల ఉండే వస్తువే ఫలాన్నిస్తుందని నిశ్చితంగా జ్ఞాపకం చేసుకొని, ఆర్యుడు ఫలాన్ని పొందుతున్నాడు. ‘అది మాకు ప్రతీక(symbol). మాది ప్రతీకోపాసన.
10. అంతరాత్మయై, అందుండేటటువంటి వస్తువుయొక్క ప్రతిబింబం, విగ్రహంలో ఉంది. దీంట్లో ఉండే అంతర్వస్తువు మా లోపల ఉందనే భావంతో ఆరాధన చేస్తాం. అందుకనే మా పూజలు ఫలప్రదమవుతున్నాయి’ అని సమాధానం.
11. నిరంతరమూ ఆప్తకాములై లోకంలో ఉండేటటువంటి మునులు అవిద్య, అజ్ఞానములను జయించినవాళ్ళేకానీ, జ్ఞానవిషయంలో సంపూర్ణత్వము పొందాము అనేటటువంటి అహంకారంలో లేరు వాళ్ళు. వారిని ఈ లోకంలో బాధించగలిగేటటువంటి వస్తువు ఏదీ లేదు.
12. ఏకాంతమంటే ఎవరూలేనిచోటికి పారిపోవడంకాదు. అందరిలో ఉండికూడా ఏకాంతం సంపాదించాలి. అనేకమందిలో ఉండికూడా తనలోతనుండగలగటం ఏకాంతం. కాబట్టి సాధనద్వారా తన స్వరూపమందు తాను సంపాదించుకోగలిగింది ఏకాంతంకానీ; ప్రాంతంలోనూ, దేశంలోనూ, కాలంలోనూ కనపడేది ఏకాంతంకాదు.
బ్రహ్మప్రవృత్తిమార్గాన్ని శాసించేవాడే.
13. ఈ వేదాలు, యజ్ఞాలు అన్నీకూడా బ్రహ్మముఖంలోంచి వచ్చినవే! ఇది ప్రవృత్తియేతప్ప నివృత్తికాదు. జ్ఞానమార్గమిదికాదని ఘంటాపథంగా జ్ఞానులు, పెద్దలు చెబుతున్నారు. సృష్టి ప్రవర్తిల్లి జీవులు శరీరాలుధరించి ఖర్మానుభవాన్నిపొందడం బ్రహ్మ అభిమతం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 39. గీతోపనిషత్తు - శాంతి సూత్రము - కర్తవ్యమనగా చేయవలసిన పని. కామ మనగా చేయదలచిన పని. తాను తలచిన పనులు చేయుటకాక, వలసిన పనులను చేయుట ముఖ్యము. ఇవి ఆరోహణ క్రమమునకు గడప వంటివి. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 71 📚*
*ఏ మనుజుడైతే రాగద్వేషములను విడుచునో, ఎవడైతే విషయముల యందు ఆసక్తి విడుచునో, మమకారమును అహంకారమును విడుచునో అట్టివాడు శాంతిని పొందునని భగవానుడు ఈ శ్లోకమున తెలుపుచున్నాడు. ఇందు నాలుగు స్థితులను వివరించుచున్నాడు.*
విహాయ కామాన్ య స్సర్వాన్ పుమాం శ్ఛరతి నిస్స్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతి మధిగచ్ఛతి || 71
ఇందు మొదటిది కామ విసర్జనము. సర్వమతముల యందు, సర్వశాస్త్రముల యందు కామమును విసర్జింపుమని తెలుపబడుచునే యుండును. కర్తవ్యము ననుసరించుట వలన మాత్రమే కామము విసర్జించుటకు వీలుపడునని తెలియవలెను.
కర్తవ్యమనగా చేయవలసిన పని. కామ మనగా చేయదలచిన పని. తాను తలచిన పనులు చేయుటకాక, వలసిన పనులను చేయుట ముఖ్యము. ఇవి ఆరోహణ క్రమమునకు గడప వంటివి.
అట్లు కర్తవ్యమును మాత్రమే చేయ దీక్ష పూనిన వానికి మార్గమున అనేకానేక విషయములు కన్పట్టుచుండును. అందనురక్తి కొన్నవాడు కర్తవ్య విముఖుడు కాగలడు.
విషయానురక్తుడు కర్తవ్యపాలనము చేయలేడు. అందుచే విషయాసక్తిని విసర్జించుచు, కర్తవ్యము నిర్వర్తించుచు సాగిపోవలెను. అటు పైన సాధకునకు మమకార మను అవరోధమేర్పడును. నాది అను భావమే మమకారము. తన శరీరము, తన వారు, తన సంపద అనునవి మమకార స్థానములు.
తనది అనుకొనినదంతయు నిజమునకు దైవమునదే అని భావించుట సాధనగ సాగవలెను. శరీరమునకు, తనను ఆశ్రయించిన వారికి, తన చుట్టూ ఏర్పడిన సంపదకు యజమాని దైవమే యనియు, తాను కేవలము ధర్మకర్త అనియు భావింప వలెను. ధర్మకర్తయనగా వాని యందు తన ధర్మము నిర్వర్తించుటే గాని యాజమాన్యము కాదు. ఇట్టి భావనను థిరపరుచుకున్నవానికే మమకారమను పొర తెగును.
అహంకారము వర్ణించుట తుది మెట్టు. కర్తవ్యమును చేకొని కామమును వర్ణించుట, కర్తవ్య పాలనమున ఆకర్షణీయమగు విషయముల యందు అనురక్తిని వర్ణించుట, "తనది” అను భావమును వర్ణించుట అను మూడు సోపానములను అధిరోహించిన సాధకుడు “తాను” అను భావమును కూడ వర్ణించుట తుది మెట్టు.
నిజమునకు తానులేడు. తానుగ దైవమే యున్నాడు. కాని తా నున్నాడననుకొను చున్నాడు. అట్లనుకొనుటయే అహంకారము.
తనకొక ప్రత్యేక అస్థిత్వము లేదు. దైవమే జీవుడుగా నుండగ, జీవుడు తానున్నాడను కొనుటయే మొదటి మాయావరణము. బంగారము లేక ఉంగరము లేదు. మట్టి లేక కుండ లేదు. సముద్రము లేక కెరటము లేదు. దైవము లేక జీవుడు లేడు. ఈ జ్ఞానము పూర్ణ జ్ఞానమునకు తుది మెట్టు. దీని నధిరోహించుటకు "తా నుండుట అనగా నేమి?" అను అంశముపై విచారణ తీవ్రముగ సాగవలెను.
సమాధానము దర్శించినపుడు అహంకారము నశించును. నిరహంకారి యగును. అతనిది స్థిరమైన శాంతి. అహంకారికి శాంతి లేదు. మమకారికి అసలు లేదు.
విషయానురక్తునకు బొత్తిగ శాంతి లేదు. కాముకునకు అశాంతి స్థిరముగ నుండును. ఈ నాలుగ సోపానములు అధిరోహింప జేయుటకే పదునెనిమిది అధ్యాయముల గీతోపదేశము.
ఈ సోపానముల నధిరోహించుటనే ఉపనిషత్తులు సూచించుచున్నవి. యోగవిద్య బోధించుచున్నది. బ్రహ్మవిద్య ఘోషించుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 186 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 33. When this concept ‘I am’ departs there would be no memory left that ‘I was’ and ‘I had’ those experiences, the very memory will be erased. 🌻*
The knowledge ‘I am’ is the very seed of memory and all information functions through it, it forms the basis of the mind. It is bound to tire out and hence there is sleep otherwise you would die if you don’t sleep.
But sleep is not the complete departure of the ‘I am’ it’s only held in abeyance and after sleep it gets refreshed and starts its activity again maintaining the continuity.
No wonder if your name is called aloud in sleep you wake up and respond saying ‘that’s me’! Physical death is the total departure of the ‘I am’ and nothing is retained.
For the ‘Realized One’ who has transcended the ‘I am’, memory and the ‘I am’ are available to him he may or may not use them, they are not ‘lodged’ in him anymore. Only the ‘Realized One’ can understand this state.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 63 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 27 🌻*
కాబట్టి నచికేతునికి కూడా ప్రధమముగా యమధర్మరాజు ఈ ఓంకారతత్వము యొక్క విశిష్టతను తెలియజెబుతూ ఓంకార తత్వము యొక్క వివరణని అందిస్తున్నారు.
ఆది ఓంకార శబ్ద వాచ్యము. ఏ పదము నుచ్ఛరించుటచేత ఏ వస్తువు శ్రోతకు స్ఫురించుచున్నదో ఆ వస్తువు ఆ పదమునకు వాచ్యమగును. ఆ పదము వాచికము. రామకృష్ణాది నామములనుచ్ఛరించునపుడు రాముని, కృష్ణుని రూపములు మనకు స్ఫురించునట్లుగా ఓంకారము నుచ్ఛరించుటచేత నామరూప రహితమైన, సూక్ష్మమైన పరబ్రహ్మమే స్ఫురించును. ఓంకారము వాచికము, పరబ్రహ్మము వాచ్యము. నీవెరుగగోరిన తత్వమిదియే.
ఈ పరబ్రహ్మతత్వమే నాశములేనిది. అన్నిటికంటే గొప్పది. అతి సూక్ష్మమైనది. మహత్తుకన్న మహత్తైనది. అణువుకన్న అణువైనదియునగు, ఈ బ్రహ్మము నెరిగిన వారి కోరికలన్నియు సిద్ధించును.
ఓంకార శబ్దము యొక్క, ఓంకార తత్వము యొక్క లక్షణాలని ప్రాధమికంగా మొట్టమొదట మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనము ఎవరికైనా సరే ఏదైనా ఒక శబ్దాన్ని గ్రహించగానే మానవ మేధస్సు (బుద్ధి) ఆ శబ్ద గ్రాహ్యతను దృశ్యరూపంగా మారుస్తుంది.
అంటే ఉదాహరణ ఏనుగు అనగానే నీకు తెలిసినటువంటి ఏనుగు యొక్క రూపాన్ని అది నీ కళ్ళముందు ఉంచుతుంది. ఏ శబ్దాన్ని విన్నప్పటికీ కూడా ఆ యా శబ్దముల యొక్క దృశ్యరూపాన్ని నీ కళ్ళ ముందు వుంచుతుంది.
సాకార పద్ధతిగా సాధనలతో చిన్నప్పటి నుండి సాధనలతో అలవాటు పడినటువంటి మానవ మేధస్సు ఆ యా నామరూపాలతో కూడుకున్నటువంటి అర్చామూర్తులను దృశ్య రూపంగా తన కళ్ళ ముందు వుంచుతూ వుంటుంది.
కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రాధమికంగా మొట్టమొదట తమతమ ఇష్ట దేవతా అర్చామూర్తులను, తమ తమ ఇష్టదేవతా రూపమైన సద్గురు మూర్తులను సాకార పద్ధతిగా భావించి ఆశ్రయించేటటువంటి విధానం ధ్యానంలో మొట్టమొదట ఏర్పాటు చేయబడింది.
అయితే ‘ఓం’ అనేటటువంటి శబ్దమును వినగానే నీలో నిరాకార తత్వమైనటువంటి ఆకాశమునకు అతీతమైనటువంటి దృశ్యము గోచరిస్తుంది. ఏ సాకార తత్వమూ ఈ ఓంకారతత్వము చేత నిరూపించబడటము లేదు.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే రామ అనగానే రాముని యొక్క ఆకారం మనకి స్ఫురిస్తుంది. కోదండ రాముడు, జానకి రాముడు, దశరధ రాముడు, పట్టాభి రాముడు అలా రకరకాలైనటువంటి రామనామంతోటి మనం అనుబంధపడివున్నాం కాబట్టి, ఎవరికి ఇష్టమైనటువంటి రామ రూపం ఆ కళ్ళ ముందు మెదలాడుతుంది.
అట్లాగే కృష్ణ శబ్దం వినగానే బాల కృష్ణుడో, గోపికా కృష్ణుడో, రాధా కృష్ణుడో, ధ్యానముద్రాంకిత కృష్ణుడో, గోవర్ధన గిరినెత్తిన కృష్ణుడో, కాళీయ మర్ధన సంఘటనలోని కృష్ణుడో, వెన్నదొంగిలించే కృష్ణుడో, రకరకాల రూపములైనటువంటి గీతా బోధకుడైనటువంటి గీతాచార్యుడైనటువంటి శ్రీ కృష్ణ మూర్తియో, విశ్వరూపమును ప్రదర్శించినటువంటి, విరాట్ రూపమును ప్రదర్శించినటువంటి కృష్ణమూర్తియో, ఎవరికైతే ధ్యాన మూర్తుల యందు ఏ ఆసక్తి కలిగిన వారు వుంటారో అటువంటి కృష్ణ మూర్తి యొక్క సందర్శనం జరుగుతుంది.
ఈ రకంగా నామ రూపములు స్ఫురిస్తూ వుంటాయి శబ్ద గ్రాహ్యత చేత. కారణమేమిటీ అంటే వాచ్యము, వాచకము. శబ్దరూపముగా వున్నప్పుడు వాచ్యమని, అది దృశ్యరూపము ధరించినప్పుడు వాచికమని పిలవబడుతున్నది. వాచ్య వాచికములు. లక్ష్య లక్ష్యార్ధములు.
వాచ్య వాచ్యార్ధములు అని అంటారనమాట. వేదాంత పద్ధతిలో ప్రతి ఒక్కరూ తప్పక గ్రహించవలసినది ఏమిటంటే వాచ్యార్ధ లక్ష్యార్ధములను తప్పక గ్రహించాలి. ఏమి విడవాలి అంటే వాచ్యము వాచికములో వాచ్యమును విడవాలి, వాచికమును ఆశ్రయించాలి.
అంటే వాచ్య వాచ్యార్ధములలో వాచ్యార్ధమనే లక్ష్యాన్ని, లక్ష్య లక్ష్యార్ధములలో లక్ష్యార్ధమనేటటువంటి దానిని ఆశ్రయించాలి. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 40 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
❇ *3. టెంప్లర్ ఆగ్జియన్ సీల్ :-*
ఈ సీల్ కారణంగా DNAలోని మొదటి ప్రోగులో 6వ బేస్ టోన్, 5వ స్ట్రాండ్ DNA లో 6వ బేస్ టోన్, 6వ స్ట్రాంగ్ DNA లో 6వ బేస్ టోన్ తొలగించడం జరిగింది. దీని ఫలితంగా జెనిటిక్ కోడ్ లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
వీటి కారణంగా మనం మన DNA యాక్టివేషన్ లో వచ్చే ఫలితాలను గుర్తించలేక పోతున్నాం. దీనివలన హైయ్యర్ డైమెన్షన్ కి క్వాలిఫై అవ్వలేక డిప్రెషన్ కి గురి అవుతున్నాం. మనల్ని మనం గుర్తించ లేక పోతున్నాం. ఈ సీల్స్ ని తొలగించుకుంటే మనం అసెన్షన్ సైకిల్ లో ఎదిగి ముందుకు వెళ్ళగలుగుతాం.
❇ *4. సెల్ డెత్ ప్రోగ్రామ్:-*
కణానికి తిరిగి సృష్టించడం అనే గుణం ఉంటుంది. *"సెల్ డెత్ ప్రోగ్రామ్"* అనే సీల్ కారణంగా మన శరీరంలోని కణాలు త్వరగా చనిపోవడం జరుగుతుంది. ఈ సీల్ కారణంగా కొత్త కణాలు పుట్టుక ఉండదు. పాతవి మరణిస్తూ ఉంటాయి. దీని కారణంగా శరీర అవయవాలు త్వరగా పాడవటం జరుగుతుంది. అలాగే ముసలితనం అనేది అతి త్వరగా కనిపిస్తుంది.
❇ *5. క్రౌన్ ఆఫ్ త్రోన్:-*
ఈ సీల్ తలచుట్టూ ముళ్ళకిరీటంలా ఉంటుంది. అతి సహజంగా బ్రహ్మరంధ్రం నుండి విశ్వ శక్తిని తీసుకొని ప్రాణమయ శరీరం అంతా శక్తితో నింపుకొని శరీర అవయవాలను శక్తితో నింపడం అనేది జరుగుతుంది. కానీ ఈ సీల్ కారణంగా విశ్వశక్తి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించ కుండా ఈ సీల్ అడ్డుకుంటుంది. అందుకే కొందరికి ధ్యానంలో శక్తిని గ్రహిస్తున్నప్పుడు తల భారంగా భరించలేనంత బరువుగా అనిపిస్తుంది.
దీనికి కారణం *" క్రౌన్ ఆఫ్ త్రోన్"* అనే ముళ్ళ కిరీటమే. ఈ సీల్ మనకు హైయ్యర్ డైమెన్షన్ ల కనెక్షన్ అందకుండా చేస్తుంది. 4వ డైమెన్షన్ నుండి 15వ డైమెన్షన్ వరకు ఎదగవలసిన మనం ఎదగకుండా ఇది అడ్డుకుంటుంది. 4 నుండి 15 డైమెన్షన్ వరకు విస్తరించి ఉన్న మన యొక్క ఆత్మ స్థితిని మనకు దక్కకుండా చేస్తుంది.
ఆత్మ స్థితిని నిరంతరం వినియోగిస్తూ ఎదగవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇది జరగడం లేదు. ఉన్నత తలాల యొక్క జ్ఞానం, శక్తి, స్థితులను గ్రహించి మనం 3వ పరిధి భూమిని దాటాలి. కానీ ఇది మనల్ని 3వ పరిధి భూమిని దాటకుండా చేస్తుంది.
❇. *6.జీటా సీల్:-*
ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన భౌతిక శరీరంలోని డీఎన్ఏలో 4వ ప్రోగులో 2 బేస్ టోన్ మరి 2వ,3వ ఓవర్ టోన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే భూమికి కూడా చేయడం జరిగింది. దీని కారణంగా భూమి యొక్క శక్తి అయిన హైయ్యరార్క్ (భూమి కోర్లో ఉండే కుండలిని శక్తి) బయటకు రాకుండా కంచెలా వేయడం జరిగింది.
దీని కారణంగా భూమి శక్తిని మనం పొందలేకుండా ఉన్నాం. మనం మన భౌతిక అవసరాలు భూమి శక్తితో తీర్చుకుంటాం కానీ...ఇది మన భౌతిక అవసరాలు తీరకుండా చేస్తుంది.
జీటాసీల్ కారణంగా మన ఆత్మస్థితి (సోల్ ఐడెంటిటీ)ని, హైయ్యర్ సెల్ఫ్ ని (పూర్ణాత్మని) మరి ఇన్ ట్యూషనల్ బాడీ (అంతర్వాణి ప్రబోధ శరీరానికి) మొదలైన మేలుకొలుపు(అవేకనింగ్) శక్తులను మనం పొందకుండా ఇది అడ్డుపడుతుంది.
4వ ప్రోగు DNAలో ఈ జీటా సీల్ కారణంగా మన యొక్క ఆత్మ సామర్థ్యాలు బ్లాక్ చేయబడి ఉన్నాయి. దీని వలన సెల్ఫ్ అవేకెనింగ్, సెల్ఫ్ అన్ కండీషనల్ లవ్, ఓమ్ని లవ్ (దైవ ప్రేమ)ను పొందలేకపోతున్నాము.
5వ ప్రోగుని డెవలప్ కాకుండా ఈ జీటాసీల్ బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా మనం త్వరితగతిన లోయర్ ఎంటిటీస్(సూక్ష్మ జీవులు)కి కనెక్ట్ అవుతాం. ఈ ప్రక్రియను *"ఫ్రీక్వెన్సీ కంచె"* అంటాం. అంటే ఎప్పటికప్పుడు ఇవి మన ఫ్రీక్వెన్సీని అడ్డుకుంటూ ఉంటాయి.
దీని కారణంగా మనకి ఆస్ట్రల్ అవేర్నెస్, ఆస్ట్రల్ ట్రావెల్, ఇన్ ట్యూషన్ ఫ్రీక్వెన్సీ లోకి మనం వెళ్ళి వీటిని పొందకుండా ఈసీల్ అడ్డుపడుతుంది. మనకి వచ్చిన విజన్స్ కూడా మరచి పోవడానికి కారణం ఈ జీటాసీల్. దీనిని క్రీస్తుశకం 1748 వ సంవత్సరంలో మనలో పెట్టడం ప్రారంభించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 23 / Sri Vishnu Sahasra Namavali - 23 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*🍀. మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 3వ పాద శ్లోకం*
*23. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |*
*నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ‖ 23 ‖*
గురుర్గురుతమః ---
గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;
గురుః ---
సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;
గురుతమః ---
ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.
ధామ ---
పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.
సత్యః ---
మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.
సత్యపరాక్రమః ---
నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.
నిమిషః ---
యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)
అనిమిషః ---
ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.
స్రగ్వీ ---
వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.
వాచస్పతిః ---
వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.
ఉదారధీః ---
ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు. వాచస్పతి ఉదారధీః - పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 23 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*🍀. Sloka for Midhuna Rasi, Arudra 3rd Padam*
*23. gururgurutamō dhāmaḥ satyaḥ satyaparākramaḥ |*
*nimiṣō nimiṣaḥ sragvī vācaspatirudāradhīḥ || 23 ||*
Guruḥ:
The greatest teacher.
Gurutamaḥ:
One who is the teacher of all forms of knowledge.
Dhāma:
The Supreme Light.
Satyaḥ:
One who is embodied as virtue of truth specially.
Satyaparākamaḥ:
One of unfailing valour.
Nimiṣaḥ:
One whose eye-lids are closed in Yoga-nidra.
Animiṣaḥ:
One who is ever awake.
Sragvī:
One who has on Him the necklace called Vaijayanti, which is strung with the subtle aspects of the five elements.
Vācaspatir-udāradhīḥ:
Being the master of Vak or word i.e. knowledge, He is called so. As his intellect perceives everything, He is Udaradhih. Both these epithets together constitute one name.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment