✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 7 🌻
229. సాధారణముగా మరణము సమీపించు ఘడియలందు సూక్ష్మ శరీరమును , జీవశ క్తియు స్థూలదేహమునుండి పూర్తిగా వేరగును .కాని స్థూలదేహముతో గల సంబంధమును మనస్సు , మరణానంతరము 5 రోజుల వరకు కాపాడును .మరియొకప్పుడు 5 రోజుల తరువాత 7 రోజుల వరకు యీ సంబంధమును కాపాడును .
230. ఆత్మ , భౌతికలోకానుభవమును పొందుచున్నప్పుడు , జనన - మరణములు ;కష్ట - సుఖములు ; పుణ్య పాపములు , మొదలైన ద్వంద్వానుభవములు అన్నింటిని , ఈ స్థూల రూపమే పొందుచున్నది .
231. ఆత్మకు స్థూలరూపము నీడవంటిది .
232. ఆత్మ పొందుచున్న అనుభవములన్నియు , తనకు నీడ యైన స్థూలరూపానుభవములేకాని , ఆత్మకు ఎట్టి అనుభవము లేదు .
233. సంస్కారముల కారణముననే , ఆత్మ , శరీరములే తాననెడి అనుభవమును పొందుచున్నది .ఈ అజ్ఞానమునకు కారణము ,సమస్త అనుభవములకు కారణము ---ఈ సంస్కారములే .
234. రూపము లేని ఆత్మ , జనన_మరణములు లేని ఆత్మ ; అనంతమైన ఆత్మ ; శాశ్వతమైన ఆత్మ ; కష్ట -సుఖములు సుఖ _ దు:ఖములు మొదలగు ద్వంద్వములకు అతీతమైన ఆత్మ తనకు _ రూపమున్నదనియు , జనన_మరణములు పొందుచుంటిననియు , పరిమితిగల దాననియు, అనిత్యమైన దాననియు , కష్ట సుఖములు పుణ్య పాపములు _పొందుచుంటిననియు అనుభవుమును పొందుటకు సంస్కారములే కారణము .
ఈ అజ్ఞానమునకు కూడా సంస్కారములే కారణము . ఈ ద్వంద్వ అనుభవము లన్నియు స్థూల రూపమే పొందుచున్నది .
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
No comments:
Post a Comment